నిజ నిర్ధారణ: పాకిస్థాన్‌లో బలవంతంగా జరిగుతున్న ఇస్లామిక్ మత మార్పిడుల గురించి మాట్లాడుతున్న వ్యక్తి హిందువు కాదు

పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న బలవంతపు ఇస్లామిక్ మత మార్పిడుల గురించి ఓ వ్యక్తి పార్లమెంట్ లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఉద్వేగభరితమైన ప్రసంగం చేస్తూ హిందూ పిల్లలపై దయ కోసం వేడుకుంటున్న ఆ వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన హిందూ ఎంపీగా పేర్కొంటూ షేర్ అవుతున్న ఈ వీడీయో సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది.

Update: 2023-02-07 04:30 GMT

పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న బలవంతపు ఇస్లామిక్ మత మార్పిడుల గురించి ఓ వ్యక్తి పార్లమెంట్ లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఉద్వేగభరితమైన ప్రసంగం చేస్తూ హిందూ పిల్లలపై దయ కోసం వేడుకుంటున్న ఆ వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన హిందూ ఎంపీగా పేర్కొంటూ షేర్ అవుతున్న ఈ వీడీయో సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది.

2.20 నిమిషాల వీడియోలో, 12 ఏళ్ల బాలికను ఇస్లాంలో చేరడానికి ఎలా బలవంతం చేశారో అతను వివరించడం మనం వినవచ్చు. తరువాత, అతను పాకిస్తాన్‌లోని మైనారిటీలపై జరిగిన అకృత్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను అభ్యర్థిస్తూ ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నాడు.

“ఒక హిందూ ఎంపీ పాక్ పార్లమెంట్‌లో ముకుళిత హస్తాలతో ఎలా వేడుకుంటున్నాడో చూడండి... మాపై దయ చూపండి, మా కుమార్తెలను రక్షించండి...” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయబడింది.

Full View


Full View



నిజ నిర్ధారణ:

వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పాకిస్థాన్‌లోని హిందూ ఎంపీ అనే వాదన తప్పుదారి పట్టిస్తోంది. అతను పాకిస్తాన్‌కు చెందిన క్రైస్తవ రాజకీయ నాయకుడు, ఈ వీడియో ఇటీవలిది కాదు.

వీడియో నుండి సంగ్రహించిన చిత్రంతో పాటు ఎంపి అనే కీవర్డ్‌లను ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, "పాకిస్తాన్‌లోని క్రిస్టియన్ ఎంపీ తారిక్ మాసిహ్ గిల్, అక్కడి చిన్నారుల బాధల గురించి మాట్లాడుతున్న తారిక్ మాసిహ్ గిల్" అనే టైటిల్‌తో అదే వీడియోను షేర్ చేసిన రెడ్డిట్ పోస్ట్‌ లభించింది.

దీని నుండి సూచనలను తీసుకొని, కీలక పదాలను ‘తారిక్ మసీహ్ గిల్ ఇన్ పార్లమెంట్’గా మార్చినప్పుడు, అనేక ఫలితాలను లభించాయి.

"బలవంతపు మత మార్పిడులపై పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు తారిక్ మసిహ్ గిల్ బోల్డ్ స్పీచ్" శీర్షికతో ఎన్వ్య్ న్యూస్ ప్రచురించిన యూట్యూబ్ వీడియో లభించింది. ఛానెల్ గురించిన పేజీ ప్రకారం, ఎన్వ్య్ న్యూస్ ఉర్దూలో ఒక పాకిస్తానీ వార్తా ఛానెల్.

Full View

దీనిని తారిక్ మసీహ్ గిల్ ఎంపీఏ (ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు) అనే ఛానెల్ కూడా పోస్ట్ చేసింది.

Full View

ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్ పిటీవి పార్లమెంట్‌లో చూడవచ్చు, ఇది పాకిస్థాన్ పార్లమెంట్ కార్యకలాపాలను కవర్ చేస్తుంది. వైరల్ వీడియోతో పోలిస్తే, ఆగస్టు 11, 2022న పిటీవి పార్లమెంట్‌లో ప్రచురించబడిన వీడియోలోని 40.22 నిమిషాల నుండి 42.22 నిమిషాల వరకు అదే ప్రసంగాన్ని చూడవచ్చు.

పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ అధికారిక వెబ్‌సైట్‌ తనిఖీ చేసినప్పుడు, మిస్టర్ తారిక్ మసీహ్ గిల్ పార్లమెంటరీ సెక్రటరీ: మానవ హక్కులు మరియు మైనారిటీల వ్యవహారాలు అని ఆయన వివరాలు లభించాయి. ఆయన హిందువుని కాదని క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారనీ అందులో ఉంది.

కనుక, పాకిస్తాన్‌లో బలవంతపు మతమార్పిడుల గురించి ఉద్వేగభరితమైన ప్రసంగం చేస్తున్న వ్యక్తి హిందువు కాదు, అతను క్రైస్తవ సమాజానికి చెందినవాడు. క్లెయిం తప్పుదారి పట్టించేది.

Claim :  The man speaking in the video is Hindu MP in Pakistan
Claimed By :  Twitter Users
Fact Check :  Misleading
Tags:    

Similar News