ఫ్యాక్ట్ చెక్: ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లుగా వైరల్ అవుతున్న వీడియో నటీనటులతో చిత్రీకరించింది. ఇందులో ఎలాంటి మతపరమైన కోణం లేదు
ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లుగా వైరల్ అవుతున్న వీడియో నటీనటులతో
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతుంటాయో అసలు ఊహించలేము. కొన్ని కొన్ని ఘటనలు నిజంగా జరిగినవే అంటూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. వాటిని ప్రజలు నమ్మేసే అవకాశం కూడా ఉంది. అందరికీ ఏది నిజం, ఏది అబద్దం అని తెలుసుకోవాలని ఉండదు. వీడియోను చూసేయడం.. నమ్మేయడం.. షేర్ చేయడం.. ఇదే పనిగా పెట్టుకుని ఉంటారు కొందరు. కాబట్టి నిజం కంటే అబద్ధమే ఎక్కువగా షేర్ అవుతూ ఉంటుంది.
పోలీసు అధికారులు ఓ వ్యక్తిని పార్క్ లాంటి ప్రదేశంలో పట్టుకున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. ఇర్ఫాన్ అనే వ్యక్తి రవిగా నటిస్తూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని ఆ పోస్టులు చెబుతున్నాయి. పోలీసులు అతడిని పట్టుకున్నారనే వాదనతో పోస్టులను వైరల్ చేస్తున్నారు.
"सोशल मिडिया के माध्यम से
#मुस्लिम सख्श ने हिन्दू नाम बताया
ताकि #लड़की का विश्वास जीत उसे
उपयोग कर सके
पुलिस ने बीच जंगल में जा पकड़ा तो
सच्चाई सामने आई एक और लव
#जिहाद की कहानी
#alert #akbar #sanatan #love #socialmedia" అంటూ పోస్టులు పెట్టారు. సోషల్ మీడియాలో మహిళలను ట్రాప్ చేయడానికి హిందూ పేర్లు పెట్టుకుంటూ ఉన్నారని, పోలీసులు అలాంటి వారిలో ఒకరిని అడవిలో పట్టుకోవడంతో అసలు నిజం బయటకు వచ్చింది అంటూ ఆ పోస్టుల్లో తెలిపారు.
https://www.youtube.com/watch?
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ లను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇది నటీనటులతో చిత్రీకరించిన వీడియో.
వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించగా ఇది నటీనటులతో చిత్రీకరించిన వీడియోలా అనిపించింది. పోలీసు వేషధారణలో ఉన్న వ్యక్తి సదరు వ్యక్తిని పట్టుకోగానే పై జేబులో ఉన్న కార్డులను తీసి చూపించేయడం. అమ్మాయి మధ్యలో కలుగజేసుకుని మాట్లాడడం, పోలీసు అధికారిలా నటిస్తున్న వ్యక్తి రికార్డు చేయడం ఆపొద్దు అని చెప్పడం.. ఇలాంటి వన్నీ స్క్రిప్టెడ్ వీడియోలలో కనిపిస్తాయి.
వీడియోలోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియోను పోస్టు చేసిన అకౌంట్ మాకు లభించింది.
monty_deepak_sharma_ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అదే వీడియో లభించింది. 3 డిసెంబర్ 2025న వైరల్ వీడియోను అప్‌లోడ్ చేశారు.
"पुलिस ने अब्दुल को लड़की के साथ पार्क में पकड़ा नाम बदला था" అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియోలో ఒక డిస్క్లైమర్ కూడా ఉంది. ‘ఈ కంటెంట్ వినోద ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియో పూర్తిగా వినోదం కోసం ఉద్దేశించబడింది. ఏదైనా కమ్యూనిటీ లేదా సమూహాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించినది కాదు.’ అని స్పష్టంగా తెలియజేశారు. దీన్ని బట్టి ఇది నిజమైన ఘటన కాదని తెలుస్తోంది. ఇలాంటి వీడియోలు ప్రజలను సులువుగా తప్పుదోవ పట్టించగలవు.
ఈ పేజీలోని బయో ప్రకారం, మాంటీ దీపక్ శర్మ ఒక డిజిటల్ కంటెంట్ సృష్టికర్త. వైరల్ వీడియోను స్క్రిప్ట్ చేశారని, నిజమైన సంఘటనకు సంబంధించింది కాదని స్పష్టం చేస్తుంది. మాంటీ దీపక్ శర్మ ఫేస్‌బుక్ పేజీలో కూడా మేము అదే వీడియోను కనుగొన్నాము. ఆడవాళ్లను అలర్ట్ చేస్తూ, పలు అంశాలపై అవగాహన కల్పించేలా నటీనటులతో వీడియోలను సృష్టిస్తూ వస్తున్నారు.
https://www.facebook.com/reel/
ఈ సోషల్ మీడియా ఖాతాలలో ‘డిజిటల్ సృష్టికర్త’గా కూడా అభివర్ణించుకున్నాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉన్నాయి.
ఈ అకౌంట్ లోని పలు వీడియోలను వినోద ప్రయోజనాల కోసం మాత్రమే అంటూ స్పష్టం చేసి అప్లోడ్ చేశారు. ఒక వీడియోలోని వ్యక్తులను పలు వీడియోలలో చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో కంటెంట్ క్రియేటర్ల సృష్టి. నిజంగా చోటు చేసుకున్న ఘటన కాదు.
Claim : హిందూ అమ్మాయిని ప్రేమించడానికి ముస్లిం వ్యక్తి హిందువుగా నటిస్తూ ఉండగా
Claimed By : Social Media Users
Fact Check : Unknown