ఫ్యాక్ట్ చెక్: పుష్ప-2 ప్రీమియర్ షోకు సంబంధించిన విజువల్స్ ను మెస్సి కోసం హైదరాబాద్ లో ఎగబడిన జనం అంటూ ప్రచారం చేస్తున్నారు

పుష్ప-2 ప్రీమియర్ షోకు సంబంధించిన విజువల్స్ ను మెస్సి కోసం హైదరాబాద్ లో ఎగబడిన జనం అంటూ

Update: 2025-12-15 10:58 GMT

ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ భారతదేశ పర్యటనకు వచ్చారు. భారతదేశంలో లియోనెల్ మెస్సీ మొదటగా కోల్‌కతాలో అడుగుపెట్టాడు. మూడు రోజుల పాటు జరిగే నాలుగు నగరాల గోట్ టూర్‌లో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు భారత దేశానికి వచ్చాడు. ఈ టూర్‌లో ప్రజా ప్రదర్శనలు, ఫుట్‌బాల్ ఈవెంట్‌లు, ప్రముఖులతో సమావేశాలు ఉంటాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కలకత్తా టూర్ ప్రారంభం అల్లకల్లోలంగా మారింది. ప్రేక్షకులు చాలా మంది నిరాశ చెందారు. ఆయన తదుపరి గమ్యస్థానం హైదరాబాద్ లో మాత్రం గొప్పగా సాగింది.


లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంను సందర్శించారు. కార్యక్రమం అనుకున్న విధంగానే జరిగింది. జనం అక్కడే ఉండిపోయారు, గతంలో జరిగిన తప్పుల కారణంగా లియోనెల్ మెస్సీ స్టేడియంలో దాదాపు గంటసేపు ఉన్నారు. ఇంటర్ మయామి సహచరులు లూయిస్ సువారెజ, రోడ్రిగో డి పాల్‌లతో కలిసి మెస్సీ GOAT కప్ పెనాల్టీ షూటౌట్‌లో పాల్గొన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారితో ఫుట్‌బాల్ దుస్తులలో మైదానంలోకి వచ్చారు.

అయితే వైరల్ అవుతున్న ఓ వీడియో లియోనెల్ మెస్సి హైదరాబాద్ లో ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటన అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా అదే వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేశాయి.

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు

న్యూస్ ఆర్టికల్స్ ను కూడా ఇక్కడ చూడొచ్చు. 

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇది



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఇది హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 సినిమా ప్రీమియర్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన.

మెస్సి పర్యటనకు సంబంధించి డిసెంబర్ 13 నుండి 15 వరకు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో పర్యటన ఉండనుంది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు మెస్సిని చూడడానికి ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. హైదరాబాద్ లో మెస్సీ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడం, ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లడం, తరువాత 7v7 మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో సందడి చేయడం లాంటివి ఉన్నాయి. మెస్సీని స్వాగతించేందుకు అభిమానులు భారీ ఎత్తున వచ్చారని ఎలాంటి వీడియోలు లభించలేదు.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా మెస్సి కారును ప్రజలు చుట్టుముట్టినట్లుగా ఎలాంటి వీడియోలు, మీడియా కథనాలు మాకు లభించలేదు.

ఇక వైరల్ వీడియో లోని స్క్రీన్ షాట్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాం. చాలా రిజల్ట్స్ ఇవి అల్లు అర్జున్ తన సినిమా పుష్ప-2 ప్రీమియర్ షో కు వచ్చినట్లుగా తెలిపాయి.

అందుకు సంబంధించి పలు వీడియోలను పరిశీలించి చూశాం. అందులోని బ్యాగ్రౌండ్ చాలా వరకూ వైరల్ వీడియోలను పోలి ఉంది.

Full View


Full View


Full View


హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడకు వచ్చినట్లు ఫుటేజ్‌లో ఉంది.


అదే విషయాన్ని ఆగస్టు 15న నెటిజన్ పోస్టు చేశాడు. ప్రీమియర్ షోకు హాజరైన విషయాన్ని అసలు మరచిపోలేకపోతున్నా అంటూ స్పష్టం చేశాడు.



వైరల్ అవుతున్న వీడియో డిసెంబర్ 4-5 మధ్య 2024లో చోటు చేసుకుందని మేము ధృవీకరించాం. వైరల్ వీడియోకు మెస్సి హైదరాబాద్ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదు.


Claim :  ఈ వీడియో పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్, 2024 హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఘటన
Claimed By :  Social Media Users And Media
Fact Check :  Unknown
Tags:    

Similar News