ఫ్యాక్ట్ చెక్: 2025 భారత్-పాకిస్తాన్ వివాదం తర్వాత 163 మంది పైలట్లు రాజీనామా చేశారంటూ వైరల్ అవుతున్న పత్రాలు నిజమైనవి కావు.

భారత్-పాకిస్తాన్ వివాదం తర్వాత 163 మంది పైలట్లు రాజీనామా చేశారంటూ

Update: 2025-12-16 17:56 GMT

పాకిస్తాన్ గూఢచర్య నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అస్సాం పోలీసులు భారత వైమానిక దళానికి (IAF) చెందిన రిటైర్డ్ అధికారిని అరెస్టు చేశారు. నిందితుడిని తేజ్‌పూర్‌లోని పాటియా ప్రాంతానికి చెందిన కులేంద్ర శర్మగా గుర్తించారు. పోలీసుల నిఘా, ప్రాథమిక దర్యాప్తు తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు.


వార్తా నివేదికల ప్రకారం, పాకిస్తాన్ గూఢచర్య సంస్థకు చెందిన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడని, సున్నితమైన సమాచారాన్ని అందించాడని ఆరోపిస్తూ శర్మను విచారిస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. అతని మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ నుండి అనుమానాస్పద పదార్థాలు స్వాధీనం చేసుకున్నప్పటికీ, కొంత డేటాను డిలీట్ చేశారని భావిస్తున్నారు. అస్సాంలోని సోనిత్‌పూర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హరిచరణ్ భూమిజ్ మాట్లాడుతూ, కులేంద్ర శర్మకు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానం ఉన్నప్పటికీ, దర్యాప్తు పూర్తయ్యే వరకు దానిని నిర్ధారించలేమని అన్నారు.

అఫీషియల్ పత్రాలంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. 2017 నుండి 2025 వరకు భారత వైమానిక దళం అధికారుల రాజీనామాల వివరాలను కలిగి ఉన్న పత్రం అంటూ ప్రచారం చేస్తున్నారు. భారత వైమానిక దళం (IAF) నుండి సమాచార హక్కు (RTI) ప్రతిస్పందనగా చెప్పుకునే ఒక పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది.

2025 భారతదేశం-పాకిస్తాన్ వివాదం తర్వాత 163 మందితో సహా ఐదు సంవత్సరాలలో 780 మంది పైలట్లు రాజీనామా చేశారని, అమరవీరుల పైలట్ల కుటుంబాలు మౌనంగా ఉన్నాయని పోస్ట్ ఆరోపిస్తోంది.



వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆగస్టు 2020 RTI సమాధానంలో 2019 వరకు మాత్రమే రాజీనామాలకు సంబంధించిన డేటా ఉంది. వైరల్ పోస్టుల్లో పేర్కొన్న గణాంకాలకు అధికారిక రికార్డులు లేదా విశ్వసనీయ వార్తా నివేదికలు ఏవీ మద్దతు ఇవ్వడం లేదు.

సంబంధిత కీలకపదాలను ఉపయోగించి వైరల్ పోస్టులను శోధించాము. ఐదు సంవత్సరాలలో 780 మంది పైలట్లు రాజీనామా చేశారని, భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం తర్వాత 163 మంది పైలట్లు రాజీనామా చేశారనే వాదనకు మద్దతు ఇచ్చే లింక్‌లు, చిత్రాలు లేదా పత్రాలు మాకు లభించలేదు.

అలాంటి సంఘటనలు జరిగి ఉంటే, వాటిని మీడియా సంస్థలు ప్రచురించి లేదా ప్రసారం చేసి ఉండేవి.

2010 మరియు 2018 మధ్య మొత్తం 798 మంది భారత వైమానిక దళం (IAF) పైలట్లు రాజీనామా చేశారంటూ ఇండియా టుడే 18 ఆగస్టు 2020న ప్రచురించిన ఒక కథనాన్ని మేము కనుగొన్నాము. సమాచార హక్కు (RTI) దరఖాస్తుకు ప్రతిస్పందనగా ఈ సమాచారాన్ని IAF పంచుకుంది.

2016, 2017 సంవత్సరాల్లో పైలట్ల రాజీనామాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని నివేదిక తెలిపింది. 2016లో 100 మంది పైలట్లు, 2017లో 114 మంది పైలట్లు IAF నుండి నిష్క్రమించారని ఇండియా టుడే కథనం నివేదించింది. 2015లో అత్యల్పంగా 37 మంది రాజీనామా చేశారు. ప్రతి సంవత్సరం దాదాపు 80 మంది పైలట్లు రాజీనామా చేశారు. 2018 ఫిబ్రవరిలో IAF 376 పైలట్ల కొరతను ఎదుర్కొందని, 4,231 మంది పైలట్లు ఉండగా 3,855 మంది పైలట్లు ఉన్నారని నివేదిక తెలిపింది. రాజీనామా చేసిన 289 మంది పైలట్లకు ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో చేరడానికి NOCలు ఇచ్చారని, గత దశాబ్దంలో వైదొలిగిన వారిలో మూడింట ఒక వంతు మంది ఇప్పుడు వాణిజ్య విమానాలను నడుపుతున్నారని కూడా ఐఏఎఫ్ పేర్కొంది.


ఆ కథనంలో దరఖాస్తుదారుడు అశోక్ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన RTI సమాధానానికి సంబంధించిన చిత్రం కూడా ఉంది. ఆ పత్రం మునుపటి సంవత్సరాలకు సంబంధించిన రాజీనామా సంఖ్యలను చూపించింది కానీ 2025కి సంబంధించిన డేటా కాదు. వైరల్ చిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే అనేక తేడాలు/పొరపాట్లు కూడా కనిపిస్తాయి.

రెండింటి మధ్య పోలికలను చూడొచ్చు



 


షీట్‌లోని వరుసలు సరిగ్గా లేవని కూడా మేము కనుగొన్నాము. ఇది డాక్యుమెంట్ ఎడిట్ చేశారని సూచిస్తుంది.

ఆగస్టు 2020లో జారీ చేసిన అసలు RTI సమాధానంలో 2019 వరకు మాత్రమే రాజీనామాకు సంబంధించిన గణాంకాలు ఉన్నాయి.

ది క్వింట్ వైరల్ అవుతున్న వాదనను తోసిపుచ్చింది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని ప్రచురించింది. ఆగస్టు 2020లో జారీ చేసిన అసలు RTI సమాధానంలో 2019 వరకు మాత్రమే గణాంకాలు ఉన్నాయి. ఇటీవలి అధికారిక రికార్డులు లేదా వార్తా నివేదికలు పోస్ట్‌ల్లో ఉన్న సంఖ్యలకు మద్దతు ఇవ్వలేదు.

"ఆపరేషన్ సిందూర్ తర్వాత IAF పైలట్లు రాజీనామా చేస్తున్నారని ఫోటోషాప్ చేసిన పోస్టులతో తప్పుడు ప్రచారం జరుగుతోంది" అని
ఇండియా టుడే
పేర్కొంది. అసలు RTI ప్రతిస్పందనను 2020లో ఇండియా టుడే పొందింది. 

https://www.thequint.com/news/webqoof/doctored-rti-claims-163-iaf-pilots-resigned-post-india-pak-2025-fact-check#read-more#read-more#read-more#read-more

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. ఆగస్టు 2020 నాటి RTI సమాధానంలో 2019 వరకు రాజీనామా డేటా మాత్రమే ఉంది. ఈ దావాలో పేర్కొన్న గణాంకాలను ధృవీకరించే అధికారిక రికార్డులు లేదా విశ్వసనీయ వార్తా నివేదికలు లభించలేదు.


Claim :  ఆగస్టు 2020 నాటి RTI సమాధానం 2019 వరకు మాత్రమే డేటాను అందిస్తుంది. వైరల్ అవుతున్న గణాంకాలను నిర్ధారించే ఇటీవలి అధికారిక రికార్డులు, విశ్వసనీయ వార్తా నివేదికలు లేవు.
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News