ఫ్యాక్ట్ చెక్: ఓ సాధువు 130 కిలోగ్రాముల బరువును తన శక్తుల ద్వారా ఎత్తుతున్నట్లు వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
సాధువు 130 కిలోగ్రాముల బరువును తన శక్తుల ద్వారా ఎత్తుతున్నట్లు వైరల్ అవుతున్న వీడియో
హైపర్-రియలిస్టిక్ వీడియోలను AI ద్వారా సృష్టిస్తూ ఉన్నారు. అవి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా సైట్లలో వైరల్ అవుతున్నాయి. కంటెంట్ సృష్టికర్తలు ఈ ఎన్నో వీడియోలను సృష్టిస్తూ ఉన్నారు. చాలా వరకూ నిజమైనవని నమ్మేస్తూ ఉన్నారు. ప్రజలు మోసపోడానికి ఇలాంటి వీడియోలు కూడా ఒక కారణం. రాబోయే రోజుల్లో నిజమైన ఘటన చోటు చేసుకున్నా కూడా అది నిజమని నమ్మేవాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉంది.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. షేర్ చేసిన ఆ వీడియోలో ఒక యోగి తన మనస్సును మాత్రమే ఉపయోగించి జిమ్‌లో 130 కిలోల బరువును ఎత్తడం చూడొచ్చు. అది నిజమైన సంఘటన అని పలువురు చెబుతున్నారు. ఆ దృశ్యాలలో యోగి జిమ్ ప్లాట్‌ఫామ్‌పై కూర్చున్నట్లు చూపించగా, 130 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు గాలిలోకి పైకి లేచినట్లు కనిపించింది. అది అంతా ఆయన మనస్సు నియంత్రణలో ఉందని నెటిజన్లు పోస్టుల్లో చెప్పారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇదే
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.
మైండ్ పవర్ ఉపయోగించి ఒక యోగి జిమ్‌లో 130 కిలోగ్రాములు ఎత్తాడనే వాదన తప్పు. ఈ వీడియో AI- జనరేట్ చేసినట్లు, నిజం కాదని తేలింది. వైరల్ వీడియో లోని ముఖాలు చాలా అస్పష్టంగా ఉన్నాయి. ఎలాంటి హావభావాలను ప్రదర్శించలేదని తెలుస్తోంది. ఏదైనా అలాంటి వీడియోలలో మనం తప్పకుండా మార్పులను చూస్తూ ఉంటాం. కానీ అలాంటిది ఏమీ జరగలేదంటే.. ఇది ఏఐ ద్వారా సృష్ఠించిన వీడియోలు అంటూ స్పష్టం చేస్తుంది.
ఫుటేజ్ ప్రామాణికతను ధృవీకరించడానికి, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లపై గూగుల్ లెన్స్‌ని ఉపయోగించి మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము.
ఇది ఒకేలాంటి వాదనలతో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న అనేక సారూప్య వీడియోలను చూపించింది. డిసెంబర్ 2, 2025న ఫేస్‌బుక్ పేజీ దేశీ కళాకారిలో పోస్ట్ చేయబడిన అటువంటి వీడియోలో అదే వివరణ ఉంది. “భారతీయ యోగి తన మనస్సు శక్తిని ఉపయోగించి జిమ్‌లో 130 కిలోలు ఎత్తాడు!” అని అందులో ఉంది.

అదే పేజీలోని మరొక వీడియోలో “భారతీయ బాబా జీ తన చేతులను ఉపయోగించకుండా జిమ్‌లో 150 కిలోలు ఎత్తాడు” అని పేర్కొంది. ఈ పోస్ట్ వైరల్ వీడియోను పోలి ఉందని కనుగొన్నాం.
ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ ఉంది.
ఈ ఫేస్‌బుక్ పేజీలో క్రమం తప్పకుండా డిజిటల్‌గా జనరేట్ చేసిన వీడియోలను సృష్టించి షేర్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అయింది. ఫేస్‌బుక్ పేజీని నిశితంగా పరిశీలిస్తే, అది కృత్రిమ మేధస్సును ఉపయోగించి సృష్టించినట్లుగా స్పష్టం చేశారు.
వినోద ప్రయోజనాల కోసం వీడియోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తున్నారని తేలింది. ఈ వివరాలను ఖాతా యజమాని బయోలో స్పష్టంగా పేర్కొన్నారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌తో పాటు, వైరల్ వీడియోను హైవ్ మోడరేషన్ ఉపయోగించి విశ్లేషించారు. హైవ్ మోడరేషన్ అంచనా ప్రకారం వైరల్ క్లిప్ 96% AI ద్వారా సృష్టించారు.
ఒక యోగి తన మనస్సుని ఉపయోగించి 130 కిలోగ్రాముల బరువు ఎత్తాడంటూ వైరల్ అవుతున్న వీడియో నిరాధారమైనది.
ఈ వీడియోను కృత్రిమ మేధస్సును ఉపయోగించి సృష్టించారు. నిజమైన సంఘటనకు సంబంధించింది కాదు.
Claim : వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
Claimed By : Social Media Users
Fact Check : Unknown