నిజ నిర్ధారణ - రాహుల్ గాంధీ మహాత్మా గాంధీతో మాట్లాడానని చెప్పలేదు, వీడియో క్రాప్ చేసారు

రాహుల్ గాంధీ ఒక సభలో ప్రసంగిస్తున్న వీడియో సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, అతను మహాత్మా గాంధీతో మాట్లాడినట్లు చెప్పడం వినవచ్చు.

Update: 2022-08-19 13:13 GMT

రాహుల్ గాంధీ ఒక సభలో ప్రసంగిస్తున్న వీడియో సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, అతను మహాత్మా గాంధీతో మాట్లాడినట్లు చెప్పడం వినవచ్చు.

హింది క్లెయిం తో విడియో షేర్ అవుతోంది "इन्होने गाँधी ज़ी से डायरेक्ट बात की!

कि आखिर 15 अगस्त को भांग-गांजेऔर दारू की दुकाने बंद क्यों करवाते हो तुम.....बकलोल"

అనువదించగా "అతను నేరుగా గాంధీజీతో మాట్లాడాడు! ఆగస్టు 15న గంజాయి, మద్యం దుకాణాలను ఎందుకు మూసి వేస్తున్నారు అంటూ అడిగాడేమో, మూర్ఖత్వం" అంటూ ఈ వీడియో ను షేర్ చేస్తున్నారు.

Full View


Full View

ఆర్కైవ్ లింక్లు:

https://web.archive.org/web/20220819100741/https://www.facebook.com/100009032334214/videos/1975432082656643

https://web.archive.org/web/20220819101105/https://twitter.com/Gautambhatt005/status/1559434332644966401

నిజ నిర్ధారణ:

గాంధీజీతో మాట్లాడినట్లు రాహుల్ గాంధీ సభలో చెప్పారనే వాదన అవాస్తవం. వీడియో ను క్రాప్ చేసి వాడారు, అసలైన వీడియో లోని చిన్న భాగాన్ని తప్పుడు వాదన తో షేర్ చేస్తున్నారు.

వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, మార్చి 2022లో ది ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన వీడియో లభించింది. ఈ వీడియో 'ఎన్నికలు పూర్తయ్యే వరకు వైఫల్యాన్ని అంగీకరించవద్దు: రాహుల్ గాంధీ డిసెంబర్‌ గుజరాత్ ఎన్నికలపై'

రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వివరణాత్మక వ్యూహాన్ని చర్చించడానికి కాంగ్రెస్ గుజరాత్ యూనిట్ 'చింతన్ శివిర్' అనే మూడు రోజుల మేధోమథన సమావేశాన్ని నిర్వహించిందని వీడియో వివరణ లో పేర్కొంది.

బ్యాక్‌గ్రౌండ్‌ని క్రాస్‌చెక్ చేయడం ద్వారా, వైరల్ వీడియో ఇదే ప్రదేశంలో తీసిన పొడవైన వీడియో నుంచి తీసుకున్నారని అర్థం చేసుకోవచ్చు.

Full View

మరింత శోధించినప్పుడు, ది ఎకనామిక్ టైమ్స్ కథనం కూడా లభించింది.

వీడియో ఎగువ కుడి మూలలో, వీడియో సౌజన్యం: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ అని ఉండడం చూడవచ్చు. దీనిని క్యూ గా తీసుకొని, 'చింతన్ శివిర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్' అనే కీలక పదాలను ఉపయోగించి కీఫ్రేమ్‌లను శోధించాము.

దీనితో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన వీడియోలభించింది. 'గుజరాత్‌లోని ద్వారకలోని చింతన్ శివిర్‌లో శ్రీ రాహుల్ గాంధీ ప్రసంగం' అనే టైటిల్‌తో ఈ వీడియో ఉంది.

ఇతర విషయాలతోపాటు, ఈ వీడియోలో జవహర్‌లాల్ నెహ్రూ-గాంధీజీల సంబంధాల గురించి రాహుల్ గాంధీ చెప్పడం మనం వినవచ్చు. గాంధీజీ గురించి తాను ఎవరికైనా రాసిన జవహర్‌లాల్ నెహ్రూ లేఖను తాను చదివినట్లు ఆయన కథనం ప్రారంభమవుతుంది.

లేఖలో నెహ్రూజీ ఇలా వ్రాశారు, 'నేను ఈ అంశంపై మహాత్మా గాంధీతో చర్చించాను. ఇందులో నా మనస్సు మొత్తం...నా తర్కం... ఈ విషయంపై గాంధీది తప్పు, నేను ఒప్పు అని చెబుతోంది. కానీ నాకు తెలుసు...ఆయన (గాంధీ) తప్పు, నేను ఒప్పు అని నా మనసు చెబుతోందని లోపల నుండి నాకు తెలుసు. కానీ అతను ఒప్పు, నేను తప్పు అని నాకు తెలుసు.'

ఈ అంశానికి సంబంధించిన ఆయన సంభాషణ యూట్యూబ్ వీడియోలో 29.20 నిమిషాల నుండి వినవచ్చు.

Full View

అందుకే, మహాత్మాగాంధీతో మాట్లాడినట్లు రాహుల్‌గాంధీ చెబుతున్నరన్న వాదన అవాస్తవం. నిజానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యూట్యూబ్ లో ఉంచిన వీడియోను క్రాప్ చేసి తప్పుడు దావాతో షేర్ అవుతోంది.

Claim :  Rahul Gandhi says that he spoke to Mahatma Gandhi
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News