ఫ్యాక్ట్ చెక్: యజ్ఞాల సమయంలో ఆవు నెయ్యి కాల్చడం వలన 1 టన్ను తాజా ఆక్సిజన్ ఉత్పత్తి అవ్వదు..!

ఆవు నెయ్యి కాల్చడం వల్ల 1 టన్ను తాజా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్ చల్ చేస్తోంది. ఇది నిజమేనని నమ్మిన చాలా మంది పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.

Update: 2023-01-28 04:00 GMT

ఆవు నెయ్యి కాల్చడం వల్ల 1 టన్ను తాజా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్ చల్ చేస్తోంది. ఇది నిజమేనని నమ్మిన చాలా మంది పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఏ మాత్రం నిజం లేదు.

దహనం అనేది ఒక రసాయన చర్య, దీనిలో ఆవు నెయ్యి వంటి పదార్ధం ఆక్సిజన్‌తో చర్య జరిపి వేడి, కాంతి మరియు కార్బన్ డయాక్సైడ్ (CO2) మరియు నీటి ఆవిరి (H2O) వంటి వివిధ ఉప ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ప్రతిచర్యకు సంబంధించిన సమీకరణం ఇదే:

ఇంధనం (ఆవు నెయ్యి) + O2 -> CO2 + H2O

https://www.britannica.com/science/combustion

https://web.fscj.edu/Milczanowski/psc/lect/Ch11/slide3.htm

ఆవు నెయ్యి అనేది గ్లిజరైడ్స్ (ప్రధానంగా ట్రైగ్లిజరైడ్స్), ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్లు, స్టెరాల్స్, స్టెరాల్ ఈస్టర్లు, కొవ్వులో కరిగే విటమిన్లు, కార్బొనిల్స్, హైడ్రోకార్బన్లు, కెరోటినాయిడ్లతో సహా వివిధ లిక్విడ్ల మిశ్రమం. ఈ పదార్ధాలలో దేనినైనా కాల్చడం వలన ఆక్సిజన్ ఉప ఉత్పత్తిగా విడుదలవుతుందో లేదో తెలియదు. వైద్య, పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగించే ఆక్సిజన్ సాధారణంగా క్రయోజెనిక్ స్వేదనం లేదా వాక్యూమ్ స్వింగ్ అడ్సార్ప్షన్ వంటి ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది.

http://ecoursesonline.iasri.res.in/mod/page/view.php?id=5793

http://www.madehow.com/Volume-4/Oxygen.html

యజ్ఞం సమయంలో 10 గ్రాముల నెయ్యిని కాల్చడం ద్వారా 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని సోషల్ మీడియాలో ఇదే వాదన గతంలో వైరల్ అయింది.

https://archive.fo/abt9n

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి నిజం లేదు. యజ్ఞం సమయంలో 10 గ్రాముల నెయ్యి కాల్చడం వల్ల 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందన్న వాదన అబద్ధం. అటువంటి ప్రకటన భౌతిక శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఉంటుంది. శాస్త్రీయ పరమైన సాక్ష్యాలు కూడా లేవు.
Claim :  Burning cow ghee produces 1 tonne of fresh oxygen.
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News