ఫ్యాక్ట్ చెక్: వైరల్ ఫోటోలో ఉన్న వ్యక్తి హమాస్ ఉగ్రవాది కాదు

మహమ్మద్ మహరూఫ్ అనే తీవ్రవాదికి ఇజ్రాయెల్

Update: 2025-05-23 04:41 GMT

ఇజ్రాయెల్-పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాదుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు గాజాలో పరిస్థితులను తీవ్రంగా దిగజారుస్తున్నాయి. ఇక అమెరికాలో ఇజ్రాయెల్‌ రాయబార సిబ్బంది ఇద్దరు హత్యకు గురయ్యారు. నార్త్‌ వెస్ట్‌ డీసీలోని యూదుల మ్యూజియానికి సమీపంలో జరిగిన కాల్పుల్లో రాయబార సిబ్బంది అయిన సారా లిన్‌ మిల్‌గ్రిమ్, యారోన్‌ లిచిన్‌స్కీ అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల అనంతరం నిందితుడు ‘ఫ్రీ పాలస్తీనా’ అని నినాదాలు చేశాడు. నిందితుడిని చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్‌ రోడ్రిగ్జ్‌గా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదేశించారు. ఈ దాడిని యూదు వ్యతిరేక, నీచమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.

ఇంతలో చేతులు లేని ఓ వ్యక్తికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అతడు ఓ హమాస్ తీవ్రవాదని చెబుతూ ఉన్నారు.

"వీడు హమాస్ ఉగ్రవాది
వీడి పేరు మహమ్మద్ మహరూఫ్
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో చిన్న పిల్లలను ముక్కలుగా నరికి, వారి మాంసాన్ని ఒవేన్ లొ పడేశాడు
ఇజ్రాయేలు వీడిని చంపలేదు కానీ వాడి రెండు చేతులను నరికివేసింది, వాడి మూత్రపిండాలలో ఒకదాన్ని తీసేసింది, వాడి పురుషంగాన్ని కోసి పారేసింది, వాడిని సజీవంగా గజా లొ వదిలేసింది.
ఇప్పుడు వీడి పరిస్థితిని చూస్తే మిగిలిన తీవ్రవాద ఉగ్రవాదులు అర్థం చేసుకోగలరు, ఇజ్రాయెల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందన్నది
ఇజ్రాయెల్ ఎం చేసిందంటే వీడు స్వర్గానికి వెళ్లిన
72 కన్యాలను ఏమి చెయ్యలేడు. సూపర్ ఇజ్రాయిల్." అంటూ పోస్టులు పెడుతున్నారు





ఇదే వాదనలో పలు భాషల్లో పోస్టులు వైరల్ చేస్తున్నారు.



వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు

మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము. స్టాక్ ఫోటోగ్రఫీ వెబ్‌సైట్ అలామీలో ఈ ఫోటోను కనుగొన్నాము.

అలామీలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ఒమర్ అష్టావీ ఆగస్టు 31, 2024న ఈ ఫోటోను తీశాడు. గాజా స్ట్రిప్‌లోని డీర్ అల్-బలాలో ఇజ్రాయెల్ సైన్యం దాడి తర్వాత తన రెండు చేతులను కోల్పోయిన దియా అల్-అదిని అనే పాలస్తీనా యువకుడికి సంబంధించింది. అలామీలో దియా అల్-అదినికి సంబంధించిన పలు
ఫోటోలను
మేము కనుగొన్నాము.


"ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనా యువకుడు రెండు చేతులను కోల్పోయాడు, గాజాలో వైద్య సంక్షోభం మధ్య మనుగడ కోసం పోరాడుతున్నాడు" అనే వివరణతో మేము అదే చిత్రాన్ని గెట్టి ఇమేజెస్ వెబ్‌సైట్‌లో కూడా కనుగొన్నాము.


వైరల్ చిత్రంలో గాయపడిన అదిని అదే భవనం దాటి నడుచుకుంటూ మీడియాతో మాట్లాడుతున్నట్లు చూపించే పాలస్తీనియన్ వార్తా సంస్థ వాఫా వీడియో నివేదికను కూడా మేము కనుగొన్నాము.

Full View



రాయిటర్స్ నివేదిక ప్రకారం, మధ్య గాజా స్ట్రిప్‌లోని దేర్ అల్-బలాలో ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన తర్వాత 15 ఏళ్ల దియా అల్-అదినిని ఆసుపత్రికి తరలించారు. ఆగస్టు 13న ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన తర్వాత అతని రెండు చేతులు తీసివేయాల్సి వచ్చింది. ఓ కాఫీ హౌస్‌లో అతడు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దాడి జరిగిందని నివేదికల ద్వారా తెలిసింది.

2024 ఆగస్టు 13న ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన తర్వాత అతని రెండు చేతులు తీసివేయాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ తరలింపు ఉత్తర్వుల కారణంగా అదినిని అల్-అక్సా ఆసుపత్రి నుండి తరలించారు. ఆ తర్వాత అతను ఒక అమెరికన్ ఫీల్డ్ ఆసుపత్రిలో ఆశ్రయం పొందాడు. అదిని వంటి అనేక మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారని పలు మీడియా నివేదికలు తెలిపాయి.

వైరల్ అవుతున్న వాదనలను పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఖండించాయి. ఆ లింక్ లను ఇక్కడ, ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు.

కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది హమాస్ ఉగ్రవాది కాదు. 2024 ఆగస్టు 13న ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన తర్వాత రెండు చేతులు కోల్పోయిన 15 ఏళ్ల దియా అల్-అదిని.

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  మహమ్మద్ మహరూఫ్ అనే తీవ్రవాదికి ఇజ్రాయెల్
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News