ఫ్యాక్ట్ చెక్: కుంభమేళాలో ఉన్న ప్రజలు భారత సైనికులపై చెప్పులు విసరలేదు. ఇది పాత వీడియో
మాఘ పూర్ణిమ - ఫిబ్రవరి 12, 2025 సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్
People throwing slippers
మాఘ పూర్ణిమ - ఫిబ్రవరి 12, 2025 సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. మహా కుంభమేళా అనుభూతిని మరింత మెరుగ్గా చేయడానికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అనేక చోట్ల ప్రజలు 30 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. అధికారులు మహా కుంభ్ ప్రాంతాన్ని ‘నో వెహికిల్ జోన్’గా ప్రకటించారు. మాఘ పూర్ణిమ సందర్భంగా వేలాది మంది భక్తులు ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నారు. భక్తుల స్నానాలు సజావుగా సాగేందుకు ఫిబ్రవరి 11 నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి మేళా ప్రాంతమంతా వాహన రహిత ప్రాంతంగా ప్రకటించారు. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించారు.
బారికేడ్ ముందు ఆర్మీ అధికారులు, ఇతర భద్రతా సిబ్బంది ఉండగా భారీ గుంపు వారిపై చెప్పులు విసరడాన్ని చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. కొంతమంది వినియోగదారులు ఈ వీడియోను మహా కుంభమేళాకు వెళ్లిన ప్రజలని తెలిపారు. కాపలాగా ఉన్న ఆర్మీ సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. చెప్పులు విసిరే వ్యక్తులు ముస్లింలైతే, ఈ రోజు అన్ని మీడియా ఛానెల్‌లలో వార్తలలో ఉంటుందనే వాదనతో వీడియోను పంచుకున్నారు.
“कुंभ में राष्ट्रवादी और सनातनी लोगों ने आर्मी वालों पर चप्पलें फेंकी! ये मुसलमान होते तो आज सभी सरकारी मीडिया चैनलों पर यही खबर होती , लेकिन इस धर्म के लोगों को ये सब अलाउड है शायद। #KumbhMela2025” అంటూ హిందీలో పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు .
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియో పాతది. మహా కుంభమేళాకు సంబంధించినది కాదు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని చేసి వెతికాం. ఈ వీడియోను ఒక Instagram వినియోగదారు జనవరి 29, 2025న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. వీడియోలోని టెక్స్ట్‌లో “పుష్ప 2 కే ట్రైలర్ లాంచ్ కే దిన్ పాట్నా కే గాంధీ మైదాన్ మే పబ్లిక్ కర్ దియా హంగామా” అని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఇది పాట్నాలోని గాంధీ మైదాన్‌లో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన అని తెలుస్తోంది.
తదుపరి శోధనలో, షోషా అనే ఛానెల్ ద్వారా YouTubeలో ప్రచురించిన పొడవైన వీడియోను మేము కనుగొన్నాము. “Pushpa 2: Fans In Patna Create Chaos, Climb Electric Poles; Police Resort To Lathi Charge” అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, పాట్నాలోని గాంధీ మైదాన్‌లో గందరగోళం చెలరేగింది. 'పుష్ప 2' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం వచ్చిన నటీనటులు అల్లు అర్జున్, రష్మిక మందనాలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. వేదిక వద్ద గుమిగూడిన ఒక వర్గం బారికేడ్ల అవతల ఉన్న అధికారులపై బూట్లు, స్లిప్పర్లు విసిరారు. ఈ కార్యక్రమం అర్థరాత్రి వరకు కొనసాగింది.
అందువల్ల, వైరల్ వీడియో మహకుంభమేళాలో జనాలు సెక్యూరిటీ, పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది కాదు. జనవరి 2025లో పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన పుష్ప 2 చిత్రం ట్రైలర్ లాంచ్ కు సంబంధించింది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : మహా కుంభమేళాను సందర్శిస్తున్న ప్రజలు సైనికులపైకి చెప్పులు విసిరినట్లు వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By : Twitter users
Fact Check : Unknown