ఫ్యాక్ట్ చెక్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి కశ్మీర్ మ్యాప్‌ను బహుమతిగా ఇవ్వలేదు

లండన్‌లోని చాథమ్ హౌస్‌లో జరిగిన చర్చలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో, జైశంకర్ భారతదేశం-యుకె

Update: 2025-03-07 06:24 GMT

AI generated image

లండన్‌లోని చాథమ్ హౌస్‌లో జరిగిన చర్చలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో, జైశంకర్ భారతదేశం-యుకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై పలు వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంబంధాలను పెంచడంలోనూ, వృద్ధిని పెంపొందించడంపై ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పాకిస్తాన్‌తో కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ ఉపయోగించుకోగలరా అని జైశంకర్‌ను అడిగారు. భారతదేశం ఇప్పటికే నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని, ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్థిక అభివృద్ధి, అధిక ఓటర్లతో ఎన్నికలు నిర్వహించడం వంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని చెప్పారు. అయితే ఇతరుల జోక్యం అవసరం లేదని అనుకుంటానని జైశంకర్ తెలిపారు. ఓ వైపు సవాళ్లను ఎదుర్కొంటూనే, పొరుగు దేశాలతో ముఖ్యంగా చైనాతో భారతదేశ సంబంధాల గురించి జైశంకర్ మాట్లాడారు. మారుతున్న ప్రాంతీయ దృశ్యంలో స్థిరమైన, గౌరవప్రదమైన సంబంధాల అవసరం ఉందని ఆయన తెలిపారు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చూపించే చిత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతూ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కశ్మీర్ మ్యాప్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా అందిస్తున్నారనే వాదనతో ఫోటోను షేర్ చేస్తున్నారు. "Share karen ghaddaron ki shaqlen. Bech dya Kashmir" అనే వాదనతో పోస్టులను షేర్ చేస్తున్నారు.

మరో X యూజర్ ‘భారత పాలిత కాశ్మీర్” అనే క్యాప్షన్‌తో చిత్రాన్ని షేర్ చేశారు. అసిమ్ మునీర్ నరేంద్ర మోదీకి కశ్మీర్ మ్యాప్‌ను బహుమతిగా అందిస్తున్నారని పోస్టుల్లో తెలిపారు.

క్లెయిం ఆర్కైవ్ లింకును ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవడం గురించిన నివేదికల కోసం వెతికినప్పుడు, అటువంటి కథనాలకు సంబంధించిన మీడియా నివేదికలు కనిపించలేదు.

PIB ప్రెస్ రిలీజ్‌లను కూడా తనిఖీ చేయాగా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత ప్రధానితో సమావేశం గురించి మాకు ఎటువంటి సమాచారం లభించలేదు. 


వైరల్ చిత్రాన్ని షేర్ చేసిన X వినియోగదారుల వివరాలను మేము తనిఖీ చేసినప్పుడు. ఒకరు AI ఆర్ట్-ఆధారిత కంటెంట్ జనరేటర్ అని మేము కనుగొన్నాము. ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేసిన మొదటి వ్యక్తి ఆయనే. ఈ హ్యాండిల్ లో AI, వ్యంగ్య కంటెంట్, మీమ్‌లను ఉపయోగించి రూపొందించబడిన కంటెంట్‌ను పోస్ట్ చేస్తుందని బయోలో పేర్కొన్నారు.


AI డిటెక్షన్ టూల్ Was it AI , Hive AI డిటెక్టర్ ఉపయోగించి చిత్రాన్ని తనిఖీ చేసాము. హైవ్ AI డిటెక్షన్ టూల్ వైరల్ ఇమేజ్ 99.3% AI సృష్టి అయ్యే అవకాశం ఉందని నిర్ధారించింది.


వైరల్ ఇమేజ్‌ను Was it AI తో కూడా తనిఖీ చేసాము, ఈ చిత్రం AI టెక్నాలజీని ఉపయోగించి రూపొందించారని, అసలు చిత్రం కాదని కూడా నిర్ధారించింది.


వైరల్ ఇమేజ్‌లో కొన్ని అవక తవకలను కూడా మేము చూడగలిగాము, ఈ చిత్రం AI-జనరేట్ చేశారని నిర్ధారించాము. వైరల్ చిత్రం లొ కళ్లు గానీ, చేతులు గానీ యూనిఫారం పైన ఉన్న పేరు ను గానీ సరిగా గమనించినట్టయితే, అందులో కొన్ని అవకతవకలు గమనించవచ్చు. సాధారణంగా, ఏఐ తో రూపొందించిన చిత్రాలలో ఇటువంటి వ్యత్యాసాలు గమనించవచ్చు. 


కనుక, భారత ప్రధాని మోదీతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నట్లు చూపిస్తున్న వైరల్ చిత్రం అసలైనది కాదు. ఇది AI- జనరేటెడ్ ఇమేజ్. ఆ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.  

Claim :  భారత ప్రధాని నరేంద్ర మోదీకి కాశ్మీర్ మ్యాప్‌ను బహుమతిగా ఇచ్చిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News