ఫ్యాక్ట్ చెక్: చార్మినార్ దగ్గర స్థానిక యువకులు విదేశీయులను ఇబ్బంది పెట్టిన ఘటన ఇటీవలది కాదు

భారతదేశంలో వ్లాగ్గింగ్ పై ఆసక్తి భారీగా పెరుగుతోంది. ఎంతో మంది యువకులు వ్లాగింగ్ పై దృష్టి పెట్టారు. ఆకర్షణీయమైన

Update: 2025-10-07 08:00 GMT

foreign tourist abuse 

భారతదేశంలో వ్లాగ్గింగ్ పై ఆసక్తి భారీగా పెరుగుతోంది. ఎంతో మంది యువకులు వ్లాగింగ్ పై దృష్టి పెట్టారు. ఆకర్షణీయమైన జీవనశైలి, ప్రయాణం, ఆహారం, కుటుంబం, ఫిట్‌నెస్ లాంటి అంశాల మీద అవగాహన కోసం ప్రజలు వ్లాగింగ్ వీడియోలను చూడడం అలవాటు చేసుకున్నారు. భారత దేశాన్ని చూపించాలని కూడా పలు దేశాలకు చెందిన వ్లాగర్లు వివిధ నగరాల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. విదేశీయులు తమ అనుభవాన్ని చిత్రీకరించడం కూడా మొదలు పెట్టారు. అందులో హైదరాబాద్ నగరం కూడా ఉంది. చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్ నగరాన్ని చూపించడానికి పలువురు ముందుకు వస్తున్నారు.

అయితే విదేశీయులను స్థానిక యువత మాటలతో దుర్భాషలాడుతున్నట్లు, అయితే వాటిని విన్నాక విదేశీయులు తప్పు ఇది అంటూ చెబుతున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. దీనిపై హైదరాబాద్ పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “It is Truly Concerning to witness Such Incidents. What is Happening with the Jurisdiction & within the @shocharminar limits? Tourists visiting India Especially Hyderabad Should Experience our Culture, Hospitality & Respect. The Use of Inappropriate language Toward a Foreign woman” అనే క్యాప్షన్ తో పలువురు వీడియోలను పోస్టు చేశారు. ఇతర దేశాలకు చెందిన మహిళలతో కనీసం ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తులు మన చుట్టూ ఉన్నారని వారు తెలిపారు. ఇలాంటి సంఘటనలను చూడటం నిజంగా బాధాకరం. భారతదేశాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ సందర్శించే పర్యాటకులు మన సంస్కృతి, ఆతిథ్యం, గౌరవాన్ని అనుభవించాలి. విదేశీ మహిళ పట్ల అనుచితమైన భాషను ఉపయోగించడం యోగదాయకం కాదని తెలిపారు.
కొంతమంది వినియోగదారులు షీ టీమ్స్‌ను, పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను ట్యాగ్ చేసి, ఆ యువకుల ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని కూడా ట్యాగ్ చేశారు.
“Dear CP Hyd @SajjanarVC Garu, Outsiders who don’t even belong to Hyderabad Old City are regularly troubling tourists at #Charminar. In this video, a foreigner & his wife were abused with foul language. This is spoiling the image of Hyderabad globally. Requesting @hydcitypolice @charminarps to take strict action. Let them know @SajjanarVC Has taken charge now ! Cc @TG_SheTeams @CPHydCity” అంటూ పలువురు పోస్టులు పెట్టారు. అలాంటి యువకులకు బుద్ధి చెప్పాలని ప్రజలు సోషల్ మీడియా పోస్టుల్లో డిమాండ్ చేశారు.

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో ఇటీవలిది కాదు, ఈ సంఘటన సెప్టెంబర్ 2023లో జరిగింది.

వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఆ వీడియో పాతది అని పేర్కొంటూ కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను కనుగొన్నాము. ఒక X యూజర్ చార్మినార్ పోలీసులను ట్యాగ్ చేసి, అది పాత వీడియో అని పేర్కొన్నారు.
చార్మినార్ పోలీస్ స్టేషన్ X హ్యాండిల్ లో ఈ ఘటనకు సంబంధించిన వివరణను ప్రచురించింది. "నగరంలోని ఒక పర్యాటక ప్రదేశానికి సమీపంలో ఒక విదేశీ మహిళకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిందని మా దృష్టికి వచ్చింది. ఆ వీడియో 2023లో ఒక విదేశీ వ్లాగర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన పాత వీడియో రికార్డింగ్ (2023 నుండి)కి సంబంధించినదని, కొన్ని రోజుల క్రితం మరొక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తిరిగి షేర్ చేశారని కనుగొన్నాం. వాస్తవాలను ధృవీకరించకుండా అటువంటి పాత వీడియోలను షేర్ చేయవద్దని లేదా వాటికి ప్రతిస్పందించవద్దని పౌరులను కోరుతున్నాం." అంటూ పోస్టు పెట్టారు.
చార్మినార్ సమీపంలో ఒక విదేశీ పర్యాటకురాలిని దుర్భాషలాడుతున్నట్లు చూపించే వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోందని పేర్కొంటూ తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ బృందం X హ్యాండిల్ లో ఆ వాదనను తోసిపుచ్చింది. పోలీసుల ప్రకారం, ఆ క్లిప్ ఇటీవలిది కాదు. దాదాపు మూడు సంవత్సరాల నాటిది. ఇంకా ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు, కానీ చార్మినార్ SHOకి సమాచారం అందించాము, అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని అందులో తెలిపారు.
వీడియోను షేర్ చేసిన విదేశీయుల గురించి మరింత శోధించగా, డైలీ జే అనే X హ్యాండిల్ మాకు కనిపించింది. Jaystreazy2 అనే యూట్యూబ్ ఛానెల్ గురించి చూడొచ్చు.

Jaystreazy2 అనే యూట్యూబ్ ఛానెల్, ఆగస్టు 29, 2024న ‘Confronting an insult’ అనే శీర్షికతో వైరల్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో వివరణలో, వినియోగదారుల యూట్యూబ్ ఛానెల్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు లింక్‌లను కూడా చూడొచ్చు.  
Full View

వీడియో స్క్రీన్‌షాట్ ఇక్కడ ఉంది.


Jaystreazy VODs అనే ఛానెల్‌లో “12/9/2023 - HYDERABAD !factor INDIA-THON DAY 19 !wheel !india !bald #Factor75Partner” "అనే శీర్షికతో డిసెంబర్ 21, 2023న అప్లోడ్ చేసిన వీడియోను కూడా కనుగొన్నాము. ఈ వీడియోలో వ్లాగర్ హైదరాబాద్‌లోని అనేక మందితో సంభాషిస్తూ, నగరంలోని వివిధ ప్రముఖ ప్రదేశాలను సందర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోలోని వైరల్ భాగాన్ని మనం 3.27 వద్ద చూడవచ్చు. ఈ సంఘటన చార్మినార్ సమీపంలో జరిగింది. ఈ వీడియో ప్రకారం, ఇది సెప్టెంబర్ 12, 2023న చోటు చేసుకుంది. ఇది ఇటీవలిది కాదు. 

Full View

వీడియో నుండి స్క్రీన్‌షాట్ ఇక్కడ ఉంది.


వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు, సెప్టెంబర్ 2023 నాటిది. ఇటీవల చార్మినార్ సమీపంలో ఒక విదేశీయురాలిని దుర్భాషలాడారనే వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
Claim :  ఇటీవల చార్మినార్ సమీపంలో కొందరు స్థానిక యువకులు విదేశీయులతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఘటన వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News