కోల్కత్తా నిరసనలకు సంబంధించింది అంటూ ప్రచారం అవుతున్న పాత వీడియో

ప్రవక్త మొహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోల్‌కతాలో ప్రజలు నిరసనలు తెలిపారు, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్ల పైకి వచ్చారు. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో అంటూ పెద్ద ఎత్తున జనాభా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Update: 2022-06-14 06:16 GMT

ప్రవక్త మొహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోల్‌కతాలో ప్రజలు నిరసనలు తెలిపారు, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్ల పైకి వచ్చారు. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో అంటూ పెద్ద ఎత్తున జనాభా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఈ వీడియో "Kolkata today.. looking like ants from far but these Muslims are like a human sea... What Mamta will gain? What she will take along? Why is she selling away our country?

Alarming and Serious Warning !

Remember partition of India originated on August 14-15, 1946, a year before the Independence in this place named Kolkata only!! If we Hindus irrespective of caste colour, creed, region, language, hierarchy, gender and age group did not unitedly vote for BJP, we will be SOON an ISLAMIC REPUBLIC FOR SURE. TRAILER IS FOR YOU TO SEE Below" క్యాప్షన్ తో షేర్ అవుతోంది.

దానిని అనువదిస్తే "ఈ రోజు కోల్‌కతా.. దూరంగా చీమల్లా కనిపిస్తున్నా ఈ ముస్లింలు మానవ సముద్రంలా ఉన్నారు... మమత ఏం పొందుతుంది? ఆమె వెంట ఏమి తీసుకుంటుంది? ఆమె మన దేశాన్ని ఎందుకు అమ్మేస్తోంది?

భయంకరమైన మరియు తీవ్రమైన హెచ్చరిక!

భారతదేశ విభజన ఆగష్టు 14-15, 1946 న, స్వాతంత్ర్యానికి ఒక సంవత్సరం ముందు, కోల్‌కతా అనే ఈ ప్రదేశంలో మాత్రమే ఉద్భవించిందని గుర్తుంచుకోండి!! కులం, మతం, ప్రాంతం, భాష, శ్రేణి, లింగం మరియు వయస్సుతో సంబంధం లేకుండా హిందువులమైన మనం ఐక్యంగా బిజెపికి ఓటు వేయకపోతే, మనం త్వరలో ఇస్లామిక్ రిపబ్లిక్ అవుతాము. ట్రైలర్ మీ కోసం క్రింద చూడండి"

Full View


Full View


నిజ నిర్ధారణ:

ఈ వీడియో కోల్కత్తా నగరం లో జరిగిన నిరసనలను చుఏపుతుందనడంలో నిజం లేదు. ఈ దావా తప్పు.

మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఈ వీడియో ఇటీవలిది కాదని, జనవరి 2021 నాటిదని కనుగొన్నాము. ఇది ఖాదిమ్ హుస్సేన్ రిజ్వీ జ్ఞాపకార్థం జనవరి 2021లో పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగిన మతపరమైన సమావేశంలో తీసిన వీడియో నుండి తీసుకోబడింది. ఖాదీమ్ హుస్సేన్ రిజ్వీ మరణించి జనవరి 3న 40 రోజులు పూర్తి అయిన సందర్భమంగా కొన్ని వేల మంది సమావేశానికి తరలి వచ్చారు. అందులోని కొద్ది భాగాన్ని తీసుకొని కోల్కత్తాలో తీసినది అంటూ ప్రచారం జరుగుతోంది. ఖాదీమ్ హుస్సేన్ రిజ్వీ పాకిస్థాన్‌లోని రాజకీయ పార్టీ తెహ్రీక్-ఎ-లబ్బైక్ నాయకుడు.

ఈ సమావేశం యొక్క విజువల్స్ అనేక యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా అప్‌లోడ్ చేయబడ్డాయి, ఇక్కడ వైరల్ వీడియో వంటి విజువల్స్ చూడవచ్చు.

Full View

Full View

Baaghi TV.com అనే వార్తా వెబ్‌సైట్‌లో కూడా ఒక వార్తా నివేదిక ప్రచురించబడింది

జనవరి 3, 2021న ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన వీడియో లోని విజువల్స్ ని, వైరల్ వీడియో లోని విజువల్స్ ని పోల్చి చూస్తే, అవి ఒకటేనని తేలుతుంది.

జనవరి 2021న లబ్బైక్ న్యూస్ అనే వార్తా ఛానెల్ పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోలో కూడా ఇవి షేర్ చేయబడ్డాయి. ఆ వీడియో టైటిల్ "అల్లామా ఖాదీమ్ హుస్సేన్ రిజ్వీ చెహ్లూమ్ | TLP చెహ్లమ్ 2021"

Full View

నిరసనలకు మద్దత్తునిస్తూ పెద్ద సంఖ్యలో చేరిన వ్యక్తుల యొక్క అసలైన వార్తా నివేదికలు ఇక్కడ చూడవచ్చు.

అందువల్ల, వైరల్ వీడియోలో కనిపించే విజువల్స్ పాకిస్తాన్‌లోని లాహోర్ లో 2021 లో తీసినవి, కోల్‌కతా నుండి కాదు. మహ్మద్‌ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోల్‌కతాలో నిరసన ప్రదర్శనల వీడియో షో అబద్ధం.

Claim :  people protesting in Kolkata against the comments on Prophet Mohammad
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News