ఫ్యాక్ట్ చెక్: అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా ప్రజలకు డబ్బు ఇవ్వాలని ముఖేష్ అంబానీ నిర్ణయం తీసుకోలేదు

రాధిక మర్చంట్‌తో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం జూలై 12, 2024న జరగనుంది. గత ఏడాది జనవరిలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.

Update: 2024-03-28 07:53 GMT

రాధిక మర్చంట్‌తో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం జూలై 12, 2024న జరగనుంది. గత ఏడాది జనవరిలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.. అయితే వారి వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రారంభమయ్యాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటూ ఎంతో గొప్పగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులు, హాలీవుడ్, బాలీవుడ్ తారలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు హాజరయ్యారు.

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయగా, ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి సందర్భంగా ప్రతి భారతీయుడికి 5000 రూపాయలు ఇస్తున్నట్లు ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
Hapiloo అనే ఫేస్ బుక్ యూజర్ “Jio ప్రతి ఒక్కరికీ ₹5000 వరకు బహుమతిని అందిస్తోంది” పోస్టు పెట్టారు.
“ముకేశ్ అంబానీ తన కొడుకు పెళ్లి సందర్భంగా భారతీయులకు 5000 ఇస్తున్నారు. ఖాతా లోకి డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి” అంటూ పోస్టు పెట్టారు.
Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. తన కుమారుడి పెళ్లి సందర్భంగా ప్రజలకు ముఖేష్ అంబానీ ఎలాంటి డబ్బులు పంచడం లేదు.
మేము Jio.comని సెర్చ్ చేసినప్పుడు, మాకు అలాంటి ఆఫర్ ఏదీ కనిపించలేదు. Xolo ZX ఫోన్ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను మాత్రం గమనించాం.
ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన లింక్‌పై క్లిక్ చేసినప్పుడు.. ఓపెన్ అయిన పేజీ అటు జియో లేదా.. ఇటు ముఖేష్ అంబానీతో ఎలాంటి సంబంధం లేదని మేము కనుగొన్నాము. లింక్ URL
https://happiloo.xyz/Boss/Telugu/index.html
అనే పేజీకి లింక్ అయి ఉంది.

Phonepe వినియోగదారుల కోసం హోలీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు ఆ పేజీ పేర్కొంది. ఆ పేజీలో స్క్రాచ్ కార్డ్ కూడా ఉంది, అది స్క్రాచ్ చేసినప్పుడు ఫోన్‌పేలో రూ. 1,990 అందిస్తుంది. అది కూడా రూ. 5000 కాదు. 'బ్యాంక్‌ అకౌంట్ లోకి డబ్బు పంపడానికి ఇక్కడ క్లిక్ చేయండి' అని పేజీలో కనిపిస్తుంది. కానీ క్లిక్ చేసినప్పుడు అది వివిధ ఖాతాలను చూపెడుతుంది. అయితే ఇలాంటి లింక్ లను క్లిక్ చేయడం వలన చాలా ప్రమాదం. మీ డేటాను.. మీ అకౌంట్స్ లోని డబ్బులను దొంగిలించే అవకాశం కూడా ఉంది.
స్క్రీన్ షాట్ ను మీరు గమనించవచ్చు.

ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహం కారణంగా డబ్బును విరాళంగా ఇస్తున్నారు అంటూ వైరల్ అవుతున్న లింక్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ప్రజల బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును కొట్టేయడానికి ఉపయోగించే బూటకపు లింక్. ఇలాంటి బూటకపు లింకుల పట్ల జాగ్రత్త వహించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  Mukesh Ambani is giving Rs 5000 to all Indians, on the occasion of his son’s marriage
Claimed By :  Facebook User
Fact Check :  False
Tags:    

Similar News