ఫ్యాక్ట్ చెక్: జూనియర్ ఎన్టీఆర్ TDP సైకిల్ గుర్తు ఉన్న చొక్కా వేసుకోలేదు, చిత్రం మార్ఫింగ్ చేశారు

భారత ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ మే 13, 2024న జరగనున్నాయి.

Update: 2024-04-25 08:26 GMT

NTRJr

భారత ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ మే 13, 2024న జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీలో 175 సీట్లు ఉండగా అందులో 29 సీట్లు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేశారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకోగా, వైఎస్సార్‌సీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది.

టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంటూ.. టీడీపీ గుర్తు సైకిల్ ఉన్న చొక్కా ధరించి ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


కొంతమంది వినియోగదారులు రెండు భిన్న చిత్రాలను షేర్ చేస్తున్నారు. ఒకటి టీడీపీ గుర్తు కాగా మరొకటి వైఎస్సార్‌సీ పార్టీ గుర్తు ఫ్యాన్ ని చూపుతోంది.

ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం మార్ఫింగ్ చేశారు. అసలు ఫోటోలో ఆయన చొక్కా మీద  ఏ పార్టీకి సంబంధించిన గుర్తులు లేవు.

మేము Googleని ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. ఆ చిత్రం ఏప్రిల్ 21, 2024న అనేక వార్తా కథనాలలో ప్రచురించారని మేము కనుగొన్నాము. 
టైమ్స్ ఆఫ్ ఇండియా
కథనం ప్రకారం.. హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2 షూట్ కోసం ముంబై విమానాశ్రయంలో ఎన్టీఆర్ దిగినప్పుడు ఈ చిత్రాన్ని క్లిక్ చేశారని పలువురు పంచుకున్నారు. ఎన్టీఆర్ డెనిమ్ జీన్స్, బ్లాక్ సన్ గ్లాసెస్, బ్లాక్ స్నీకర్స్‌, తెల్లటి షర్ట్‌ తో కనిపించాడు.

ఇవే చిత్రాలను న్యూస్ 18 మీడియా సంస్థ కూడా షేర్ చేసింది.

“Jr NTR flaunts trendy ensemble at Mumbai airport” అనే టైటిల్ తో వార్తా సంస్థ ANI కథనాన్ని మనం చూడొచ్చు. ముంబై విమానాశ్రయంలో జూనియర్ ఎన్టీఆర్ దిగిన వీడియోను చూడొచ్చు.
Full View
ఈ ఒరిజినల్ చిత్రాలలో జానియర్ చొక్కాపై ఏ పార్టీ గుర్తు కూడా కనిపించలేదు. అందువల్ల, వైరల్ చిత్రాలను ఎడిట్ చేసి.. దానికి టీడీపీ గుర్తును జోడించారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  జూనియర్ ఎన్టీఆర్ సైకిల్ గుర్తు ఉన్న చొక్కా ధరించి టీడీపీకి మద్దతు తెలిపారు.
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News