ఫ్యాక్ట్‌చెక్: జన్నత్ కీ హై తస్వీర్.. యే తస్వీర్ న దేంగే.. పాటను 1952లో కాంగ్రెస్ బ్యాన్ చేయలేదు. ఈ పాట 1966లో రిలీజయిన సినిమాలోనిది

Jannat Ki Hai Tasveer.. Yeh Tasveer Na Denge.. song was not banned by Congress in 1952. This song is from a movie released in 1966

Update: 2023-08-15 14:05 GMT

జన్నత్ కీ హై తస్వీర్.. యే తస్వీర్ న దేంగే..(స్వర్గానికి చిత్తరువు లాంటిది ఇది.. ఈ చిత్రాన్ని మేము ఇవ్వమూ..) అనే పాట ప్లే అవుతుండగా... కాశ్మీర్ మనదే! అని పేర్కొంటూ.. భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ కింది మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"ఈ పాట 1952 నాటిది. సిలోన్ రేడియోలో విన్న పాకిస్తాన్ ఈ పాటను బ్యాన్ చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాటనైతే బ్యాన్ చేయగలిగింది కానీ ఈ పాట దేశభక్తులైన కాశ్మీరీలలో, మరియు దేశభక్తుల గుండెల్లో జీవించి ఇప్పుడు ఇలా మన ముందుకు వచ్చింది."

https://www.facebook.com/reel/680346447301902


ఈ పాట గురించిన పరిశోధనలో.. ఇదే మెసేజ్‌ను హిందీలోనూ, ఇంగ్లీషులోనూ చాలా మంది కొంతకాలంగా షేర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది ఈ పాటను ఆ సినిమాలోంచి తొలగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని కూడా ఆరోపించారు.



Full View

ఫ్యాక్ట్ చెక్:

ఆ హిందీ పాట.. జన్నత్ కీ హై తస్వీర్.. యే తస్వీర్ న దేంగే.. చరణాలతో మేము గూగుల్ ద్వారా సెర్చ్ చేసినప్పుడు... మాకు ఆ పాట అసలు వివరాలు తెలిశాయి.

ఆ పాట ఉన్న సినిమా: జోహార్ ఇన్ కాశ్మీర్

విడుదల సంవత్సరం: 1966

పాట పడినవారు: మొహమ్మద్ రఫీ

రచన, దర్శకత్వం: ఐ ఎస్ జోహార్


స్వాతంత్ర్యానంతరం దేశవిభజన నాటి పరిస్థితులపై అల్లిన కథ ఆధారంగా తీసిన ఈ సినిమా 1966లో రిలీజ్ చేశారు. అంటే.. ఈ వైరల్ మెసేజ్ లో పేర్కొన్నట్లుగా.. 1952లో ఈ పాటను రేడియో సిలోన్ ప్రసారం చేయటం, పాకిస్తాన్ వినటం, కాంగ్రెస్ ఒత్తిడి తెచ్చి ఈ పాటను తొలగించటం.. పూర్తిగా అవాస్తవం.

https://www.imdb.com/title/tt0231828/

అలాగే.. ఇతర మెసేజ్‌లలో ఆరోపించినట్లుగా.. ఈ పాటను సినిమాలోంచి తొలగించారా అన్నది కూడా తెలుగుపోస్ట్ పరిశీలించింది. డిసెంబరు 17, 1966 నాటి 'ది గజెట్ ఆఫ్ ఇండియా'లో జూలై 23, 1966 వారంతపు సెస్నార్ బోర్డ్ నివేదికను ప్రచురించారు.


ఆ నివేదికలో.. జోహార్ ఇన్ కాశ్మీర్ సినిమాలోని రీల్ నెంబర్ 5 లో ఉన్న.. జన్నత్ కీ హై యే తస్వీర్.. పాటలో కేవలం రెండు పదాలను (హాజీ పీర్) మాత్రమే శబ్ధం తొలగించమని ఆదేశించారు. అంతే తప్ప, ఆ పాటను కానీ, పాట స్ఫూర్తిని కానీ తొలగించలేదు.

https://ia800600.us.archive.org/10/items/in.gazette.1966.353/O-1688-1966-0051-76871.pdf

మరోవైపు.. ఈ చిత్రం జియో సినిమాలో, ఈరోస్‌నౌ ద్వారా అమెజాన్ ప్రైం వీడియో లోనూ ఈరోజుకి అందుబాటులో ఉంది.

https://www.jiocinema.com/movies/johar-in-kashmir/3490597/watch
https://erosnow.com/movie/watch/1060811/johar-in-kashmir
https://www.primevideo.com/detail/Johar-in-Kashmir/0FWQIDNR88YQKDVUKVEYKCLC9E

అందులో 46వ నిమిషం నుంచి ఈ పాటను చూడవచ్చు.

జన్నత్ కీ హై తస్వీర్.. యే తస్వీర్ న దేంగే.. అనే పాటను పాకిస్తాన్ ఒత్తిడికి తలొగ్గి 1952నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ చేసిందనటం పూర్తిగా అవాస్తవం.

Claim :  The Congress government has banned the song 'Jannat ki hai tasvir.. ye tasvir na denge..' in 1952, on the pressure from Pakistan
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News