నిజ నిర్ధారణ: పాఠశాల నాటకంలో దేశాన్ని అవమానించారనే వైరల్ వాదన తప్పుదారి పట్టిస్తోంది

, ఒక చిన్న పాఠశాలలో పిల్లలు వేసిన నాటకం లో కిరీటం ధరించిన భారత మాత వేశధారణ లో ఉన్న అమ్మాయి తలపైన నుంచి కిరీటం తీసి తల పైన గుడ్డ వేస్తూ కనిపిస్తారు ఇంకొందరు పిల్లలు. తరువాత, ఆమె తో సహా అందరూ ప్రార్ధన చేస్తూ కనిపిస్తారు.

Update: 2022-08-17 07:43 GMT

భారతదేశ ప్రజలు 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అత్యంత వైభవంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు. భారతదేశంలోని మారుమూల ప్రదేశాన్ని కూడా త్రివర్ణ పతాకంతో అలంకరించి ఈ సంబరాలలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.

ఇంతలో, ఒక చిన్న పాఠశాలలో పిల్లలు వేసిన నాటకం లో కిరీటం ధరించిన భారత మాత వేశధారణ లో ఉన్న అమ్మాయి తలపైన నుంచి కిరీటం తీసి తల పైన గుడ్డ వేస్తూ కనిపిస్తారు ఇంకొందరు పిల్లలు. తరువాత, ఆమె తో సహా అందరూ ప్రార్ధన చేస్తూ కనిపిస్తారు.

ఈ వీడియో హిందీ క్లెయిం తో షేర్ అవుతోంది " भारत माँ के सिर का मुकुट हटाकर पहना दिया हिजाब। मंच से अदा कराया नमाज! वीडियो "शिशु भारतीय विद्यालय" मालवीय नगर ऐशबाग लखनऊ का है । राष्ट्रीय पर्व पर जिहाद और अलगाववाद के इस एजेंडे से आपको क्या समझ आया ?"

అనువదించగా "భారతమాత తల పైన కిరీటాన్ని తీసివేసి హిజాబ్ వేసారు. వేదికపై నమాజ్ చేసారు! వీడియో "శిశు భారతీయ విద్యాలయ" మాల్వియా నగర్ ఐష్‌బాగ్ లక్నో నుండి వచ్చింది. జాతీయ పండుగ రోజున జిహాద్ వేర్పాటువాద ఎజెండా ద్వారా మీరు ఏమి అర్థం చేసుకున్నారు?" అంటూ సాగింది ఈ క్లెయిం.


Full View
Full View


ఆర్కైవ్ లింక్‌లు:

https://web.archive.org/web/20220817053047/https://twitter.com/JitendraStv/status/1559142442506473473

https://web.archive.org/web/20220817053202/https://www.facebook.com/saini.sandeep.355744/videos/371946955133497

నిజ నిర్ధారణ:

క్లెయిం తప్పుదారి పట్టించేది గా ఉంది. వీడియోలో కొంత భాగం మాత్రమే తీసుకుని తప్పుదారి పట్టించే మతపరమైన వ్యాఖ్యలతో షేర్ చేస్తున్నారు.

వైరల్ పోస్ట్‌లలో కామెంట్లను గమనించినప్పుడు, పాఠకులలో ఒకరు ఈ వ్యాఖ్యలలో నిజం లేదంటూ లక్నో పోలీసు కమిషనరేట్ ప్రచురించిన ప్రకటనను పంచుకున్నారు.

శోధించగా, లక్నో పోలీసు కమిషనరేట్ ట్వీట్ చేసిన పూర్తి వీడియో కూడా లభించింది "మత సామరస్యం కోసం చిన్న పిల్లలు ప్రదర్శించిన నాటకం పూర్తి వీడియోను ఇక్కడ చూడొచ్చు, దీనిని కొంతమంది సంఘ వ్యతిరేక వ్యక్తులు తప్పుగా ప్రచారం చేశారు, మత విద్వేషాన్ని వ్యాప్తి చేసే నేరపూరిత చర్య జరిగింది. అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం." అన్నది ఈ ట్వీట్ శారాంశం.

తదుపరి శోధనలో, 'టైమ్స్ ఆఫ్ ఇండియా' జర్నలిస్ట్ చేసిన మరో ట్వీట్ లభించింది. ఈ ట్విటర్ థ్రెడ్ పాఠశాల పిల్లలు ఆడిన మొత్తం స్కిట్ భాగాలను, నాటకాన్ని రూపొందించిన పాఠశాల ఉపాధ్యాయిని ఇంటర్వ్యూను కూడా షేర్ చేసారు.

ఉపాధ్యాయురాలు శ్రీమతి ప్రగతి నిగమ్ మాట్లాడుతూ "'షేర్ చేస్తున్న వీడియో తప్పు, మీరు పూర్తి వీడియోను చూడండి. నాలుగు మతాలను కలపడానికి నేను ఒక నాటకం వేయించాను. ఏ మతం మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. అసంపూర్ణ వీడియోను పంచుకోవద్దు. అలాంటి వారి ఉద్దేశ్యం మా స్కూల్ పరువు తీయడమే అని అనుకుంటున్నాను. అందరినీ ముందుగా పూర్తి వీడియో చూడవలసిందిగా కోరుతున్నాను."

నివేదికల ప్రకారం, లక్నో పోలీసులు వైరల్ వీడియో పోస్ట్‌ను ఖండించారు, తప్పుడు, తప్పుదోవ పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

https://www.jagran.com/uttar-pradesh/lucknow-city-childrens-drama-staged-in-school-in-lucknow-controversial-video-went-viral-and-made-serious-allegations-22982798.html

అందువల్ల, వైరల్ వీడియోలో నాటకంలో దేశాన్ని అవమానించారనే వైరల్ వాదన తప్పుదారి పట్టించేది. పాఠశాల పిల్లలు ఆడిన పూర్తి స్కిట్ ఎడిట్ చేసి తప్పుదారి పట్టించే మతపరమైన వాదనలతో షేర్ అవుతోంది.

Claim :  India was insulted in the school play
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News