ఫ్యాక్ట్ చెక్: వైఎస్ షర్మిల సీఎం జగన్ తో తీసుకున్న ఫ్యామిలీ ఫోటో ఇటీవలిది కాదు. తన కుమారుడి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు షర్మిల ఈ ఫోటోను తీసుకోలేదు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెల్లెలు. తన సోదరుడితో రాజకీయ విభేదాల కారణంగా, ఆమె 2021లో తెలంగాణలో తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు.

Update: 2024-01-06 09:21 GMT

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెల్లెలు. తన సోదరుడితో రాజకీయ విభేదాల కారణంగా, ఆమె 2021లో తెలంగాణలో తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. నవంబర్ 2023లో, ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

USAలో మాస్టర్స్ చదువుతున్న ఆమె కొడుకు పెళ్లి ఫిక్స్ అయింది. 2024 జనవరి 18న నిశ్చితార్థం జరుగుతుందని, ఫిబ్రవరి 17, 2024న వివాహం జరుగుతుందని ట్విట్టర్‌లో షర్మిల ప్రకటించారు. అలాగే తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించేందుకు విజయవాడ వెళ్లారు.

ఈ సందర్భంలో.. షర్మిల, ఆమె భర్త, ఆమె సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అతని భార్య, వారి తల్లితో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “YS Sharmila @realyssharmila Invited her brother YS Jagan @ysjagan for her son's wedding and given the first invitation card.” అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
మరొక ట్విట్టర్ వినియోగదారుడు “కుటుంబ బంధాలు బలంగా ఉన్నాయి! న్యూఢిల్లీలో 2024లో భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా జగన్ రెడ్డి సేఫ్! ఇండియా కూటమిలో షర్మిల ముందస్తు ల్యాండింగ్!" అని చెప్పుకొచ్చారు.

ఫ్యాక్ట్ చెక్ :

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రం 2019 నాటిది.
మేము వైరల్ పోస్ట్‌లలో కామెంట్‌లను చూశాం. చిత్రం 2019 సంవత్సరానికి చెందినది అని పేర్కొంటూ కొన్ని పోస్టులను మేము కనుగొన్నాము. దీన్ని క్యూగా తీసుకొని, మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రాన్ని శోధించాము. చిత్రం 2019 నుండి ఆన్‌లైన్‌లో ఉందని కనుగొన్నాము. వైఎస్ షర్మిల తన కుమారుడి పెళ్లికి తన సోదరుడిని ఆహ్వానించేందుకు వెళ్లినప్పటికీ ఈ ఫోటోకు ఎలాంటి సంబంధం లేదు.

Filter Kaapi అనే ట్విట్టర్ అకౌంట్ లో మే 30, 2019న ఫోటోను పోస్టు చేశారు. “One for the album. #YSJagan's sister #sharmila tweets this family pic with Jagan, Bharathi, mother Vijayamma, husband Anil.” అంటూ ఫోటోను పోస్టు చేశారు. షర్మిల తన కుటుంబంతో కలిసి ఫోటోను పోస్టు చేశారు.
ఏప్రిల్ 2021లో ఒక ప్రాంతీయ వార్తా వెబ్‌సైట్ telugu.samayam.comలో ప్రచురించిన కథనంలో కూడా ఈ చిత్రాన్ని కనుగొన్నాం.

ఇటీవల వైఎస్ షర్మిల విజయవాడలో దిగి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు ఆమె సోదరుడు, కుటుంబసభ్యులను కలవడానికి వెళ్తున్న వీడియోలను పలు న్యూస్ టీవీ ఛానెల్స్ ప్రచురించాయి. షర్మిల, సీఎం జగన్ 2 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారని, ఈ భేటీలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఆమె తెలిపారు.
Full View
Full View
Full View

అందుకే, వైరల్ అయిన చిత్రం పాతది. ఇటీవల తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వైఎస్ షర్మిల పర్యటనతో ఎలాంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  The image shows YSRTP president YS Sharmila meeting her brother and Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy a couple of days ago, when she invited him to her son's marriage
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News