నిజ నిర్ధారణ: శిథిలాల కింద పడి మరణించిన ప్రేమికుల చిత్రం టర్కీ కి సంబంధించింది కాదు

ఫిబ్రవరి 11, 2023న సిరియా సరిహద్దుకు సమీపంలో ఆగ్నేయ టర్కీలో సంభవించిన తీవ్రమైన భూకంపం కారణంగా వేలాది మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. టర్కీలో మరణాల సంఖ్య సుమారు 35,000 సిరియాలో 5,800 దాటింది. రక్షకులు ఇప్పటికీ శిధిలాల కింద ఇరుకున్న వారిని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు.

Update: 2023-02-21 05:02 GMT

ఫిబ్రవరి 11, 2023న సిరియా సరిహద్దుకు సమీపంలో ఆగ్నేయ టర్కీలో సంభవించిన తీవ్రమైన భూకంపం కారణంగా వేలాది మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. టర్కీలో మరణాల సంఖ్య సుమారు 35,000 సిరియాలో 5,800 దాటింది. రక్షకులు ఇప్పటికీ శిధిలాల కింద ఇరుకున్న వారిని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు.

ఈ విపత్తు తర్వాత, దానికి సంబంధించిన అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో కొన్ని తప్పుడు వార్తలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా, భూకంపం ధాటికి ఇద్దరు ప్రేమికులు శిథిలాల కింద సమాధి అయ్యి చనిపోయినట్లు చూపిస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాలెంటైన్స్ డేగా జరుపుకునే ఫిబ్రవరి 14కి కొద్ది రోజుల ముందు టర్కీలో విపత్తు సంభవించినందున, ప్రజలు అది శాశ్వతమైన ప్రేమను సూచిస్తున్న చిత్రాన్ని పంచుకోవడం ప్రారంభించారు.

ఈ దావా బెంగాలీ, ఆంగ్లం రెండింటిలోనూ వైరల్‌గా ఉంది.

బెంగాలీలో క్లెయిం ఇలా ఉంది "” ভালোবাসা এমনিই!' তুর্কির ভয়াবহ ভুমিকম্পে জড়ে যাওয়ার দুটি ভালোবাসার ফুল।'”" అంటే “ ప్రేమ నిజంగా అందమైనది, టర్కీ భూకంపంలో చిక్కుకున్న రెండు ప్రేమ పువ్వులు ”

Full View


Full View
Full View


Full View


Full View


నిజ నిర్ధారణ:

టర్కీలో భూకంపం శిథిలాల కింద ఇద్దరు ప్రేమికులు చనిపోవడాన్ని చిత్రం చూపిస్తోందనే వాదన అవాస్తవం. చిత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే టీవీ సిరీస్‌లోనిది.

చిత్రంపై గూగుల్ రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించినప్పుడు, చిత్రం అమెజాన్.కాం తో సహా వివిధ వెబ్‌సైట్‌లలో షేర్ చేసారని తెలుస్తోంది. అమెజాన్.కాం లో, ఈ చిత్రం ది ఫోటోగ్రఫీ ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్- సీజన్ 1 నుండి సీజన్ 8 అనే అధికారిక ఫోటో బుక్ భాగంగా షేర్ అయ్యింది.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ గురించి హఫ్ పోస్ట్.కాం లోని వినోద కథనం ప్రకారం, ఈ చిత్రం ఒక భావోద్వేగ క్షణాన్ని సూచిస్తుంది, సిరీస్‌లోని టైరియన్ లన్నిస్టర్ పాత్ర కింగ్స్ ల్యాండింగ్ శిథిలాల కింద తన తోబుట్టువులు చనిపోయినట్లు చూడడాన్ని చిత్రీకరించేదే ఈ ఫోటో.

చిత్రానికి సంబంధించిన మొత్తం కథను ఈ లింక్‌లో చూడవచ్చు.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే టీవీ సిరీస్‌కు సంబంధించిన ఈ చిత్రం అనేక ఇతర వెబ్‌సైట్‌లలో ప్రచురించబడింది.

ఈ క్లెయిం ను పొలిటీఫ్యాక్ట్ అనే ఫ్యాక్ట్ చెక్ సంస్థ కూడా తోసిపుచ్చింది.

కాబట్టి, వైరల్ చిత్రం 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టీవీ సిరీస్‌లోనిది, ఇటీవల టర్కీలో సంభవించిన భూకంపం తరువాత తీసినది కాదు. క్లెయిం అబద్దం.

Claim :  image shows lovers dead under earthquake rubble in Turkey
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News