ఫ్యాక్ట్ చెక్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళ హత్యోదంతానికి మతం ముసుగు వేసి ప్రచారం చేస్తున్నారు
సంజయ్ అనే హిందూ వ్యక్తి, గుల్నాజ్ అనే ముస్లిం యువతి పెళ్లి చేసుకున్నారని, వారు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. పోలీసు
By - Satya Priya BNUpdate: 2025-02-01 05:52 GMT
ఇటీవలి కాలంలో భర్త నే భార్య ను చంపి పారిపోతున్న ఉదంతాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.అయితే, వీటిలో కొన్నిటికి మతాల రంగు పులిమి వైరల్ గా మారుస్తున్నారు. కొన్ని లవ్ జిహాద్ పేరు మీద ప్రచారం అవుతుంటే, కొన్ని భగవా లవ్ అంటూ షేర్ అవుతున్నాయి.
అయితే, పోలీసు అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా కనపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అధికారులు ఒక ఇంటి రూములో సోదాలు చేసి, ఫ్రిజ్‌లో మహిళ మృతదేహాన్ని కనుగొన్నారనీ, ఆ రూములో సంజయ్ అనే హిందూ వ్యక్తి, గుల్నాజ్ అనే ముస్లిం యువతి పెళ్లి చేసుకుని నివసించేవారనీ, ఆమెను అతను చంపేసాడనీ ఈ వాదన సారాశం. భగవా లవ్ ట్రాప్ అనే హ్యాష్ ట్యాగ్ తో వీడియోను షేర్ చేస్తున్నారు.
“मामला मध्यप्रदेश के देवास की घटना है ये हिन्दू #संजय पाटीदार और मुस्लिम लड़की गुलनाज भागकर शादी की थी किराये का रूम लेकर रहते थे 4 दिन से रूम बंद था लोगों ने दरवाजा तोड़कर सब चेक किया तो गुलनाज की लाश के टुकड़े फ्रिज में रखे मिले,, अब बताओ su/वरों जिहादी कौन है,,,” అంటూ హిందీలో పోస్టు వైరల్ అవుతూ ఉంది.
సంజయ్, గుల్నాజ్ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వారు అద్దె గదిలో నివసించేవారు. 4 రోజులుగా గది మూసి ఉంది. ప్రజలు తలుపులు పగులగొట్టి లోపలికి చూడగా ఫ్రిజ్‌లో గుల్నాజ్ మృతదేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది అని సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెబుతున్నారు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఇందుకు సంబంధించిన కథనాలను వెతకగా "ఇద్దరూ 5 ఏళ్ల లివ్ ఇన్ రిలేషన్‌షిప్ లో ఉన్నట్టూ, 9 నెలల పాటు శరీరాన్ని ఫ్రిజ్‌లో ఉంచాడు, అయితే విద్యుత్ అంతరాయం కారణంగా ఈ ఘటన బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లోని బృందావన్ ధామ్ కాలనీలో తాళం వేసి ఉన్న గదిలో ఫ్రిజ్‌లో ఓ యువతి మృతదేహం కనిపించింది. దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల రాకతో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణలో మృతదేహం కొన్ని నెలల నాటిదని పోలీసులు గుర్తించారు. తర్వాత సంజయ్ పాటిదార్, వినోద్ దావే అనే ఇద్దరిని అరెస్టు చేశారు. మరణించిన పింకీ ప్రజాపతి అనే మహిళతో సంజయ్ 5 సంవత్సరాలుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నాడు. పింకీ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో సంజయ్ తన సహచరుడు వినోద్‌తో కలిసి మార్చి 2024లో ఆమెను గొంతుపిసికి చంపి, ఆపై ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. విద్యుత్తు అంతరాయం కారణంగా ఫ్లాట్ నుండి దుర్వాసన రాగా ఈ ఘటన బయటపడింది." X లో షేర్ అవుతున్న కొన్ని పోస్టులు మాకు కనపడ్డాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం 'ఆరు నెలలకు పైగా, హత్యకు గురైన మహిళ మృతదేహం మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్‌లోని అద్దె గదిలో రిఫ్రిజిరేటర్‌లో ఉండిపోయింది. జూలై 2024లో, ఒక వ్యక్తి భవనం గ్రౌండ్ ఫ్లోర్‌ను అద్దెకు తీసుకున్నాడు, కానీ అది మూసివేసి ఉండడంతో గదిని ఉపయోగించలేకపోయారు. తాళం పగులగొట్టి తలుపులు తెరిచారు. ఫ్రిజ్ స్విచ్ ఆన్ చేసి ఉండడాన్ని వారు గుర్తించారు. ఫ్రిజ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత భరించలేని దుర్వాసన ఆ ప్రాంతమంతా వ్యాపించింది. కొందరు ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రిఫ్రిజిరేటర్‌ను తెరిచి చూడగా, బెడ్‌షీట్‌లో చుట్టిన కుళ్లిపోయిన మృతదేహం బయటపడింది. బాధితురాలు ప్రతిభ అని, ఆమె లైవ్-ఇన్ భాగస్వామి సంజయ్ పాటిదార్ చేతుల్లో హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించారు.
ABP న్యూస్ ప్రకారం, సంజయ్ పాటిదార్ పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించారు. ఆ మహిళ పేరు ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతి అని తెలిపారు. సంజయ్ పాటిదార్ గత ఐదేళ్లుగా ఆమెతో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నాడు. గత మూడేళ్లుగా ఉజ్జయినిలోని ఓ ఇంట్లో ఉంటున్నారు. ఆ తర్వాత దేవాస్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రెండేళ్లపాటు పింకీ ప్రజాపతితో ఉన్నాడు. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కారణంగా తన స్నేహితుడితో కలిసి పింకీని గొంతునులిమి హత్య చేసి మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాడు, అప్పటి నుండి రిఫ్రిజిరేటర్ ఆన్‌లో ఉంది.
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో హత్యకు గురైన మహిళ ముస్లిం అని, ఆమె పేరు గుల్నాజ్ అనే వాదనలో ఎలాంటి నిజం లేదు. మహిళ పేరు ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతి. ఈ సంఘటనలో మతపరమైన కోణం లేదు.
Claim : ఒక హిందూ వ్యక్తి తన ముస్లిం భార్యను హత్య చేసి, ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో భద్రపరిచాడు
Claimed By : Twitter users
Fact Check : Unknown