ఫ్యాక్ట్ చెక్: జమ్మూ కశ్మీర్ లో ఇల్లు తగలబడిపోతున్న వీడియో ఇటీవలిది కాదు

వైరల్ వీడియో 2021 నుండి ఆన్ లైన్ లో ఉంది

Update: 2025-04-25 14:43 GMT

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ ఘటనపై భారతదేశం అంతటా నిరసనలు చేపట్టాయి. కొవ్వొత్తుల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ పోస్టుల నుండి కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం.

భారత్ కూడా పాకిస్థాన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో సహా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కేంద్రం కఠిన చర్యలను ప్రకటించింది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో సహా ఉన్నత సైనిక అధికారులతో జాతీయ భద్రతా కమిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సింధు నది నుండి నీటి సరఫరాను ఆపడానికి భారతదేశం చేసే ఏ ప్రయత్నమైనా యుద్ధం కిందే పరిగణించబడుతుందని పాక్ తెలిపింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను తమ అధికార పరిధిలో నివసిస్తున్న అందరు పాకిస్తాన్ జాతీయులను గుర్తించి, వారిని బహిష్కరించాలని కోరారు. పహల్గామ్ దాడిని ప్లాన్ చేయడంలోనూ, అమలు చేయడంలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని భారతదేశం తెలిపింది.

ఇంతలో ఓ ఇల్లు తగలబడుతున్న విజువల్స్, కాల్పుల శబ్దం వినిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పహల్గామ్ తీవ్రవాద ఘటన చోటు చేసుకున్న వెంటనే భారత సైన్యం యాక్షన్ లో దిగిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు.

Full View


Full View



వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు



 ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు. 2021 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.

@SonOfBharat7 అనే ఖాతాలో పోస్టు చేసిన వైరల్ వీడియో కామెంట్స్ విభాగంలో ఓ స్క్రీన్ షాట్ ను మేము గమనించాం. మూడు సంవత్సరాల కిందటి వీడియో అని ఆ స్క్రీన్ షాట్ లో ఉంది.



ఆ స్క్రీన్ షాట్ ను క్యూగా తీసుకుని అందులో వాటర్ మార్క్ గా ఉన్న Excelsior News యూట్యూబ్ ఛానల్ గురించి మేము వెతికాం. Kokernag Encounter: Militants Made Abortive Bid To Escape Before Being Killed అనే టైటిల్ తో మే 12, 2021న వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోకు మూడున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Full View


ఇదే వీడియోను సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ వీడియోలో అనంత్ నాగ్ అని ఉండడమే కాకుండా మే 12, 2021 అనే తేదీని కూడా మేము గుర్తించాం. దీన్ని బట్టి ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ మే 12, 2021 చోటు చేసుకుందని తెలుసుకున్నాం.

ఇక ఆ సమయంలో ఎన్ కౌంటర్ గురించిన వివరాల కోసం వెతకగా గల్ఫ్ టుడే వెబ్ సైట్ లో "3 LeT militants killed in Kashmir encounter" అనే టైటిల్ తో కథనాన్ని నివేదించారు.

దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్‌ఇటికి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారని ఈ కథనం నివేదించింది. కోకెర్నాగ్‌లోని వైలూ ప్రాంతంలోని షేక్‌పోరా గ్రామంలోని ఒక నివాస గృహంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు అనంత్‌నాగ్ పోలీసులు నిర్దిష్ట సమాచారం మేరకు, పోలీసులు, ఆర్మీ 19 ఆర్‌ఆర్, సిఆర్‌పిఎఫ్ సంయుక్తంగా కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదుల ఉనికిని నిర్ధారించుకున్న తర్వాత వారికి లొంగిపోయే అవకాశం ఇచ్చారు. అయితే వారు భద్రతా బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు, ఇది ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. కాల్పుల్లో చిక్కుకున్న పౌరులందరినీ కూడా రక్షణ బృందాలు రక్షించాయి. కాల్పుల ప్రాంతం నుండి ప్రజలను సురక్షితంగా తరలించడానికి తాత్కాలికంగా ఆపరేషన్‌ను నిలిపివేసాయి.

పౌరులందరూ సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత, ఆపరేషన్ తిరిగి ప్రారంభించారు. తరువాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులందరూ హతమయ్యారు. మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను ఎన్‌కౌంటర్ స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు. డాన్వత్‌పోరా కోకెర్నాగ్ నివాసి ఇలియాస్ అహ్మద్ దార్ అలియాస్ సమీర్, బటమలూ శ్రీనగర్ నివాసి ఉబైద్ షఫీ అలియాస్ అబ్దుల్లా, ఖండయ్‌పోరా కుల్గాం నివాసి అకిబ్ అహ్మద్ లోన్ అలియాస్ సాహిల్‌గా గుర్తించారని నివేదికలు తెలిపాయి.

అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

మే 11, 2021న ఈ ఎన్ కౌంటర్ జరిగిందని సంబంధిత నివేదికలు తెలిపాయి. కోకెర్నాగ్‌లోని షేక్‌పోరా గ్రామంలోని ఒక ఇంట్లో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఆ ఇంటిపై దాడి చేసిన తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. "ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులకు లొంగిపోయే అవకాశం ఇచ్చారు, కానీ వారు ప్రతీకారం తీర్చుకోవాలని ఎంచుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురూ మరణించారు" అని పోలీసు ప్రతినిధి చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది.

వైరల్ అవుతున్న వీడియోను తెలుగు పోస్ట్ స్వతంత్రంగా ధృవీకరించలేకనప్పటికీ, ఈ వీడియో పహల్గామ్ ఉగ్రవాద దాడి కంటే ముందు నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉందని మేము గుర్తించాం.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  వైరల్ వీడియో 2021 నుండి ఆన్ లైన్ లో ఉంది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News