ఫ్యాక్ట్ చెక్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు తీసిన వీడియో కాదు.

అహ్మదాబాద్ లో జూన్ 12న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి

Update: 2025-06-20 05:05 GMT

జూన్ 12, 2025న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు. ఎయిర్ ఇండియా విమాన శకలాల నుండి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్స్‌ను డీకోడ్ చేయడానికి స్థలం గురించిన నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. 270 మంది మృతి చెందిన ఈ ప్రమాదంలో రికార్డర్ తీవ్రంగా దెబ్బతిన్నందున, డేటా రికవరీ కోసం భారతదేశం బ్లాక్ బాక్స్‌ను అమెరికాకు పంపుతుందని నివేదికలు వచ్చాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) డేటా రికవరీ కోసం ఎక్కడకు వెళ్లాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం తెలిపింది.


జూన్ 12న, లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI171 సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన నిమిషాలకే అహ్మదాబాద్‌లోని మెడికల్ హాస్టల్‌పై కూలిపోయింది. దురదృష్టకర విమానంలో ఉన్న 242 మందిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విషాదం జరిగిన 28 గంటల తర్వాత AAIB కూలిపోయిన విమానం నుండి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న AAIB, స్థానిక అధికారులు, ఏజెన్సీల నుండి అవసరమైన మద్దతుతో తమ దర్యాప్తు క్రమంగా కొనసాగుతోందని తెలిపింది. సైట్ డాక్యుమెంటేషన్, ఆధారాల సేకరణతో సహా కీలక రికవరీ పనులు పూర్తయ్యాయని, ఇప్పుడు మరింత విశ్లేషణ జరుగుతోందని తెలిపింది. ప్రమాద స్థలంలో బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో రెండు బ్లాక్ బాక్స్ సెట్‌లు ఉన్నాయి. అధికారులు క్రాష్ సైట్ నుండి స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) యొక్క సంయుక్త యూనిట్‌ను పరిశీలిస్తున్నారు.

అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అంటూ పలు విమానాలకు సంబంధించిన విజువల్స్, విమానాల లోపల ప్రయాణీకులు ఉన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

https://www.facebook.com/reel/705743038744944

'ప్రమాదం నిమిషం ముందు యువతీ వీడియో లీక్ కానీ చివరకు... | Air India Plane Crash | CVR News' అంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు.



వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు

వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఇదే వీడియోను పలు మీడియా సంస్థలు నివేదించాయి. ఇది దుబాయ్ నుండి జైపూర్ కు వెళ్లే విమానంలో చోటు చేసుకున్న ఘటన అంటూ నివేదించాయి.

దుబాయ్ నుండి జైపూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX196 లో ప్రయాణిస్తున్న వారు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఏసీ లేదు, కమ్యూనికేషన్ లేదు, సిబ్బంది నుండి ఎలాంటి సహాయం లేదు” అని ఆ వీడియోలో యూజర్ రాశారు. ఆమెతో పాటు కొడుకు కూడా ఉన్నాడు, 5 గంటల నిరీక్షణ కారణంగా ఎంతో ఇబ్బంది పడ్డాడని వాపోయారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖ డైటీషియన్ అయిన ఆర్జో సేథి తన అనుభవాన్ని వీడియోలో పంచుకున్నారు. సేథి ప్రయాణీకులను పట్టించుకోనందుకు ఎయిర్ ఇండియా సిబ్బందిని విమర్శించడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఆపై ఆమె కుమారుడు, ఇతరులు విమానం లోపల బాగా చెమటలు పడుతున్నట్లు చూపిస్తుంది. చాలామంది ఒకేసారి తమ కాల్ బెల్‌లను నొక్కుతున్నారు. “ఇది ఉదయం 12:30 గంటలు. జవాబుదారీతనం లేదు. ఈ పరిస్థితిని చూడండి” అని సేథి క్లిప్‌లో వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా ఎయిర్‌లైన్స్ సిబ్బంది మౌనంగా ఉండడాన్ని ఆమె ప్రశ్నించింది. "ఇది సాంకేతిక లోపం అయినప్పటికీ, సరైన కమ్యూనికేషన్ ఎక్కడ ఉంది? జవాబుదారీతనం ఎక్కడ?" ఆమె క్యాబిన్ వాతావరణాన్ని చూపిస్తూ అడిగింది.

ఈ ఘటన కు సంబంధించి మీడియా కథనాలన్నీ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాతనే నివేదించారు. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


మేము ఆర్జూ సేథీ ఇన్స్టాగ్రామ్ లో అసలు వీడియోను కూడా గుర్తించాం. 14 జూన్ 2025న వీడియోను పోస్టు చేశారు. ఒక మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి.




కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  అహ్మదాబాద్ లో జూన్ 12న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News