ఫ్యాక్ట్ చెక్: గాజాకు సంబంధించిన విజువల్స్ ను పాకిస్థాన్ కు చెందినవిగా వైరల్ చేస్తున్నారు

భారతదేశం - పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత దళాలు

Update: 2025-05-09 10:53 GMT

జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్‌తో ఉద్రిక్తతను పెంచేందుకు పాకిస్తాన్ చేసిన దాడులను అడ్డుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. శ్రీనగర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, లూథియానా, చండీగఢ్ ఇతర ప్రదేశాలలోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాక్ చేసిన ప్రయత్నాలకు ప్రతిస్పందనగా, లాహోర్‌తో సహా అనేక ప్రదేశాలలో పాకిస్తాన్ వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి భారత దళాలు.


పాకిస్తాన్ ప్రారంభించిన దాడులకు భారత దళాల స్పందన అంతే తీవ్రంగా ఉంది. పాకిస్తాన్ వైమానిక రక్షణను నాశనం చేయడానికి భారతదేశం హార్పీ డ్రోన్‌లను ఉపయోగించిందని, రష్యాలో తయారు చేసిన S-400 రక్షణ వ్యవస్థను ఉపయోగించి క్షిపణులను కూల్చివేసిందని పలు మీడియా సంస్థలు తెలిపాయి. పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా భారత సైన్యం హార్పీ డ్రోన్‌లను ఉపయోగించింది. పాకిస్తాన్ భారతదేశ రాడార్ వ్యవస్థను దెబ్బతీసేందుకు విఫలయత్నం చేసిన తర్వాత ఇది జరిగింది. 

అయితే భారీగా భవనాలు ధ్వంసమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇది పాకిస్థాన్ లోని నగరాల పరిస్థితి అంటూ కొన్ని వీడియోలను పోస్టు చేస్తున్నారు. పాకిస్థాన్ లోని పలు నగరాల దుస్థితి ఇలా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. 

Full View


Full View


పాకిస్థాన్ ఖేల్ ఖతం చేశారంటూ ఈ వీడియోలను పోస్టు చేస్తున్నారు నెటిజన్లు



వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు

వైరల్ అవుతున్న విజువల్స్ గాజాకు సంబంధించినవని గతంలోనే పలువురు యూజర్లు ఈ వీడియోను పోస్టు చేశారు.

వైరల్ వీడియోను స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. పలువురు సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోలను ఆపరేషన్ సింధూర్ కంటే ముందే పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేశారని నిర్ధారించాం.

11 ఏప్రిల్ 2025న Heart touching situations in Gaza #nasheed #islamicnasheed #gaza #gazaunderattack #gazacrisis అనే టైటిల్ తో ICONIC Bayans అనే యూట్యూబ్ పేజీలో వీడియో పోస్టు చేశారని మేము గుర్తించాం.

Full View



ఏప్రిల్ 22, 2025న All In One Vlogs BWP అనే పేజీలో కూడా ఈ వీడియోను పోస్టు చేశారు.

Full View


కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కంటే ముందు నుండే ఆన్ లైన్ లో అందుబాటులో ఉందని మేము ధృవీకరించాం.

వైరల్ వీడియోలో ఉన్న లొకేషన్ ను తెలుగు పోస్ట్ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినా ఈ వీడియో ఆపరేషన్ సింధూర్ కంటే ముందు నుండే ఆన్ లైన్ లో ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

భారతదేశం - పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత దళాలు
పాకిస్తాన్ నగరాలను ధ్వంసం చేశాయనే వాదనతో ధ్వంసమైన భవనాలను చూపించే వీడియో షేర్ చేస్తున్నారని, ఈ వీడియో ఏప్రిల్ 2025 ముందు నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని D-Intent Data కూడా తెలిపింది.

వైరల్ అవుతున్న విజువల్స్ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు నుండే ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి భారీగా ధ్వంసమైన విజువల్స్ ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించింది కాదు. వైరల్ వీడియోలు గాజాకు సంబంధించినవని గతంలో పలువురు సోషల్ మీడియా యూజర్లు షేర్ చేశారు.  

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  భారతదేశం - పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత దళాలు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News