ఫ్యాక్ట్ చెక్: ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎం స్కామ్ జరిగిందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ లో ఆరోపించలేదు
జాదవ్ పూర్ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సయోనీ ఘోష్ జులై 29, 2025న పార్లమెంట్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) ప్రతినిధులు జులై 2025లో న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం అధికారులను కలిసి, భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలలోనూ ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) స్థానంలో సాంప్రదాయ పేపర్ బ్యాలెట్లను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ వివరణాత్మక ప్రతిపాదనను సమర్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఉదహరిస్తూ, ఓటర్ల విశ్వాసం, పారదర్శకత, జవాబుదారీతనం ప్రమాదంలో ఉన్నాయని వైసీపీ చెప్పింది.
విజయనగరంలో పోలింగ్ రోజున 40–50% మాత్రమే చూపించిన ఈవీఎం బ్యాటరీలు కౌంటింగ్ రోజున అకస్మాత్తుగా 99% చూపించాయని వైఎస్‌ఆర్‌సీపీ ప్రతినిధులు తెలిపారు. ఇది ట్యాంపరింగ్ లేదా యంత్రాలను మార్చే అవకాశం గురించి అనుమానాలను లేవనెత్తుతుందని తెలిపారు. మాక్ పోలింగ్ సమయంలో అసలు బ్యాటరీలను పరీక్షించలేదని, వాటి స్థానంలో కొత్త బ్యాటరీలను అమర్చారని ఆరోపించారు. పదే పదే సరైన ధృవీకరణ లేకుండా అసలు VVPAT స్లిప్‌లను ధ్వంసం చేశారని, కాలిపోయిన మెమరీ, మైక్రోకంట్రోలర్‌లను ధృవీకరించడంపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని నివేదించారు. నిల్వ, లెక్కింపు కేంద్రాల నుండి CCTV ఫుటేజ్ పోటీ అభ్యర్థులకు నిరాకరించారని, ఇది పారదర్శకత నిబంధనలను ఉల్లంఘిస్తుందని కూడా వైసీపీ పేర్కొంది.
రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో YSRCP కి వచ్చిన ఓట్లను కూడా హైలైట్ చేశారు. 2024లో, 2019తో పోలిస్తే ఊహించని విధంగా 30,000 ఓట్లు పెరిగాయి. దాదాపు అన్నీ TDPకి వెళ్లాయి, అయితే YSRCP ఓట్ల శాతం మారలేదు. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 1,99,901. YSRCP అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డికి 93,430 ఓట్లు (46.74%) రాగా, TDP అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి 95,925 ఓట్లు (47.99%) వచ్చాయి. ఆధిక్యం కేవలం 2,495 ఓట్లు (కేవలం 1.25%). హిందూపూర్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 28లో, YSRCP ఓటింగ్ ప్రవర్తనలో అసంబద్ధమైన వ్యత్యాసం కనిపించిందని ఆరోపించింది. అసెంబ్లీ, పార్లమెంటు రెండింటికీ ఒకే ఓటర్లు ఒకే స్థలం, సమయంలో తమ
రికార్డుల ప్రకారం YSRCP పార్లమెంటులో 472 ఓట్లను పొందింది, కానీ అసెంబ్లీలో 1 ఓటు మాత్రమే పొందింది. INC పార్లమెంటులో 1 ఓటును పొందింది, కానీ అసెంబ్లీలో 464 వచ్చాయి. TDP పార్లమెంటులో 8, అసెంబ్లీలో 95 పొందింది.
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సయాని గోష్ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ కొందరు పోస్టులను వైరల్ చేస్తున్నారు.
"2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సయాని గోష్ సంచలన వ్యాఖ్యలు !
2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో EVM స్కాం జరిగింది
ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధి EVM స్కాంకు ప్రధాన కారకుడు
దులిపేసిందిగా మోడీ గారు ఏమి సమాధానం చెప్పుతారో" అంటూ పోస్టు పెట్టారు.

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు:
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ వీడియోలో సయోనీ ఘోష్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎం టాంపరింగ్ కు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టంగా అర్థం అవుతోంది.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. మాకు ఎక్కడా కూడా సయోనీ ఘోష్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి కానీ EVM స్కామ్ గురించి మాట్లాడినట్లుగా ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు. ఆమె అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండి ఉంటే తప్పకుండా వార్తల్లో నిలిచి ఉండేవారు.
సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా Sansad TV యూట్యూబ్ ఛానల్ లో LS | Sayani Ghosh's Remarks | Special discussion on 'Operation Sindoor' | 29 July, 2025 అనే టైటిల్ తో పోస్టు చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియో మాకు లభించింది.
జాదవ్ పూర్ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సయోనీ ఘోష్ జులై 29, 2025న పార్లమెంట్ లో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రత్యేక చర్చ జరిగినప్పుడు ఆమె ఇలా స్పందించారు. వైరల్ వీడియోలో ఉన్న క్లిప్స్ ఈ వీడియోలో 2:57, 3:31, 5:18 మార్క్‌ల దగ్గర, పలు చోట్ల చూడవచ్చు.
పలు మీడియా సంస్థలు కూడా సయోనీ ఘోష్ మాట్లాడిన విజువల్స్ ను షేర్ చేశాయి.
22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఇందులో ఆమె మాట్లాడారు. అలాగే, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని దేశ ద్రోహులు అనడాన్ని తప్పుబట్టారు.
సయోనీ ఘోష్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి కానీ EVM స్కామ్ గురించి మాట్లాడినట్లుగా ఎలాంటి సాక్ష్యాలు కూడా లభించలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : జాదవ్ పూర్ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సయోనీ ఘోష్ జులై 29, 2025న పార్లమెంట్
Claimed By : Social Media Users
Fact Check : Unknown