ఫ్యాక్ట్ చెక్: కాంగ్రెస్ లో చేరిన తర్వాత వైఎస్ షర్మిల పోలీసులతో గొడవ పెట్టుకోలేదు

రెండు క్లిప్‌లతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదటి క్లిప్‌లో కాంగ్రెస్ సీనియర్

Update: 2024-01-25 08:39 GMT

హైదరాబాద్: రెండు క్లిప్‌లతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదటి క్లిప్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే వైఎస్ షర్మిలకు పార్టీ కండువా కప్పి, ఆమెను పార్టీలోకి స్వాగతించారు. రెండో క్లిప్‌లో షర్మిల కొందరు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్లిప్‌ను షేర్ చేస్తున్న వ్యక్తులు ఆమె కాంగ్రెస్‌లో చేరిన తర్వాత గొడవలు పెట్టుకుంటూ ఉన్నారనే వాదనతో షేర్ చేస్తున్నారు.

'కండువా' కప్పుకున్న తర్వాత.. వైఎస్ షర్మిల గూండాయిజం చేయడానికి 'లైసెన్స్' వచ్చిందనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ముందుగా మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. జనవరి 4, 2024 న షర్మిల కాంగ్రెస్‌లో చేరిన క్లిప్పింగ్ దొరికింది. ఇండియా టుడే మీడియా సంస్థ అప్లోడ్ చేసిన వీడియోతో.. వైరల్ వీడియోలోని ఫుటేజ్ తో సరిపోతుంది. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి అధికారికంగా చేరిన విషయాన్ని ఈ వీడియోల ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉంది.
Full View

Full View

ఇక రెండవ వీడియో.. పోలీసులతో వైఎస్ షర్మిల గొడవ గురించి తెలియజేస్తుంది. పోలీసులతో వైఎస్ షర్మిల గొడవకు సంబంధించిన క్లిప్ ఏప్రిల్ 2023లో చోటు చేసుకుంది. రెండవ క్లిప్ సందర్భాన్ని ధృవీకరించడానికి.. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించాము. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాం. మిర్రర్ నౌలో 2023 ఏప్రిల్ 24న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వైరల్ క్లిప్‌కు సరిపోయే ఫ్రేమ్‌లను కలిగి ఉన్న వీడియోని గుర్తించాం.
Full View

ఈ ఘటన జరిగిన సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో లేరు. ఆమె యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) పేరుతో వేరే పార్టీకి నాయకత్వం వహించారు. దైనిక్ భాస్కర్, NDTV నుండి వచ్చిన వార్తా నివేదికల ప్రకారం, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పరీక్ష పేపర్ లీక్ కేసుకు సంబంధించిన నిరసనలు తెలపడానికి వెళ్లిన సమయంలో ఆమెను అరెస్టు చేయాలని పోలీసులు చూశారు. ఆ సమయంలో జరిగిన గొడవలో ఆమె ఒక పోలీసు అధికారిని చెంపదెబ్బ కొట్టారు. దీంతో ఆమెను జైలుకు తరలించారు.
Full View

వైఎస్ షర్మిల పోలీసు సిబ్బందితో ఘర్షణ పడుతున్న వీడియో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చోటు చేసుకున్న ఘటన కానే కాదు. ఈ సంఘటన ఏప్రిల్ 2023లో జరిగింది. ఆమె కాంగ్రెస్‌లో చేరడానికి ముందే ఈ ఘటన చోటు చేసుకుంది.


Claim :  A viral video shows two scenes: Congress welcoming Sharmila with the party scarf, and her arguing with police. People claim the argument happened after joining Congress
Claimed By :  X User
Fact Check :  False
Tags:    

Similar News