ఫ్యాక్ట్ చెక్: సీరియల్ కు సంబంధించిన విజువల్స్ ను నిజంగా జరిగినదిగా ప్రచారం చేస్తున్నారు
వైరల్ అవుతున్న విజువల్స్ ఓ సీరియల్ కు సంబంధించినవి
కాలం మారుతున్నప్పటికీ కట్నం కోసం డిమాండ్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. పలు ప్రాంతాల్లో ఇంకా కట్నం కోసం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కట్నం తీసుకుని రాలేదని మహిళలను హింసిస్తూ కూడా ఉన్నారు. ఇక అబ్బాయిలు కట్నం తీసుకోకపోయినా గొడవలు జరిగిన సందర్భాల్లో తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు.
మహిళలపై జరిగిన నేరాలను పోలీసులు పరిష్కరించడంపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 డేటా ప్రకారం, మొత్తం 34,662 కేసులు తప్పుడు కేసులుగా నివేదించారు. 39,202 కేసులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ లేదా ఇతర కారణాలుగా నివేదించినట్లుగా డేటా చెబుతోంది. ఇందులో భర్త లేదా అతని బంధువులు చేసిన క్రూరత్వం కింద 7,076 కేసులు, అత్యాచారం కేసులు 4,340, మహిళలపై దాడి కింద 6,821 కేసులు ఉన్నాయి. అలాగే, కిడ్నాప్, అపహరణ కింద 8,588 కేసులు కూడా తప్పుడు కేసులుగా ముగిశాయి.
సుప్రీం కోర్టు ఎట్టకేలకు ఒక శక్తివంతమైన, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తీర్పులో వరకట్న వేధింపుల చట్టాల దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండించింది. ఇప్పటి నుండి, సెక్షన్ 498A IPC కింద FIR దాఖలు చేసిన రెండు నెలల వరకు ఎటువంటి అరెస్టులు అనుమతించబడవని తెలిపింది. ఇది కేవలం చట్టపరమైన సంస్కరణ కాదు. ఏకపక్ష పక్షపాత వ్యవస్థకు బాధితులైన లెక్కలేనన్ని పురుషులు, వారి కుటుంబాలకు ఇది ఒక జీవనాడిగా మారింది. స్త్రీలను క్రూరత్వం నుండి రక్షించడానికి సెక్షన్ 498A ప్రవేశపెట్టారు. కానీ కాలక్రమేణా, ఇది ప్రతీకార ఆయుధంగా దుర్వినియోగం అవుతోంది. ధృవీకరించబడని ఫిర్యాదుల ఆధారంగా వృద్ధ తల్లిదండ్రులు, పెళ్లికాని సోదరీమణులు, దూరపు బంధువులను కూడా దర్యాప్తు లేకుండా జైలులో పెట్టారు. ఎంతో మంది కెరీర్లు నాశనమయ్యాయి. కుటుంబాలు నాశనం అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం అటువంటి ప్రతి కేసును ఇప్పుడు కుటుంబ సంక్షేమ కమిటీ ద్వారా నిర్వహించాలి. రెండు నెలల్లోపు దాని నివేదిక తర్వాత మాత్రమే పోలీసులు చర్య తీసుకోగలరు. కేవలం ఆరోపణలపై వెంటనే అరెస్టు చేసే కాలం ముగిసింది.
ఇంతలో ఓ యువతి రక్తపు మడుగులో పడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నేరం జరిగిన ప్రదేశంలో ఒక మహిళ సోఫాపై నిర్జీవంగా పడి ఉండగా, పోలీసు అధికారులు దర్యాప్తును చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కట్నం కోసం ఆమె అత్తమామలు ఆ మహిళను చంపేశారని చెబుతున్నారు. కట్నం కోసం తమ డిమాండ్లు నెరవేరకపోవడంతో అత్తమామలు కోడలిని హత్య చేశారని చాలా మంది వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
https://www.instagram.com/reel/DMNq7ynBQwa/
https://www.instagram.com/reel/DMPNGCChy-H/
https://www.facebook.com/reel/23994142843612511
సుప్రీం కోర్టు ఎట్టకేలకు ఒక శక్తివంతమైన, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తీర్పులో వరకట్న వేధింపుల చట్టాల దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండించింది. ఇప్పటి నుండి, సెక్షన్ 498A IPC కింద FIR దాఖలు చేసిన రెండు నెలల వరకు ఎటువంటి అరెస్టులు అనుమతించబడవని తెలిపింది. ఇది కేవలం చట్టపరమైన సంస్కరణ కాదు. ఏకపక్ష పక్షపాత వ్యవస్థకు బాధితులైన లెక్కలేనన్ని పురుషులు, వారి కుటుంబాలకు ఇది ఒక జీవనాడిగా మారింది. స్త్రీలను క్రూరత్వం నుండి రక్షించడానికి సెక్షన్ 498A ప్రవేశపెట్టారు. కానీ కాలక్రమేణా, ఇది ప్రతీకార ఆయుధంగా దుర్వినియోగం అవుతోంది. ధృవీకరించబడని ఫిర్యాదుల ఆధారంగా వృద్ధ తల్లిదండ్రులు, పెళ్లికాని సోదరీమణులు, దూరపు బంధువులను కూడా దర్యాప్తు లేకుండా జైలులో పెట్టారు. ఎంతో మంది కెరీర్లు నాశనమయ్యాయి. కుటుంబాలు నాశనం అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం అటువంటి ప్రతి కేసును ఇప్పుడు కుటుంబ సంక్షేమ కమిటీ ద్వారా నిర్వహించాలి. రెండు నెలల్లోపు దాని నివేదిక తర్వాత మాత్రమే పోలీసులు చర్య తీసుకోగలరు. కేవలం ఆరోపణలపై వెంటనే అరెస్టు చేసే కాలం ముగిసింది.
ఇంతలో ఓ యువతి రక్తపు మడుగులో పడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నేరం జరిగిన ప్రదేశంలో ఒక మహిళ సోఫాపై నిర్జీవంగా పడి ఉండగా, పోలీసు అధికారులు దర్యాప్తును చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కట్నం కోసం ఆమె అత్తమామలు ఆ మహిళను చంపేశారని చెబుతున్నారు. కట్నం కోసం తమ డిమాండ్లు నెరవేరకపోవడంతో అత్తమామలు కోడలిని హత్య చేశారని చాలా మంది వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
https://www.instagram.com/
https://www.instagram.com/
https://www.facebook.com/reel/
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇదొక సీరియల్ షూటింగ్ కు సంబంధించిన విజువల్స్.
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. తెలుగుపోస్ట్ బృందం డిసెంబర్ 23, 2022న అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోను కనుగొంది. సోనీ సెట్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో క్లిప్ కు సంబంధించిన పొడిగించిన వెర్షన్‌ను లభించింది.
ఈ ఫుటేజ్ క్రైమ్ పెట్రోల్ 2.0, ఎపిసోడ్ 173 కు సంబంధించింది. దీనిని మొదట సోనీ టీవీ నవంబర్ 2, 2022న ప్రసారం చేసింది. ఆ తర్వాత దీన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. Bharosa | Crime Patrol 2.0 - Ep 173 | Full Episode | 2 Nov 2022 అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
వీడియో వివరణలో "దీపావళి పండుగ సందర్భంగా స్నేహ అనే యువతి దారుణంగా హత్యకు గురవుతుంది. ఆమె తన తల్లి ఇంటికి వెళ్లి పండుగ జరుపుకుంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు, ఈ నేరం ప్రతీకార చర్య అయి ఉండవచ్చని, స్నేహకు బాగా తెలిసిన వ్యక్తి నిందితుడు అయి ఉండవచ్చని వారి అంచనా. దోషి ఎవరు అయిండొచ్చు? పోలీసులు ఈ రహస్యాన్ని ఛేదించగలరా?" అని ఉంది.
ఈ వీడియోలోని 11:17 నిమిషాల మార్క్ వద్ద, ఎపిసోడ్ కు సంబంధించి ఒక నేరాన్ని దర్యాప్తు చేయడానికి పోలీసులు వచ్చే దృశ్యాన్ని చూపిస్తుంది, ఇది వైరల్ క్లిప్‌లో కనిపించే విజువల్స్‌తో సరిపోలుతుంది.
వైరల్ వీడియో ఈ ఎపిసోడ్ షూటింగ్ కు సంబంధించిన క్షణం. ఇక పూర్తి ఎపిసోడ్‌ను నిశితంగా పరిశీలిస్తే, కథాంశానికి వరకట్న సంబంధిత హింసతో ఎలాంటి సంబంధం లేదు.
కాబట్టి, సినిమా షూటింగ్ కు సంబంధించిన విజువల్స్ ను వరకట్న వేధింపులకు సంబంధించి నిజంగా చోటు చేసుకున్న ఘటన అంటూ ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
కాబట్టి, సినిమా షూటింగ్ కు సంబంధించిన విజువల్స్ ను వరకట్న వేధింపులకు సంబంధించి నిజంగా చోటు చేసుకున్న ఘటన అంటూ ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ అవుతున్న విజువల్స్ ఓ సీరియల్ కు సంబంధించింది
Claimed By : Social Media Users
Fact Check : Unknown