ఫ్యాక్ట్ చెక్: స్క్రిప్టెడ్ వీడియోను లవ్ జీహాద్ ఘటనగా వైరల్ చేస్తున్నారు

హిందూ అమ్మాయిని ప్రలోభపెట్టి వివాహం చేసుకున్నాడనే ఆరోపణలతో

Update: 2025-06-11 05:10 GMT

హిందూ బాలికలను ప్రేమ పేరుతో మతం మార్చేందుకు ముస్లిం వ్యక్తులు చేసే ప్రయత్నాలను 'లవ్ జీహాద్' అంటూ హిందూ గ్రూపులు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఒక అమ్మాయి మతం మార్చడం అనే ఏకైక ఉద్దేశ్యంతో వివాహం జరిగితే అది చెల్లదని ఓ చట్టాన్ని కూడా తీసుకుని వచ్చారు. ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదించిన ఈ చట్టంతో శిక్ష విధించడమే కాకుండా జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది.


ఒక అమ్మాయిని మతం మార్చాలనే ఉద్దేశంతో చేసే వివాహం చెల్లదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. బలవంతపు మత మార్పిడికి 1-5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 15,000 జరిమానా విధిస్తారు. స్త్రీ మైనర్ అయినా, షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు చెందినది అయితే, జైలు శిక్ష 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. జరిమానా రూ. 25,000 వరకు పెరుగుతుంది. సామూహిక మతమార్పిడులకు 3-10 సంవత్సరాల జైలు శిక్ష, దానిని నిర్వహించే సంస్థలకు రూ. 50,000 జరిమానా విధిస్తారు. వివాహం తర్వాత ఎవరైనా తమ మతం మార్చుకోవాలనుకుంటే, వారు రెండు నెలల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్‌కు దరఖాస్తును సమర్పించాలి.

ఇంతలో ఓ లవ్ జీహాద్ ఘటనకు సంబంధించిన వీడియో అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. హిందూ అమ్మాయిని ప్రలోభపెట్టి వివాహం చేసుకున్నాడనే ఆరోపణలతో పోలీసులు ముస్లిం వ్యక్తిని అరెస్టు చేసినట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. చాలా మంది వినియోగదారులు ఇది 'లవ్ జిహాద్' కి ఉదాహరణ అని చెబుతున్నారు.

"ये विडियो वास्तविक है
कम से कम उम्र का तो लिहाज किया होता...
कैसे ऐसे धोखेबाजो के चुंगल मे फस जाती है लडकिया....बाजारू और चाय कोफी जैसे नशीले गरम खानपान के कारण लडृकियां मुल्लों और जाहिलों के चंगुल में फंस रही है" అంటూ హిందీలో పోస్టులు పెట్టారు.

"ఈ వీడియో నిజమే
కనీసం వారు వయస్సును పరిగణనలోకి తీసుకోవాలి...
అమ్మాయిలు ఇలాంటి మోసాల బారిలో ఎలా చిక్కుకుంటారు....పలు కారణాల వలన అమ్మాయిలు ముల్లాల బారిలో చిక్కుకుంటున్నారు." అంటూ వీడియోను పోస్టు చేస్తున్నారు.

Full View


వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో.

వైరల్ వీడియోను పరిశీలించగా పోలీసు యూనిఫామ్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు, వారి వెనుక మరో వ్యక్తి రావడం చూడొచ్చు. ఇదేనా లొకేషన్ అంటూ పోలీసులు చెప్పడం మనం వినవచ్చు. ఓ ఇంట్లోని గదిలో దండలు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉండగా, ఆ గది ముందు ఉన్న ఓ యువకుడు తప్పుకోవడంతో పోలీసులు అక్కడికి ఎంటర్ అవుతారు. పోలీసులతో వచ్చిన వ్యక్తి నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదంటూ ఎమోషనల్ గా మాట్లాడుతాడు.

వీడియోలో ఉన్న పోలీసు అధికారుల యూనిఫామ్ తేడాగా అనిపించడం, అక్కడి వ్యక్తుల హావభావాలు ఏదో నటిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

వీడియో కెఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మాకు మాంటీ దీపక్ శర్మ ఫేస్‌బుక్ పేజీ కనిపించింది. ఇందులో అనేక స్టేజ్డ్ వీడియోలు ఉన్నాయి. మాంటీ దీపక్ శర్మ ఒక టెలివిజన్ కళాకారుడిగా చెప్పుకున్నాడు. వైరల్ వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వీడియో అతని పేజీలో కనుగొన్నాం. ఇది స్క్రిప్ట్ చేసిన వీడియోలో భాగమని అందులో స్పష్టంగా వెల్లడించారు.

https://www.facebook.com/reel/1823419741790207

వైరల్ వీడియోలోని నటీనటులు ఉన్న మరో వీడియో కూడా మాకు లభించింది. ఈసారి స్క్రిప్ట్ మార్చారు.

Full View


ఇలాంటి ఎన్నో స్క్రిప్టెడ్ వీడియో అతడి ఫేస్ బుక్ ఖాతాలో మేము గుర్తించాం. వైరల్ వీడియో లోని నటీనటులు పలు వీడియోలలో కనిపిస్తారు.

Full View


Full View



శర్మ వీడియోలలో కంటెంట్ వినోద ప్రయోజనాల కోసం సృష్టించబడిన కల్పిత రచన అని, వాస్తవ సంఘటనలను ప్రతిబింబించడానికి లేదా ఏదైనా సమూహాన్ని కించపరచడానికి ఉద్దేశించలేదని పేర్కొన్నారు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.


Claim :  లవ్ జీహాద్ ఘటనకు సంబంధించిన వీడియో
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News