ఫ్యాక్ట్ చెక్: కేరళలో ఒక భారత సైనికుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేసి.. వీపుపై పెయింట్ చేసిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు

కేరళలోని కడక్కల్‌లో ఒక భారతీయ ఆర్మీ సైనికుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లు పలు వార్తా సంస్థలు

Update: 2023-10-05 03:24 GMT

కేరళలోని కడక్కల్‌లో ఒక భారతీయ ఆర్మీ సైనికుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లు పలు వార్తా సంస్థలు నివేదికలను పంచుకున్నాయి. కొల్లంలో 5-6 మంది తనపై దాడి చేశారని, తన వీపుపై 'పిఎఫ్‌ఐ' అనే అక్షరాలను పెయింట్ చేశారని ఆర్మీ జవాన్ చెప్పుకొచ్చాడు. ("PFI" - పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంక్షిప్త పదం. ఇస్లామిస్ట్ సంస్థ అయిన పిఎఫ్ఐను నిషేధించారు.)

 ANI, టైమ్స్ నౌ, హిందూస్తాన్ టైమ్స్, ఇండియా టుడే వంటి వార్తా సంస్థలు ఈ ఘటనను రిపోర్ట్ చేశారు. షైన్ కుమార్ అనే ఆర్మీ సైనికుడు, కడక్కల్‌లోని తన ఇంటి పక్కన ఉన్న రబ్బరు అడవిలో ఉన్న సమయంలో ఆరుగురు వ్యక్తుల బృందం తనపై దాడి చేశారని పేర్కొన్నాడు. తన చేతులను టేప్‌తో కట్టివేసి, ఆకుపచ్చ పెయింట్‌తో వీపుపై PFI అని రాశారని ఫిర్యాదు చేశాడు.



 

ఫ్యాక్ట్ చెకింగ్:
మాతృభూమి కథనం ప్రకారం.. ఈ సంఘటన కల్పితమని తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. షైన్ కుమార్ తన స్నేహితుడు జోషితో కలిసి పాపులారిటీ కోసం ఈ ఘటన జరిగిందని ప్రచారం చేశాడు. మద్యం మత్తులో కుమార్ తన టీ-షర్టును చింపుకున్నాడు.. తర్వాత తన వీపుపై ఆకుపచ్చ పెయింట్‌తో ‘పిఎఫ్‌ఐ’ అని రాయించుకున్నాడని జోషి అధికారులకు తెలిపాడు. పేరు ప్రఖ్యాతులు పొందేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని అంగీకరించారు.
తనపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారని ఆరోపిస్తూ షైన్ కుమార్ కడక్కల్ తాలూకా ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో షైన్ కుమార్ చెబుతున్నదానికి.. జరిగినదానికి చాలా వ్యత్యాసాలను గుర్తించారు. షైన్ తనను తన ఇంటికి పిలిచి తన వీపుపై 'PFI' అని రాయమని అడిగానని, ఆ తర్వాత షైన్‌ తనని కొట్టమని అడిగానని జోషి విచారణలో అసలు నిజం తెలిపాడు.
“నన్ను కొట్టమని అడిగాడు. కానీ నేను తాగి ఉన్నానని చెప్పాను. అప్పుడు బ్లేడ్ ఇచ్చి తన టీ-షర్టు వెనుక భాగాన్ని చింపివేయమని అడిగాడు. లాక్కుని వెళ్ళమని అడిగాడు. కానీ అది కూడా చేయలేకపోయాను. నోటికి, చేతులకు టేప్ అంటించుకుని.. అడవిలో విడిచిపెట్టమని అడిగాడు. ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగితే, తను ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్పాడు, అయితే అతడి ఉద్దేశం నాకు అర్థం కాలేదు’’ అని జోషి తెలిపాడు.
Full View

ఇదే విషయాన్ని కొల్లం రూరల్‌ అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ ఆర్‌ ప్రతాపన్ నాయర్ కూడా ధ్రువీకరించారు. ఆ ఫిర్యాదు నకిలీదని, జాతీయ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో ఇది ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
"నిందితుడైన సైనికుడిన, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరింత మంచి పదవిని పొందాలనే ఉద్దేశ్యంతో ఈ మోసపూరిత చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరినీ కోర్టు ముందు హాజరు పరిచాము" అని నాయర్ చెప్పారు.
కేరళకు చెందిన భారత ఆర్మీ జవానుపై కొందరు వ్యక్తులు దాడి చేశారనే వార్త బూటకమని తేలింది.


Claim :  Indian Army soldier from Kerala assaulted by a group of people. They painted the letters 'PFI' on his back
Claimed By :  Social media
Fact Check :  False
Tags:    

Similar News