ఫ్యాక్ట్ చెక్: రష్మిక మందన్న తీవ్ర అనారోగ్యంతో ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు

ఇటీవలి కాలంలో అలియా భట్, కాజోల్, రష్మిక మందన్న మొదలైన నటీనటులతో సహా పలువురు ప్రముఖులు డీప్‌ఫేక్ ముప్పుకు గురయ్యారు.

Update: 2025-02-06 07:27 GMT

Rashmika mandanna

ఇటీవలి కాలంలో అలియా భట్, కాజోల్, రష్మిక మందన్న మొదలైన నటీమణులతో సహా పలువురు ప్రముఖులు డీప్‌ఫేక్ ముప్పుకు గురయ్యారు. బ్రిటీష్-ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్ మొదట పోస్ట్ చేసిన వీడియో ఆఈ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక మందన్న ముఖంతో మార్ఫ్ చేశారు. ఈ వీడియో 2023 సంవత్సరంలో వైరల్ అయింది. ఇది దేశంలో పెద్ద దుమారం లేపింది, పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. దీని వెనుక ఉన్న నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత కూడా, డీప్‌ఫేక్ వీడియోలు ఆన్‌లైన్‌లో షేర్ అవుతూనే ఉన్నాయి. సైబర్ సేఫ్టీని ప్రోత్సహించడానికి జాతీయ రాయబారిగా రష్మికా ని హోం మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నియమించింది.

కానీ, గత కొద్ది రోజులుగా, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, మహేష్ బాబు ఉన్న చిత్రాలతో పాటు తలకు కట్టుతో ఆసుపత్రి బెడ్‌లో రష్మిక ఉన్న చిత్రాలు కోల్లజ్ రూపం లో షేర్ అవుతున్నాయి. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన రష్మిక మందన్న, ఆమె పరిస్థితి విషమంగా ఉందనే వాదనతో ఈ చిత్రాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారంలో ఉన్నాయి.

Full View
Full View

Full View

Full View
‘షాకింగ్ హెల్త్ ఎమర్జెన్సీ: ఆకస్మిక అనారోగ్యం తర్వాత రష్మిక మందన్న పరిస్థితి విషమం!’ అనే శీర్షికతో ఉన్న ఆర్టికల్ లింక్, ఈ పోస్ట్ల తో షేర్ అవ్వడం మనం చూడొచ్చు.

క్లెయిం ఆర్కైవ్ లింకు ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. నటి రష్మికకు జనవరి 2025లో కాలికి గాయమైంది. ఆమె పరిస్థితి విషమంగా లేదు.
రష్మిక మందన్న అనారోగ్యం గురించి వార్తల కోసం శోధించినప్పుడు, ఆమె వాకర్ సహాయంతో నడిచే వీడియోను షేర్ చేస్తూ కొన్ని కథనాలు లభించాయి. ఈ కథనాల ప్రకారం, జిమ్ సెషన్‌లో రష్మిక కాలికి గాయమైంది. ఛావా సినిమా ట్రైలర్ లాంచ్‌కు రష్మిక హాజరైనట్లు చూపిస్తూ 'జూమ్ టీవీ' ప్రచురించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో “We all have seen Rashmika Mandanna attending Chhaava trailer launch while limping despite a foot injury. The actress revealed she’s dealing with three fractures and a muscle tear. Wishing her a speedy recovery!” అని ఉంది. రష్మిక మందన్న కాలికి గాయమైనప్పటికీ కుంటుతూనే ఛావా సినిమా ట్రైలర్ లాంచ్‌కు హాజరు అయింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నది ఇంగ్లీష్ వివరణ. ఛావా సినిమా ట్రైలర్ లాంచ్‌కు రష్మిక హాజరైనట్లు చూపిస్తూ జూమ్ టీవీ అప్లోడ్ చేసిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఆమెకు గాయమైనా ఎంతో డెడికేషన్ తో తన సినిమా ప్రమోషన్స్ కు హాజరైనట్లు అందులో తెలిపారు.
Full View
వైరల్ ఇమేజ్‌ని ఉపయోగించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా యాహూలో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం ఆసుపత్రి బెడ్‌పై ఉన్న మహిళ అసలు చిత్రం మాకు లభించింది. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న భ్భ్ఛ్ టీవీ ప్రెజెంటర్ నిక్కీ చాప్‌మన్ కు శస్త్ర చికిత్స చేశారు. ఆమె తన అనుభవాన్ని ఈ కథనంలో పంచుకుంది.
నిక్కీ చాప్‌మన్ బ్రెయిన్ ట్యూమర్ గురించి మాట్లాడుతున్న ఫేస్‌బుక్ వీడియో అక్టోబర్ 2020లో అప్లోడ్ చేశారు. 2019లో 57 ఏళ్ల నిక్కీ చాప్‌మన్‌కు నాన్-క్యాన్సరస్ మెనింగియోమా బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. మాజీ పాప్‌స్టార్ లైవ్‌లో తాను మతిమరుపు, అలసట వంటివి అనుభవిస్తున్నానంటూ, మాట్లాడటం, చదవడం, టైప్ చేయడంలో ఇబ్బంది పడుతున్నట్టు కూడా చెప్పారు. అయితే ఈ వీడియోలో ఆమె హాస్పటల్ లో ఉన్న చిత్రాన్ని షేర్ చేసారు. దానిని వైరల్ అవుతున్న చిత్రం తో పోల్చి చూడగా, దానినే మార్ఫ్ చేసి షేర్ చేసారని తెలుస్తోంది.
Full View
రెండు ఫోటోల మధ్య ఉన్న పోలికలను మీరు ఇక్కడ చూడొచ్చు.

మేము వైరల్ పోస్ట్‌లతో పాటు, కథనాలను చదివినప్పుడు రష్మిక మందన్న కాలుకు గాయమైనట్లు తెలిసింది. అంతేకానీ ఆమె ఆరోగ్య పరిస్థితి దారుణంగా తయారైందంటూ మేము తెలుసుకోలేకపోయాయి. ఇలాంటి కథనాలు వినియోగదారులు క్లిక్ చేసేలా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం ఇది.
నటి రష్మిక మందన్న పరిస్థితి విషమంగా ఉందన్న వాదన అవాస్తవం. క్లిక్‌బైట్ కథనాలతో నటి మార్ఫింగ్ చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.  
Claim :  నటి రష్మిక మందన్న తీవ్ర అనారోగ్యం బారిన పడింది
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News