ఫ్యాక్ట్ చెక్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ లో గెలిచినందుకు ఉచితంగా డబ్బులు ఇవ్వడం లేదు

ఉచితంగా డబ్బులు వస్తున్నాయి, రీఛార్జ్ చేసుకోవచ్చనే వైరల్ లింక్ లపై

Update: 2025-06-09 01:48 GMT

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్మాన కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నైజ హోరాటగారర వేదిక తరఫున ఏఎం.వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో విరాట్ కోహ్లీపై ఫిర్యాదు చేశారు. కోహ్లీపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఇప్పటికే ఈ ఘటనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో కలిపి దీనిని కూడా విచారణకు పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సన్మాన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై కర్ణాటక హైకోర్టు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు కూడా సంధించింది. విజయోత్సవ వేడుకను ఎవరు నిర్వహించాలని నిర్ణయించారు? ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏదైనా అనుమతి కోరారా? బెంగళూరులోని క్రికెట్ స్టేడియం విషాదానికి సంబంధించి కోర్టు తీసుకున్న సుమోటో రిట్ పిటిషన్ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వి.కామేశ్వర్ రావు, జస్టిస్ సి.ఎం. జోషి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పలు ప్రశ్నలను సంధించింది.

ఇక విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద్‌ను సస్పెండ్ చేయడం పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. సస్పెండ్ చేసిన టాప్ పోలీస్ అధికారికి చాలా మంది ఐపీఎస్ అధికారులు మద్దతు ఇస్తున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించవద్దని కేంద్రాన్ని కోరారు.


ఇంతలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచినందుకు గానూ ఉచితంగా డబ్బులు అందిస్తున్నారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. 5000 రూపాయల దాకా గెలుచుకోవచ్చంటూ పోస్టులు పెట్టారు.

Full View


ఇక ఆర్సీబీ విజయం సాధించినందుకు గానూ 799 రూపాయలు రీఛార్జ్ ఉచితంగా లభిస్తోందంటూ కూడా కొన్ని పోస్టులు పెట్టారు.

Full View


వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు





ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి లింక్లను క్లిక్ చేస్తే మీ డేటాను దొంగిలించే అవకాశం ఉంది.

మొదటి వాదన: 5000 రూపాయలు అకౌంట్ లోకి

వైరల్ పోస్ట్‌లో పొందుపరిచిన లింక్ https://flppkrrt-offr.live/Beng/- ను మేము పరిశీలించాము. ఆ లింక్ చాలా అనుమానాస్పదంగా ఉందని కనుగొన్నాము. ఈ సైట్ మీద ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ Dream11 బ్రాండింగ్ అయితే ఉంది కానీ. అనధికారిక డొమైన్ వాడకం, ఫిషింగ్ స్కామ్‌లకు అవకాశం ఉంది.


 



RCB, Dream11, IPL కు చెందిన అధికారిక అకౌంట్లను మేము పరిశీలించాం. అందులో ఎక్కడా కూడా 5,000 రూపాయలు ఇస్తున్నట్లుగా ఎటువంటి ప్రకటనలు కనిపించలేదు. ఈ అకౌంట్స్ కు సంబంధించిన లేటెస్ట్ పోస్ట్ లను చూడొచ్చు. అందులో ఎక్కడా కూడా డబ్బులు ఇస్తున్నట్లుగా ప్రకటనలను మేము చూడలేదు. 



డ్రీమ్ లెవెన్ ట్విట్టర్ పేజీలో చివరి పోస్ట్ జూన్ ౩న ఉంది ఆ తర్వాత ఎలాంటి పోస్ట్ చేయలేదు. అంతేకాకుండా ఆర్సీబీ గెలిచిన తర్వాత ఉచితంగా డబ్బులు ఇస్తున్నట్లుగా ఎలాంటి పోస్టులు కనిపించలేదు.   

ఇలాంటి లింక్ లపై క్లిక్ చేసి మీ కీలకమైన డేటాను పోగొట్టుకోకండి.
 

రెండో వాదన: 799 రూపాయలు రీఛార్జ్ ఉచితంగా లభిస్తోంది

వైరల్ క్లెయిమ్‌ గురించి తెలుసుకోవడం కోసం మేము టాటా కంపెనీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో శోధించడం ప్రారంభించాము. మేము Instagram, X (ట్విట్టర్) ఖాతా, Facebook పేజీలను పరిశీలించగా, వైరల్ క్లెయిమ్‌కు సంబంధించిన అటువంటి పోస్ట్ ఏదీ మాకు కనిపించలేదు.



ఈ రీఛార్జ్ లింక్ కూడా మాకు అనుమానాస్పదంగా కనిపించింది. అలాంటి లింక్ ల మీద క్లిక్ చేయడం మీ డేటాను కోల్పోయే ప్రమాదమే కాకుండా, మీ ఎలక్ట్రానిక్ డివైజ్ లలోకి వైరస్, మాల్వేర్ చొరబడే అవకాశం ఉంది.

కాబట్టి, ఉచితంగా డబ్బులు వస్తున్నాయి, రీఛార్జ్ చేసుకోవచ్చనే వైరల్ లింక్ లపై క్లిక్ చేయకుండా ఉండడమే చాలా మంచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ఫైనల్ లో గెలిచినందుకు అకౌంట్లలోకి 5000 రూపాయలు డబ్బులు, 799 రూపాయల రీఛార్జ్ చేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

వైరల్ పోస్టులను నమ్మకండి, మీ విలువైన డేటాను స్కామర్స్ చేతుల్లోకి నెట్టకండి.


Claim :  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ లో గెలిచినందుకు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News