ఫ్యాక్ట్ చెక్: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ అక్కడే ఉన్నారు

మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ

Update: 2023-09-30 04:15 GMT

మహిళా రిజర్వేషన్ బిల్లు.. 'నారీ శక్తి వందన్ అధినియం' ఆమోదం పొందే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ చర్చకు గైర్హాజరయ్యారని చెబుతూ ఓ ఇన్ఫోగ్రాఫిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం జరిగిన చర్చలో ప్రధాని మోదీ పాల్గొనలేదన్న వాదన ఆ పోస్టును వైరల్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫోగ్రాఫిక్‌లో, నితిన్ గడ్కరీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్.. ఇతర బీజేపీ ఎంపీలు పార్లమెంట్ హౌస్‌లో కూర్చున్నట్లు చూడవచ్చు. ఈ చిత్రంలో ప్రధాని మోదీ కనిపించ లేదు.

ఇన్ఫోగ్రాఫిక్‌తో పాటూ షేర్ చేస్తున్న టెక్స్ట్ లో “మహిళలకు ఎంతో చేస్తున్నానని చెప్పే ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు గైర్హాజరు కావడం దురదృష్టకరం.” అని ఉంది.


 ఫ్యాక్ట్ చెకింగ్:

ఈ ప్రచారం తప్పు అని చెప్పే అనేక సాక్ష్యాలు ఉన్నాయి. పలు మీడియా కథనాలు.. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చర్చ జరిగే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్కడే ఉన్నారని చూపిస్తున్నాయి.
అనేక వార్తా నివేదికలు వైరల్ పోస్టులలో నిజం లేదని నిరూపిస్తున్నాయి. బిల్లు ఆమోదం పొందే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ అక్కడే ఉండి అందుకు పూర్తి మద్దతుగా నిలిచారు. సెప్టెంబరు 19న కొత్త పార్లమెంట్ హౌస్‌లో తొలిరోజు సెషన్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని మోదీ కీలక ప్రసంగం కూడా చేశారు. ఓటింగ్ ప్రారంభమయ్యే ముందు సభలో ప్రసంగిస్తూ మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై తమ అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఎగువ సభలో మోదీ మాట్లాడుతూ, “ఈ రోజు మనం మహిళా సాధికారత దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నాం.. ఈ రోజు (సెప్టెంబర్ 19, 2023) చిరస్మరణీయమైన రోజు, చారిత్రాత్మకమైన రోజు.. మహిళల నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి సాధిస్తోంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిథ్యాన్ని విస్తృతం చేయడమే ఈ బిల్లు లక్ష్యం. 'నారీ శక్తి వందన్ అధినియం' ద్వారా మన ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది." అని అన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఈ లింక్ లో చూడొచ్చు.

Full View
మహిళా సాధికారత బిల్లుపై ఓటింగ్ జరిగే సమయంలో కూడా ప్రధాని మోదీ అక్కడే ఉన్నారు.



 బిల్లు పాస్ అయ్యాక ప్రధాని మోదీ.. పలు మహిళా ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు.

Full View

ట్విట్టర్ లో బిల్లు పాస్ అవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. అందుకు సహకరించిన పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.


పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రధాని మోదీ అక్కడే ఉన్నారు. వైరల్ అవుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.


Claim :  PM Modi did not participate in the discussion for passing the Women's Reservation Bill
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News