ఫ్యాక్ట్ చెకింగ్: దొంగతనం చేస్తూ పట్టుబడ్డ మహిళ భారతీయురాలు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

దొంగతనం చేస్తూ పట్టుబడ్డ మహిళ భారతీయురాలు అంటూ జరుగుతున్న

Update: 2025-07-20 02:59 GMT

అమెరికాలోని టార్గెట్ స్టోర్‌కు షాపింగ్ కు వెళ్లిన అవలాని అనే భారతీయ పర్యాటకురాలు 1,000 డాలర్లకు పైగా విలువైన వస్తువులను దొంగిలిస్తూ పట్టుబడటంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె అరెస్టుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్ లో చర్చకు దారితీసింది. పోలీసుల బాడీక్యామ్‌లో అరెస్టుకు సంబంధించిన ఘటనలు రికార్డు అయ్యాయి.


వైరల్ క్లిప్‌లో అవలానీ పోలీసు అధికారులను వేడుకుంటున్నట్లు చూడొచ్చు. ఆమె వస్తువులకు డబ్బు చెల్లిస్తానని వేడుకుంది. అయితే అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. మీరు తప్పు చేసేశారు, డబ్బులు ముందే చెల్లించి ఉంటే చాలా బాగుండేదని పోలీసులు చెప్పడం వినొచ్చు. మీరు ఆ సమయంలోనే దుకాణంలో డబ్బులు చెల్లించి ఉండాలి, కానీ మీరు చెల్లించకుండా తీసుకుని వెళ్లాలని అనుకున్నారని చెప్పడంతో ఆమె సైలెంట్ అయిపోయింది. నిందితురాలు మొదట అధికారికి తప్పుడు పేరు చెప్పింది. ఆ అధికారి ఆమెను పాస్‌పోర్ట్ లేదా గుర్తింపు కార్డును ఇవ్వాలని కోరినప్పుడు, ఆ సమయంలో తన వద్ద ఐడి లేదని ఆమె వాదించింది. అనయ అనే తప్పుడు పేరును ఇచ్చింది. చివరికి ఆమెను జమీషాగా గుర్తించారు.

ఈ ఘటనపై ఓ వైపు చర్చ జరుగుతూ ఉండగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) విదేశాలలో ఉన్న భారతీయ పౌరులను అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, "ఒక వ్యక్తి ఏ దేశంలోనైనా నివసిస్తున్నప్పుడు. వారు ఆ దేశ పౌరుడైనా లేదా విదేశీయుడైనా అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండటం వారి బాధ్యత" అని అన్నారు. "మన ప్రజలు విదేశాలకు వెళ్ళినప్పుడల్లా, ఆ దేశ చట్టాలను గౌరవించాలని, అనుసరించాలని మేము వారిని ఎల్లప్పుడూ కోరుతున్నాము, వారు మంచి, సానుకూల ఇమేజ్‌ను నిర్మించుకోగలరు. మన దేశం గురించి మంచి ఇమేజ్‌ను కూడా ప్రదర్శించగలరు" అని జైస్వాల్ తెలిపారు.

ఇంతలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఓ మహిళ బట్టల్లో నుండి పలు వస్తువులను బయటకు తీయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Full View


ఈ వీడియోలో ఉన్నది భారత మహిళ అనే వాదనతో పోస్టులు షేర్ చేస్తున్నారు.



 




ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.

ఇల్లినాయిస్‌లోని టార్గెట్ స్టోర్‌లో ఏడు గంటలకు పైగా గడిపి $1,300 (సుమారు రూ. 1.1 లక్షలు) విలువైన వస్తువులను తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్న అవాలనికి సంబంధించిన విజువల్స్ ను కూడా మేము చూశాం. వైరల్ అవుతున్న వీడియో లోనూ, ఈ వీడియోలోనూ ఉన్న మహిళ ఒకరే కాదని మేము ధృవీకరించాం.

Full View


మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా ఓ మహిళ గర్భవతి లాగా నటిస్తూ దొంగతనానికి పాల్పడిందంటూ వీడియోను మే నెలలోనే పలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు గుర్తించాం.

వైరల్ వీడియోను మే 5న "Finge embarazo y da a luz... ¡ropa robada de Coppel!; la llaman "Lady Embarazada" అనే టైటిల్ తో పోస్టు చేసినట్లు మేము గుర్తించాం.

Full View


‘EIUniversalMex’ అనే యూట్యూబ్ ఛానెల్ లో మే 5న ఈ వీడియోను షేర్ చేశారు. ఒక మహిళ దుకాణంలో బట్టలు దొంగిలించడానికి గర్భవతిగా నటించింది, కానీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిందంటూ అందులో తెలిపారు.

పలు మీడియా సంస్థలు కూడా ఈ ఘటనను నివేదించాయి.

Full View


ఇల్లినాయిస్‌లోని టార్గెట్ స్టోర్‌లో దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మహిళకు సంబంధించిన విజువల్స్ కంటే ముందు నుండే ఈ వీడియో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.

వైరల్ వీడియోలోని మహిళ భారతీయురాలు కాదని మెక్సికన్ మహిళ అంటూ న్యూస్ 18 కూడా తమ కథనంలో తెలిపింది. ఆ కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.


పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది భారత మహిళ కాదంటూ కథనాలను ప్రచురించాయి.

వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది భారతీయురాలు కాదు. మెక్సికన్ మహిళ.


Claim :  దొంగతనం చేస్తూ పట్టుబడ్డ మహిళ భారతీయురాలు అంటూ జరుగుతున్న
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News