ఫ్యాక్ట్ చెక్: నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 5000 కేజీల బంగారాన్ని భారత సైన్యానికి బహుమానంగా ఇచ్చారనే వాదనలో ఎలాంటి నిజం లేదు

నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 5000 కేజీల బంగారాన్ని. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 5000 కేజీల బంగారాన్ని భారత సైన్యానికి బహుమానంగా ఇచ్చారనే వాదనలో

Update: 2026-01-16 05:35 GMT

హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అత్యంత సంపన్నుడు. ఆయన వద్ద టన్నుల కొద్దీ బంగారం, కిలోల్లో అమూల్యమైన వజ్రాలు ఉన్నాయని చెబుతారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ 7వ నిజాం. భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు కాలం నాటి కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే నిజాంలు చాలా ధనవంతులు, వారి సంపద చాలా అపారమైనది. వారి సంపదలో బంగారం, వజ్రాల నిల్వలు ఉన్నాయి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చరిత్రలో అత్యంత ధనవంతులలో ఒకరిగా పేరు పొందారు. భారతదేశపు మొదటి బిలియనీర్ అని కూడా పిలుస్తారు. అప్పట్లో ఆయన సంపద US GDPలో 2% ఉంటుందని అంచనా వేశారు. 1937లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కనిపించాడు.


1965 ఇండో-పాక్ యుద్ధంలో, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దేశ సైనిక ప్రయత్నాలకు మద్దతుగా భారత ప్రభుత్వానికి 5000 కిలోగ్రాముల బంగారాన్ని విరాళంగా ఇచ్చారని కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

అందుకు సంబంధించిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు


వైరల్ క్లెయిమ్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:


నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 5000 కేజీల బంగారాన్ని ఇచ్చారనే వాదన నిజం కాదు. 

1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1965లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య రెండవ యుద్ధం జరిగింది. యుద్ధం ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. భారతదేశం కూడా ఈ సవాలును ఎదుర్కొంది. ఆ సమయంలో, అప్పటి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి దేశంలో పర్యటించి, సైనికులకు విరాళాలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కాలంలో ఆయన హైదరాబాద్ నిజాంను కూడా కలిశారు. ఈ సమావేశం తర్వాత, నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సంక్షోభ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేయడానికి 5000 కిలోగ్రాముల బంగారాన్ని విరాళంగా ఇచ్చారని పుకార్లు వ్యాపించాయి.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ నిర్వహించాం. ఎక్కడా కూడా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 5000 కేజీల బంగారాన్ని ఇచ్చారనే వాదనకు బలం చేకూర్చే చారిత్రాత్మక సాక్ష్యాలు లభించలేదు. అంతేకాకుండా నిజాం కుటుంబ సభ్యులు కూడా 5000 కేజీల బంగారం ఇచ్చినట్లుగా చెప్పినట్లు ఎలాంటి కథనాలు మాకు లభించలేదు.  

'The truth about the Nizam and his gold' అంటూ 'ది హిందూ' 2018లో ప్రచురించిన కథనం మాకు లభించింది. అందులో నిజాం చేసింది కేవలం ఒక పెట్టుబడి మాత్రమే అని తేల్చారు.

2019లో సమాచార హక్కు (RTI) అభ్యర్థన ప్రకారం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడూ 5000 కిలోగ్రాముల బంగారాన్ని విరాళంగా ఇవ్వలేదని తేలింది. అయితే యుద్ధ సమయంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ రక్షణ బంగారు పథకంలో 425 కిలోగ్రాముల బంగారాన్ని పెట్టుబడి పెట్టాడు. తన సహకారానికి ప్రతిఫలంగా అతను 6.5% వడ్డీ రేటును సంపాదించాడు. ఇది పూర్తిగా విరాళంగా కాకుండా ఆర్థిక పెట్టుబడిగా మారింది. 2020లో, నిజాం మనవడు నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. సుదీర్ఘకాలంగా ఉన్న పుకార్లకు ముగింపు పలికాడు.

అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా నిజ నిర్ధారణ చేశాయి. అందుకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత ప్రభుత్వానికి 5000 కిలోగ్రాముల బంగారాన్ని విరాళంగా ఇచ్చారని ఒక పుకారు చాలా కాలం పాటు చర్చనీయాంశమైంది. అయితే, భారతదేశం స్వాతంత్ర్యం పొందిన చాలా సంవత్సరాల తర్వాత నిజం బయటపడింది. ఆయన కేవలం పెట్టుబడిగా కొంత బంగారాన్ని ఇచ్చారు. అందులోనూ వడ్డీని తిరిగి పొందారు. 

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 5000 కేజీల బంగారాన్ని నిజాం భారత సైన్యానికి విరాళంగా ఇవ్వలేదు.


Claim :  నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 5000 కేజీల బంగారాన్ని
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News