ఫ్యాక్ట్ చెక్: అక్రమంగా చేపలు పడుతున్నారని చైనా పడవలను ఇండోనేషియా ప్రభుత్వం పేల్చి వేయలేదు.
అక్రమంగా చేపలు పట్టారని ఆరోపిస్తూ ఇండోనేషియా చైనా
డిసెంబర్ 14న ఇండోనేషియా ఆర్మీ శిక్షణా వ్యాయామం సమీపంలో ఓ అనధికారిక డ్రోన్ కనిపించింది. దీంతో పశ్చిమ కాలిమంటన్‌లోని కేతాపాంగ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దర్యాప్తు కోసం పంపిన సైనికులు నిషేధిత జోన్‌లో అనేక మంది చైనా జాతీయులు డ్రోన్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. సైనికులు వివరణ కోరగా మరింత మంది కార్మికులు అక్కడకు వచ్చారు. ఘర్షణ తీవ్రమైంది.
ఇండోనేషియా సైన్యం ప్రకారం, దాడి చేసిన వ్యక్తులు కత్తులు, ఎయిర్‌సాఫ్ట్ గన్, విద్యుత్ షాక్ పరికరాన్ని ఉపయోగించారు. ఆ ప్రాంతానికి వెళ్లిన సైనికుల సంఖ్య తక్కువగా ఉండటం, ముప్పు పొంచి ఉండడంతో వారు వెనక్కి వెళ్లి, అధికారిక కమాండ్ మార్గాల ద్వారా సంఘటనను నివేదించారు. ఇండోనేషియాలోని తంజుంగ్‌పురా మిలిటరీ కమాండ్ దర్యాప్తు ప్రారంభించింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ ప్రదేశానికి సంబంధించిన 29 మంది చైనా జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి తనిఖీలలో ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలు కూడా బయట పడ్డాయి.
ఇంతలో ఇండోనేషియా చైనాకు చెందిన ఫిషింగ్ బోట్లను ధ్వంసం చేసిందంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 2016 నుండి వైరల్ వీడియో ఆన్ లైన్ లో ఉంది.
సంబంధిత కీవర్డ్స్ సెర్చ్ ద్వారా ఇటీవలి కాలంలో ఇండోనేషియా జలాల్లో అక్రమంగా చేపలు పట్టినందుకు చైనా పడవలను ధ్వంసం చేసినట్లుగా ఏమైనా కథనాలు లభిస్తాయేమోనని మేము వెతికి చూశాం. అయితే అలాంటిది ఏమీ జరగలేదు. ఇలాంటి ఘటన చోటు చేసుకుని ఉండి ఉంటే అది తప్పకుండా మీడియా నివేదించి ఉండేది.
ఇక వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఆ శోధన మమ్మల్ని AP ఆర్కైవ్ అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోకు తీసుకెళ్లింది. ఇండోనేషియా 31 అక్రమ ఫిషింగ్ బోట్లను కూల్చివేసిందని వీడియోని 22 ఫిబ్రవరి 2016 న అప్లోడ్ చేసింది.
ఫిబ్రవరి 22, 2016న TRTWorld అనే YouTube ఛానల్ లో అప్‌లోడ్ చేసిన ఇదే వీడియో కూడా మాకు కనిపించింది. 31 అక్రమ ఫిషింగ్ బోట్లు మునిగిపోయాయనే శీర్షికతో 2016 లో వీడియోను అప్లోడ్ చేశారు. ఇండోనేషియా సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖ ఐదు వేర్వేరు ప్రదేశాలలో 31 అక్రమ ఫిషింగ్ బోట్లను కూల్చివేసింది. 31 illegal fishing boats sank across Indonesia అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. వైరల్ వీడియో లోనూ, ఈ వీడియోలో ఉన్న వీడియో రెండూ ఒకే విధంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.
పలు మీడియా సంస్థలు కూడా ఈ కథనాన్ని 9 సంవత్సరాల కిందట ప్రముఖంగా ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఈ కథనాలలో ఇండోనేషియా సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ 31 అక్రమ ఫిషింగ్ బోట్లను ధ్వంసం చేసిందని తెలిపాయి. ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, మయన్మార్ నుండి వచ్చిన ఓడలను దేశవ్యాప్తంగా ఐదు వేర్వేరు ప్రదేశాలలో పేల్చివేశారు. అక్రమ చేపల వేటకు వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.
ఇండోనేషియా చైనా పడవలపై దాడికి సంబంధించిన మీడియా కథనాలు మాకు లభించాయి. వివాదాస్పద జలాల్లోకి ప్రవేశించినందుకు ఇండోనేషియా చైనా ఫిషింగ్ పడవపై దాడి చేసింది. ఇరుపక్షాలు తమ చర్యలను సమర్థించుకున్నాయి.
అందుకు సంబంధించిన BBC కథనం ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ వీడియోలోని సంఘటన ఫిబ్రవరి 2016లో జరిగింది. అక్రమ చేపల వేటను ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో స్వాధీనం చేసుకున్న పడవలను ధ్వంసం చేసింది. 2016 ఆపరేషన్‌లో ధ్వంసమైన 31 పడవలన్నీ చైనాకు చెందినవి కావు.
కాబట్టి, ఇటీవలి కాలంలో చైనా దేశానికి చెందిన ఫిషింగ్ బోట్లను ఇండోనేషియా ధ్వంసం చేసిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : అక్రమంగా చేపలు పట్టారని ఆరోపిస్తూ ఇండోనేషియా చైనా పడవలను
Claimed By : Social Media Users
Fact Check : Unknown