ఫ్యాక్ట్ చెక్: హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నీటిని క్షణాల్లో వాహన ఇంధనంగా మార్చే పెట్రోల్ క్యాప్సూల్స్‌ను విడుదల చేయలేదు

నీటిని క్షణాల్లో వాహన ఇంధనంగా మార్చే పెట్రోల్ క్యాప్సూల్స్‌ను హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసింది

Update: 2025-12-26 06:07 GMT

భారతదేశంలో పెట్రోల్ పంపుల నెట్‌వర్క్ 100,000 మార్కును దాటింది. గత దశాబ్దంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరుకున్నాయి. ఇంధన లభ్యతను విస్తరించడానికి దూకుడుగా అవుట్‌లెట్‌లను ప్రారంభించడంతో పెట్రోల్ పంపుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఇంధన రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. నవంబర్ చివరి నాటికి భారతదేశంలో 1,00,266 పెట్రోల్ పంపులు ఉన్నాయని చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ & అనాలిసిస్ సెల్ డేటా చెబుతోంది.


90 శాతానికి పైగా పంపులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల యాజమాన్యంలో ఉన్నాయి. రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్ మద్దతుగల నయారా ఎనర్జీ లిమిటెడ్ 6,921 అవుట్‌లెట్‌లతో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్, తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, BP జాయింట్ వెంచర్ యాజమాన్యంలో 2,114 స్టేషన్లు ఉన్నాయి. ఇక షెల్ 346 అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. పెట్రోల్ పంప్ నెట్‌వర్క్ 2015లో 50,451 స్టేషన్లు ఉండగా, గత దాశబ్దంలో దాదాపు రెట్టింపు అయిందని డేటా చూపించింది. ఆ సంవత్సరం, ప్రైవేట్ కంపెనీల యాజమాన్యంలోని 2,967 అవుట్‌లెట్‌లు దాదాపు 5.9 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం, అవి మొత్తం మార్కెట్‌లో 9.3 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇంధన రిటైల్ అవుట్‌లెట్ వ్యాపారంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం 2004 ఆర్థిక సంవత్సరంలో 27 పంపులతో ప్రారంభమైంది.

అయితే ఇప్పుడు సరికొత్తగా పెట్రోల్ క్యాప్సుల్స్ ను తీసుకుని వచ్చారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పెట్రోల్ క్యాప్సూల్ ను తీసుకుని వచ్చిందని, అది కాస్తా నీటిని పెట్రోల్ గా మారుస్తుందని పలువురు నెటిజన్లు చెబుతున్నారు.

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఇంధన అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి రూపొందించిన పెట్రోల్ క్యాప్సూల్స్‌ను తీసుకుని వచ్చినట్లుగా వీడియోను వైరల్ చేస్తున్నారు. క్యాప్సూల్‌ను నీటిలో వేయడం వల్ల అది వాహనాలకు ఉపయోగపడే ఇంధనంగా మారుతుందని చెబుతున్నారు. ఈ క్యాప్సూల్స్ చాలా చవకైనవి చెబుతున్నారు. ఆ క్లైమ్స్ ను
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు. 

వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు

వైరల్ స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉన్నాయి



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు

మేము సంబంధిత కీ వర్డ్స్ ను ఉపయోగించి గూగుల్‌లో సెర్చ్ చేశాం. కానీ విశ్వసనీయమైన మీడియా నివేదికలు లేదా అటువంటి వాదనకు మద్దతు ఇచ్చే అధికారిక సమాచారం ఏదీ మాకు లభించలేదు. అలాంటి ఆవిష్కరణ జరిగి ఉంటే, దానికి విస్తృత మీడియా కవరేజ్ లభించి ఉండేది. అయితే, అలాంటి ఆధారాలు ఏవీ మాకు లభించలేదు.

ఇక హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అధికారిక వెబ్‌సైట్‌ను, ఆ సంస్థకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను కూడా సమీక్షించాము. అందుకు సంబంధించిన ఎటువంటి సమాచారం కనుగొనబడలేదు.

https://www.hindustanpetroleum.com/newsroom



 


అయితే హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మాత్రం వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని చెబుతూ పోస్టులను పెట్టింది.

"పెట్రోల్ క్యాప్సూల్" అనే వాదనను తోసిపుచ్చింది. అటువంటి ఉత్పత్తి ఏదీ ప్రారంభించలేదని, ఆ కంటెంట్ మోసపూరితమైనది అనధికారికమైనది అని వివరణ ఇచ్చింది. ముఖ్యంగా అటువంటి పోస్ట్‌లను నమ్మవద్దని లేదా షేర్ చేయవద్దని ప్రజలను కోరింది.

"Some social media posts are falsely claiming the existence of a so-called “PETROL CAPSULE” under the HPCL name. This information is completely false and misleading.
HPCL has no such product.
Such content is fraudulent and unauthorised.
We urge everyone to not believe, not share, and please report such misleading posts immediately.
#FakeContent #PetrolCapsule #HPCL" అంటూ పోస్టులో వివరణ ఇచ్చింది.



ఇదే విషయాన్ని హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తన ఇన్స్టాగ్రామ్ , ఫేస్ బుక్ ఖాతాలలో కూడా ప్రస్తావించింది.


హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నీటిని క్షణాల్లో వాహన ఇంధనంగా మార్చే పెట్రోల్ క్యాప్సూల్స్‌ను విడుదల చేసిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  నీటిని క్షణాల్లో వాహన ఇంధనంగా మార్చే పెట్రోల్ క్యాప్సూల్స్‌ను హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News