ఫ్యాక్ట్ చెక్: మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఎవరూ మరణించలేదు
మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ రీ రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో
భారత క్రికెట్ లెజెండ్స్ లో మహేంద్ర సింగ్ ధోనీ ఒకరు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ దూరమైనా ఐపీఎల్ మాత్రం ఆడుతూ ఉన్నారు. ఇక ఎన్నో ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే ఇతర ఈవెంట్స్ లో కనిపించడం ధోనీ ప్రత్యేకత.
మహేంద్ర సింగ్ ధోని తన నాయకత్వ శైలితో కూడా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన్ను పిలవడానికి ప్రేమగా ఉపయోగిస్తున్న 'కెప్టెన్ కూల్' అనే పేరు కోసం ట్రేడ్‌మార్క్ దరఖాస్తును దాఖలు చేశారు. ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ ప్రకారం, దరఖాస్తుకు ఆమోదం కూడా లభించింది. ఈ ట్రేడ్‌మార్క్ జూన్ 16, 2025న అధికారిక ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో ప్రచురించారు.
ధోని న్యాయవాది మాన్సి అగర్వాల్ మాట్లాడుతూ ట్రేడ్ మార్క్ కోసం చేసిన ఈ ప్రయాణంలో పలు అడ్డంకులు ఎదురయ్యాయని అన్నారు. ధోని బృందం మొదట ట్రేడ్‌మార్క్ కోసం దాఖలు చేసినప్పుడు, రిజిస్ట్రీ ట్రేడ్‌మార్క్‌ల చట్టంలోని సెక్షన్ 11(1) కింద అభ్యంతరం వ్యక్తం చేసింది. రికార్డులో ఇప్పటికే కొన్ని ఉండడం వలన ఈ పదబంధం ప్రజలను గందరగోళానికి గురి చేస్తుందనే ఆందోళన ఉంది. కానీ ధోని న్యాయ బృందం 'కెప్టెన్ కూల్' తో స్పష్టమైన, ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉందని వాదించింది. చివరికి కెప్టెన్ కూల్ ట్రేడ్ మార్క్ ధోనికి లభించింది.
ఇంతలో మహేంద్ర సింగ్ ధోనీని అరెస్టు చేయాలంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అందుకు కారణం ధోనీ పుట్టినరోజున జులై 7న ఆయన బయోపిక్ సినిమా విడుదలైందని, తొక్కిసలాట ఘటనలో పలువురు మరణించారని ఆ పోస్టుల్లో తెలిపారు. మరికొన్ని పోస్టుల్లో ఈ తొక్కిసలాట ఘటనలో ధోని కుమార్తె, భార్య మరణించారంటూ ఆరోపించారు.
ధోని బయోపిక్ 'MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' రీ రిలీజ్ ప్రదర్శన సమయంలో 2 మంది చనిపోయారు, 5 మంది గాయపడ్డారు, విషాదం చోటు చేసుకుంది అంటూ NDTV న్యూస్ కు సంబంధించిన గ్రాఫిక్ ప్లేట్ ను కూడా ప్రజలు పంచుకున్నారు. దీన్ని షేర్ చేసిన వారు Facebook , Xలో "Arrest Dhoni" వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగించారు.

వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జూలై 7న 44 ఏళ్లు నిండాయి. మాజీ కెప్టెన్ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా “MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ” రీ రిలీజ్ చేసిన సమయంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కథనాలను తెలుసుకోవడం కోసం మేము పలు వార్తా కథనాల కోసం వెతికాం.
అయితే మాకు ఎక్కడా కూడా ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాను భారీ ఎత్తున రీ రిలీజ్ చేయడం కానీ, థియేటర్ల వద్ద తొక్కిసలాట జరిగిన ఘటనకు సంబంధించిన వార్త కానీ లభించలేదు.
ధోని బయోపిక్ ఇటీవల కాదని 2024 లో రీ రిలీజ్ అయిందని మేము గుర్తించాం. ఇక ఆ సమయంలో స్క్రీనింగ్‌లో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఎంఎస్ ధోని బయోపిక్ ప్రదర్శన సమయంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లయితే, దానిని పలు వార్తా సంస్థలు కవర్ చేసి ఉండేవి. అయితే, అటువంటి సంఘటన ఏదీ నివేదించబడలేదు.
ఇక NDTVకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను కూడా మేము జల్లెడ పట్టాము. ఎక్కడా కూడా ఈ బ్రేకింగ్ ప్లేట్ ను వాడినట్లుగా గుర్తించలేకపోయాం.
మేము మరింత వెతకగా వైరల్ అవుతున్న పోస్టులను ఖండిస్తూ ఇండియా టుడే చేసిన ఫ్యాక్ట్ చెక్ మాకు లభించింది. "Fact Check: Neither was Dhoni's biopic re-released, nor did a mishap occur!" అంటూ ఇండియా టుడే జులై 9న కథనాన్ని ప్రచురించింది.
ఆ కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాను భారీ ఎత్తున రీ రిలీజ్ చేయడం కానీ, థియేటర్ల వద్ద తొక్కిసలాట జరిగిన ఘటనకు సంబంధించిన నివేదికలు కానీ లభించలేదు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : మహేంద్ర సింగ్ ధోని తన నాయకత్వ శైలితో కూడా అభిమానులను సొంతం
Claimed By : Social Media Users
Fact Check : Unknown