ఫ్యాక్ట్ చెక్: అహ్మదాబాద్ విమాన ప్రయాణం తర్వాత 11A సీట్ లో కూర్చోవడం కోసం ప్రయాణీకులు గొడవ పడుతున్నారనే వాదన నిజం కాదు

ఒరిజినల్ పోస్టులో అందుకు సంబంధించిన వివరాలను

Update: 2025-06-25 03:14 GMT

విమానంలో అసలు ఎవరూ కూర్చోకూడదని అనుకునే సీట్ నెంబర్ 11A. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉంటుంది. అంతేకాకుండా పక్కన మేఘాలను చూడడానికి విండో కూడా ఉండదు. అయితే ఇటీవల అహ్మదాబాద్ లో విమానం కూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి 11A సీట్ నెంబర్ లో కూర్చున్నారు. ఇప్పుడు దీన్ని సురక్షితమైన సీటు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

జూన్ 12, 2025న అహ్మదాబాద్‌లో 241 మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత సీటు 11A గురించి చర్చ జరిగింది. ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, 40 ఏళ్ల విశ్వష్‌కుమార్ రమేష్ ఆ సీట్ లో కూర్చున్నాడు. అప్పటి నుండి, ఆ సీటు కోసం అభ్యర్థనలు పెరిగాయని భారతీయ ట్రావెల్ ఏజెంట్లు నివేదించారు. కొంతమంది ప్రయాణీకులు ఆ సీటులో కూర్చోవడం కోసం అదనంగా డబ్బులు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక వైద్య సముదాయంలోకి కూలిపోగా UKకి చెందిన ప్రయాణీకుడు రమేష్ స్వల్ప గాయాలతో వెళ్ళిపోయాడు. అతని పక్కన కూర్చున్న అతని సోదరుడు మరణించాడు.

తన 11A సీటు అత్యవసర నిష్క్రమణ దగ్గర ఉందని, ఆ తర్వాత తాను బయటకు వచ్చానని రమేష్ విశ్వష్‌కుమార్ అన్నారు. ఎగ్జిట్ డోర్ పక్కన కూర్చోవడం వల్ల ప్రమాదం నుండి బయటపడవచ్చు కానీ ప్రతి ప్రమాదంలోనూ ఈ సీట్ నెంబర్ కాపాడుతుందని చెప్పలేమని పలువురు నిపుణులు చెబుతున్నారు. విమానంలో 11A సీటు ఎక్కడ ఉంటుందో తెలియకుండానే బుకింగ్ చేసుకోడానికి ఎగబడుతూ ఉన్నారు ప్రయాణీకులు.

ఇక సీట్ నెంబర్ 11Aలో కూర్చునే విషయమై గొడవ జరిగిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఓ మహిళ తోటి ప్రయాణీకులతో గొడవ పడుతూ ఉండడమే కాకుండా, పక్కనే ఉన్న యువకుడిపై ఆమె చేయి చేసుకోవడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.


Full View


వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇదొక స్క్రిప్టెడ్ వీడియో.

ఇటీవలి కాలంలో విమానాలకు సంబంధించిన సంఘటనలను, ఆలస్యమవుతున్న ప్రయాణాలు, ఇలా చాలా విషయాలకు సంబంధించి కథనాలను వెంటనే మీడియా సంస్థలు నివేదిస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా ఆయా ఘటనల గురించి తెలుసుకోవడం కోసం ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు.

వైరల్ అవుతున్న వాదనను ధృవీకరించడానికి, అటువంటి సంఘటన ఏదైనా చోటు చేసుకుందా అని తెలుసుకోవడం కోసం మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. అయితే, సంబంధిత వార్తా నివేదికలు ఏవీ మాకు లభించలేదు.

వైరల్ వీడియో నుండి స్క్రీన్ షాట్ ను తీసుకుని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో మాకు లభించింది.



ఈ వీడియోను మొదట జూన్ 16, 2025న నాగ్‌పూర్‌లోని ఫ్లై-హై ఇన్‌స్టిట్యూట్, సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్త రుతు రాంటెకే అప్‌లోడ్ చేసింది. రుతు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో స్క్రిప్ట్ చేసిన కామెడీ వీడియోలను పోస్ట్ చేయడంతో ఫేమస్ అయ్యారు.

దీన్ని క్యూగా తీసుకుని rutu_ramteke_18 అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రొఫైల్ ను మేము పరిశీలించాం. అప్పుడు విమానంలో పలు రీల్స్ ను చేసినట్లుగా గుర్తించాం.





వైరల్ వీడియోలోని వ్యక్తులే ఈ వీడియోలో కూడా కనిపిస్తారు.

తదుపరి దర్యాప్తులో ఫ్లై-హై ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్, ఇన్‌స్టాగ్రామ్ లో పలు వివరాలను గమనించాం. ఈ సంస్థ ఏవియేషన్, హాస్పిటాలిటీ, ట్రావెల్ & టూరిజంలో కోర్సులను అందిస్తుందని తేలింది. వారి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విద్యార్థులకు ఎలాంటి సందర్భాల్లో ఎలా నిర్ణయాలు తీసుకోవాలనే విషయమై శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన స్క్రిప్ట్ చేసిన కంటెంట్ చాలానే ఉంది.

ఒరిజినల్ పోస్టులో అందుకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేసారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.


 



flyhighinstitutenagpur ఖాతాకు ఒక మిలియన్ కంటే ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖులు కూడా రీల్స్ లో నటించారు. కొన్ని గంటల ముందు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఉన్న వీడియోను కూడా పోస్టు చేశారు.


వైరల్ వీడియోలోని నటీనటులే ఈ వీడియోలో కూడా ఉన్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. నటీనటులతో చిత్రీకరించిన వీడియోను విమానంలో 11A సీటు కోసం జరిగిన గొడవగా ప్రచారం చేస్తున్నారని మేము ధృవీకరించాం.


Claim :  వైరల్ అవుతున్న వీడియోను నటీనటులతో చిత్రీకరించారు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News