ఫ్యాక్ట్ చెక్: అమ్మమ్మను పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
భర్త తన భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన ఘటనను
మేఘాలయ హనీమూన్ మర్డర్ ఘటన దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది. మేఘాలయలో తన భర్త రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ తన ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడింది. ఇక అజ్ఞాతంలో ఉన్నప్పుడు తన ప్రియుడు రాజ్ కుష్వాహాను వివాహం చేసుకుని ఉండవచ్చని మృతురాలి అన్నయ్య ఆరోపించినట్లుగా పిటిఐ నివేదించింది. మే 23న రాజా, సోనమ్ కనిపించకుండా పోయారు. జూన్ 2న మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా సమీపంలోని ఒక లోయ నుండి అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కి తిరిగి వచ్చిన సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు రాజా హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను అరెస్టు చేశారు.
ఈ ఘటన తర్వాత ఇలాంటి సంఘటనలకు భారతదేశ మీడియా కవరేజీని బాగా ఇవ్వడం మొదలు పెట్టింది. ఇంతలో ఓ వ్యక్తి సొంత అమ్మమ్మను పెళ్లి చేసుకున్నాడనే వాదనతో కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"అమ్మమ్మను పెళ్లి చేసుకున్న మనవడు.. తాత పోయాక జరిగిందదే మరి..
అమ్మమ్మ అంటే అమ్మ లాంటి అత్మీయతను పంచుతుంది. అమ్మ స్థానంలో ఉండి మన గురించి అలోచిస్తుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ అమ్మమ్మ.. అమ్మ స్థానం కాదు భార్య స్థానాన్ని భర్తీ చేసింది:
అమ్మమ్మ అంటే అమ్మ లాంటి ఆత్మీయతను పంచుతుంది. అమ్మ స్థానంలో ఉండి మన గురించి ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ అమ్మమ్మ. అమ్మ స్థానం కాదు భార్య స్థానాన్ని భర్తీ చేసింది. అవును... హర్యానాలో 21 ఏళ్ల మనవడు 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్నాడు. భర్త పోయాక సుల్తానా ఖటూన్ ఒంటరిగా ఉండటంతో.. తనకు మద్దతిచ్చేందుకు వచ్చాడు మనవడు ఇర్ఫాన్. తాతపోయిన టైమ్లో ఎమోషనల్ సపోర్ట్ అందించాడు. అయితే అది కాస్త కొన్నాళ్లకు రొమాంటిక్గా మారింది ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత బలంగా అయిపోయింది. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కమ్యూనిటీ వ్యతిరేకించినా ఒక్కటయ్యారు. కాగా ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాజం ఎటుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది." అంటూ పోస్టులు పెట్టారు.
తెలుగు న్యూస్ పోర్టల్ దిశలో కూడా అందుకు సంబంధించిన కథనం మాకు లభించింది.
"అమ్మమ్మ అంటే అమ్మ లాంటి ఆత్మీయతను పంచుతుంది. అమ్మ స్థానంలో ఉండి మన గురించి ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ అమ్మమ్మ.. అమ్మ స్థానం కాదు భార్య స్థానాన్ని భర్తీ చేసింది. అవును.. హర్యానాలో 21ఏళ్ల మనవడు 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్నాడు. భర్త పోయాక సుల్తానా ఖటూన్ ఒంటరిగా ఉండటంతో.. తనకు మద్దతిచ్చేందుకు వచ్చాడు మనవడు ఇర్ఫాన్. తాతపోయిన టైమ్లో ఎమోషనల్ సపోర్ట్ అందించాడు. అయితే అది కాస్త కొన్నాళ్లకు రొమాంటిక్గా మారింది. ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత బలంగా అయిపోయింది. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు." అంటూ కథనం ఉంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొన్నాం.
వైరల్ ఫోటోను మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఓ భర్త తన భార్యకు ప్రియుడితో వివాహం చేయించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుందనే కథనాలు మాకు లభించాయి.
"Another UP shocker: Kanpur man organises wife's wedding to lover; gives consent after panchayat" అనే టైటిల్ తో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మాకు లభించింది. వైరల్ అవుతున్న ఫోటోలోనూ, ఈ నివేదిక లోని ఫోటో రెండూ ఒకటేనని గుర్తించాం.
https://timesofindia.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
కాన్పూర్ దేహత్‌లోని రసూలాబాద్ ప్రాంతంలో ఓ భర్త భార్యతో 15 ఏళ్ల వివాహ సంబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఆమె ప్రేమికుడితో వివాహానికి ఏర్పాట్లు చేశాడు. భార్య తన మొదటి భర్తతో తన సంబంధాన్ని ముగిస్తూ లిఖిత పత్రాలను కూడా అందించింది.
భగ్గ నివాడ గ్రామ పెద్ద జై చంద్ మాట్లాడుతూ, కూలీ అయిన యోగేష్ తివారీ (40) ఔరంగ్‌పూర్ సాంభికి చెందిన కృపా శంకర్ మిశ్రా కుమార్తె సోని (30)ను మే 2010లో వివాహం చేసుకున్నాడు. అయితే, సోని కన్నౌజ్‌కు చెందిన వికాస్ ద్వివేది (35)తో అక్రమ సంబంధం కొనసాగించిందని జై చంద్ అన్నారు. దీని వల్ల దంపతుల మధ్య గొడవలు జరిగాయని ఆయన అన్నారు. సోని ఇటీవల తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఆమె తన భర్త ఇంటికి తిరిగి వచ్చింది. ఆ రోజు వికాస్ కూడా గ్రామానికి వచ్చాడు. అతన్ని గమనించిన యోగేష్ 112 నంబర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. వికాస్ మొదట్లో పారిపోయినప్పటికీ, యోగేష్ తన భార్య ఇష్టాలను గుర్తించి, తిరిగి రావాలని కోరాడు. ఆ తర్వాత ఒక పంచాయితీ నిర్వహించారు. సోని ప్రియుడితో ఉండడానికి ఇష్టపడుతూ ఉండడంతో, ఆమె వివాహానికి భర్త అనుమతి ఇచ్చాడు.
ఇదే ఘటనను పలు మీడియా సంస్థలు నివేదించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
తిస్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒక ఆలయంలో సోని, వికాస్ వివాహాన్ని యోగేష్ స్వయంగా జరిపించాడు. పోలీసు అధికారులు, గ్రామస్తుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. యోగేష్- సోనిల 12 ఏళ్ల కుమారుడు తన తల్లితో కలిసి వెళ్లాడని వార్తా నివేదికలు తెలిపాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : భర్త తన భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి
Claimed By : Social Media Users
Fact Check : Unknown