ఫ్యాక్ట్ చెక్: నటి మీనాక్షి చౌదరిని ఏపీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా సాధికారిత బ్రాండ్‌ అంబాసిడర్‌గా హీరోయిన్‌ మీనాక్షి చౌదరి

Update: 2025-03-03 04:55 GMT

రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వం పలు కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్లను నియమిస్తూ ఉంటారు. ముఖ్యంగా పలువురు నటీనటులు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమవుతూ ఉంటారు. గతంలో నటి సమంతా రూత్ ప్రభు తెలంగాణ రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు, స్థానిక నేత కార్మికులను, సాంప్రదాయ హస్తకళను ప్రోత్సహించే బాధ్యతలు ఆమె తీసుకున్నారు. నటి పూనమ్ కౌర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో చేనేత పరిశ్రమకు కృషి చేసే బాధ్యతలను పోషించారు.


నటి మీనాక్షి చౌదరికి ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించిందంటూ అటు సోషల్ మీడియాలోనే కాదు, ఇటు పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.

తెలుగు చిత్రసీమలో మోస్ట్ హ్యాపెనింగ్ నటీమణుల్లో ఒకరైన నటి మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిందని పలు కథనాలను ప్రచురించారు. మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో, దుల్కర్ సల్మాన్ సరసన లక్కీ భాస్కర్ సినిమాలోనూ కీలక పాత్రలు పోషించింది. 2025లో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకుంది.


ఆమెకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించిందంటూ అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ కథనాలు వైరల్ అయ్యాయి.

"ఏపీ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌ గా నటి మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మీనాక్షి చౌదరి తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ ను అందుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారిత కోసం మీనాక్షీ చౌదరి కృషి చేయనున్నారు." అంటూ పోస్టులు వైరల్ అయ్యాయి.







వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు:



 



ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేయగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ వాదనలను ఖండిస్తూ @FactCheckAPGov అకౌంట్ లో పోస్టు పెట్టింది.

"ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారమైన చర్యలు ఉంటాయి.
#FactCheck
#AndhraPradesh" అంటూ వివరించారు.




ఇక వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని పలు మీడియా సంస్థలు కూడా
కథనాలను
ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

"Meenakshi chaudhary: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి.. ప్రచారంలో నిజమెంత?" అంటూ ఈనాడు లో కథనాన్ని చూడొచ్చు. మీనాక్షి చౌదరి నియామకం పట్ల సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టిందని ఈనాడు కథనంలో చూడొచ్చు. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్‌ ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించిందని ఈనాడు సంస్థ తెలిపింది.


కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మీనాక్షి చౌదరిని ఏపీ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌ గా నటి మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.


Claim :  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా సాధికారిత బ్రాండ్‌ అంబాసిడర్‌గా హీరోయిన్‌ మీనాక్షి చౌదరిని నియమించారు
Claimed By :  Social Media users, Media Channels
Fact Check :  Unknown
Tags:    

Similar News