ఫ్యాక్ట్ చెకింగ్: రిషీకేశ్ లో బంగీ జంపింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

వైరల్ వీడియో నిజంగా జరిగిన ఘటన కాదు

Update: 2025-05-28 15:47 GMT

పర్యాటక ప్రాంతాల్లో తప్పకుండా ఆకట్టుకునే సాహసాల్లో బంగీ జంప్ ఒకటి. బంగీ జంపింగ్ సమయంలో జంపర్ ఎత్తైన ప్రదేశం నుండి రబ్బరు (బంగీ) త్రాడును కట్టుకుని దూకేస్తాడు. అలా కిందకు పడిపోయిన తర్వాత, ఆ త్రాడు కొంత దూరం వెనక్కి బౌన్స్ అవుతుంది. మనకున్న ధైర్యం ఎంతో తెలుసుకోడానికి ఈ సాహసాన్ని కొందరు చేస్తూ ఉంటారు. పలువురు ప్రముఖులు కూడా ఇలాంటివి చేసి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ బంగీ జంప్ సమయాల్లో కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి.

బంగీ జంపింగ్ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ లో చోటు చేసుకుందని పలువురు నెటిజన్లు చెబుతున్నారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఎత్తైన ప్లాట్‌ఫామ్ అంచున దూకడానికి సిద్ధంగా నిలబడి ఉన్నట్లు చూపిస్తుంది, అకస్మాత్తుగా ప్లాట్‌ఫామ్ కూలిపోయి ముగ్గురూ పడిపోయారు.
"రిషికేశ్ కు సంబంధించిన ఒక భయానక వీడియో, దీనిలో బంగీ జంపింగ్ ప్లాట్‌ఫామ్ విరిగిపోతున్నట్లు కనిపిస్తుంది. ఈ సంఘటన థ్రిల్ మధ్య భద్రతా ఏర్పాట్లపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతుంది." అంటూ నెటిజన్లు ఈ వీడియోను పోస్టు చేశారు.
ऋषिकेश से सामने आया एक डरावना वीडियो, जिसमें बंजी जंपिंग का प्लेटफॉर्म टूटता हुआ नजर आ रहा है। ये घटना रोमांच के बीच सुरक्षा व्यवस्थाओं पर बड़ा सवाल खड़ा करती है। #Rishikesh #BungeeJumping #BrokenPlatform #ViralNews అంటూ మరొక నెటిజన్ హిందీలో ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు.


"Information Update 🚨 : Unconfirmed Visuals of Hrishikesh Bungee Jumping Accident.

#Hrishikesh
#bungeejumping
#Gangariver" అంటూ మరొక యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.


పలువురు నెటిజన్లు ఇది రిషికేష్ లో చోటు చేసుకున్న ఘటన అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.



 


ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో నిజమైనది కాదు. ఏఐ ద్వారా సృష్టించారు.
రిషికేష్ లో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటన ఏదైనా జరిగిందా అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు అలాంటి నివేదికలు ఏవీ లభించలేదు. ఇలాంటి ఘటన ఏదైనా జరిగి ఉండి ఉంటే తప్పకుండా అది వార్తల్లో నిలిచి ఉండేది.
ఈ వీడియోలో ‘ది క్లిఫ్’ అనే పేరు ఉందని మేము గమనించాము. ఈ క్లూ ఉపయోగించి, మేము గూగుల్ సెర్చ్ నిర్వహించాము. ‘ది క్లిఫ్’ నేపాల్‌లోని ఒక ప్రసిద్ధ రిసార్ట్ అని, బంగీ జంపింగ్, స్వింగింగ్ వంటి కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిందని కనుగొన్నాము. ‘ది క్లిఫ్స్’ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ లో వైరల్ వీడియోలో ఉన్న అదే ప్లాట్‌ఫామ్‌ను చూపించే అనేక వీడియోలను కూడా గుర్తించాం.





ది క్లిఫ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని వీడియోలలో కనిపించే బంగీ-జంపింగ్ స్పాట్ వైరల్ వీడియోలో కనిపించే దానితో సరిపోలింది.
నేపాల్ కు చెందిన ది క్లిప్ రిసార్ట్ లో అలాంటి విషాదకర ఘటన ఏదైనా జరిగిందేమోనని తెలుసుకోడానికి మేము ప్రయత్నించాం. అలాంటి ఘటన ఏదీ జరగలేదని నివేదికలు తెలిపాయి.
ది క్లిఫ్ సోషల్ మీడియా ఖాతాలను కూడా మేము సంప్రదించాం. వారి నుండి సమాచారం రాగానే ఈ ఆర్టికల్ ను అప్డేట్ చేస్తాం.
ఇక వైరల్ వీడియో ప్రామాణికతను ధృవీకరించడానికి వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ సెర్చ్ చేశాం. అసలు వీడియో మే 3న అప్‌లోడ్ చేయబడిన ‘క్వేక్ స్కైఫాల్’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో కనుగొన్నాం. అయితే ఈ వీడియోను AIని ఉపయోగించి సృష్టించారని, ఎవరికీ హాని జరగలేదని అందులో తెలిపారు.
Bungee Jump Turns Into CHAOS as Platform Crashes ⛓️#shorts అనే టైటిల్ తో Quake Skyfall అనే యూట్యూబ్ పేజీలో వీడియోను మే 3, 2025న అప్లోడ్ చేశారు.
"This is AI edited by me and created by me, no harm was done to no one, everyone is safe.." అని వీడియో వివరణలో ఉంది.

Full View

ఈ ఛానెల్ మరింత విశ్లేషణలో ఇది స్వీడన్ నుండి నిర్వహిస్తున్నారని తెలిపారు. AI ద్వారా సృష్టించిన అనేక వీడియోలను ఈ యూట్యూబ్ పేజీలో అప్లోడ్ చేశారని మేము ధృవీకరించాం.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని పలు మీడియా సంస్థలు కూడా ఫ్యాక్ట్ చెక్ చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తేలింది.
రిషీకేశ్ లో బంగీ జంపింగ్ చేస్తుండగా ప్లాట్ ఫామ్ కూలిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.


Claim :  వైరల్ వీడియో నిజంగా జరిగిన ఘటన కాదు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News