ఫ్యాక్ట్ చెక్: పోలీసు యూనిఫామ్ వేసుకుని దొంగలు దోపిడీకి పాల్పడుతున్న సీసీటీవీ వీడియో ఫుటేజీ ఢిల్లీ, మైసూర్ లో చోటు చేసుకున్నది కాదు

పోలీసు యూనిఫాం ధరించిన వ్యక్తి తలుపు తట్టి ఒక గ్లాసు నీళ్ళు అడిగే దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఖాళీ గ్లాసును వెనక్కి తీసుకోవడానికి మహిళ తలుపు తెరిచినప్పుడు, దొంగ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడు.

Update: 2023-08-22 15:20 GMT

పోలీసు యూనిఫాం ధరించిన వ్యక్తి తలుపు తట్టి ఒక గ్లాసు నీళ్ళు అడిగే దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఖాళీ గ్లాసును వెనక్కి తీసుకోవడానికి మహిళ తలుపు తెరిచినప్పుడు, దొంగ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడు. ఒక మహిళ వారిని ప్రతిఘటించడం, వారిపై కేకలు వేయడం కూడా మనం చూడవచ్చు. తరువాత, దొంగలు అక్కడి నుండి పారిపోయారు.

నవంబర్ 10, 2022న ‘థీఫ్ ఇన్ రోహిణి సెక్టార్ 3’ అనే టైటిల్‌తో యూట్యూబ్‌లో వీడియో షేర్ చేశారు.

Full View

మరో యూట్యూబ్ ఛానెల్ నవంబర్ 14, 2022న ‘Robbery in Rohini sec 3 Delhi’ అనే టైటిల్‌తో అదే వీడియోను షేర్ చేసింది.

Full View

మైసూర్‌లోని వొంటికొప్పల్‌లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటన ఇదని వాట్సాప్‌లో వీడియో ప్రచారంలో ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనను సంబంధించిన వీడియో అంటూ వైరల్ అవుతున్న వాదన అవాస్తవం. ఈ ఘటన 2022లో జైపూర్‌లో జరిగింది.

మేము వీడియో నుండి తీసుకున్న కీలక ఫ్రేమ్‌లతో సెర్చ్ చేయగా, అదే వీడియోను “जयपुर में पुलिस बनकर आए चोरों ने घर में घुसने कि कोशिश की, महिला ने बहादुरी दिखाकर भगाया।“ అనే టైటిల్‌తో న్యూస్ 24 పేరుతో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.

"జైపూర్‌లో, పోలీసుల వలె నటిస్తూ దొంగలు ఒక ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు, కానీ ఆ స్త్రీ ధైర్యంగా ప్రతిఘటించడంతో అక్కడి నుండి భయంతో పారిపోయారు." అని సెప్టెంబర్ 14, 2022న షేర్ చేశారు.
కీవర్డ్స్ ను ఉపయోగించి మరింత వెతికాం.. సెప్టెంబర్ 14, 2022న ప్రచురించిన వార్తా కథనాలను మేము కనుగొన్నాము.

TimesNow news.com ప్రకారం, రాజస్థాన్‌లోని జైపూర్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పోలీసు యూనిఫాం ధరించిన దొంగల ముఠా నగరంలోని అనేక ఇళ్లల్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించింది. ఒక ధైర్యవంతురాలైన మహిళ ప్రతిఘటించడంతో దొంగలు పారిపోవాల్సి వచ్చిందని కథనాలలో మేము చదివాము.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలో.. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఓ దొంగ తలుపు తట్టి గ్లాసు నీళ్లు అడిగాడు. స్త్రీ తలుపు తెరిచినప్పుడు, దొంగ మరో ఇద్దరితో కలిసి బలవంతంగా లోపలి ప్రవేశించాడు. అయితే, ఆ మహిళ వారిని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా.. సహాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.

ఈ సంఘటనను scroll.com కూడా నివేదించింది.

న్యూస్ 18 వైరల్ వీడియో పాతదని, సెప్టెంబర్ 2022 నాటిదని తెలిపింది. జైపూర్‌లో జరిగిన సంఘటనకు సంబంధించినదని స్పష్టం చేసింది.
వైరల్ వీడియో ఢిల్లీ లేదా మైసూర్ నగరాల్లో జరిగిన దోపిడీకి సంబంధించినది కాదు. ఈ వీడియో రాజస్థాన్‌లోని జైపూర్ నగరానికి సంబంధించినది. అది కూడా పాత CCTV ఫుటేజ్. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim :  The video showing burglars wearing police uniforms forcefully breaking into a house is from Rohini sector, Delhi, or Mathru Mandal, Mysore.
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News