నిజ నిర్ధారణ: మాత్రలు కలిపిన కేకులు పిల్లలకు పక్షవాతం కలిగిస్తాయా? లేదు

కేక్ ప్యాకెట్‌లో ట్యాబ్లెట్‌లను దాచిపెట్టి అమ్ముతున్నారనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది. మార్కెట్‌లో కొత్త కేక్ వచ్చిందనీ, అందులో ట్యాబ్లెట్‌లను పొందుపరిచి అమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Update: 2022-08-13 04:01 GMT

కేక్ ప్యాకెట్‌లో ట్యాబ్లెట్‌లను దాచిపెట్టి అమ్ముతున్నారనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది. మార్కెట్‌లో కొత్త కేక్ వచ్చిందనీ, అందులో ట్యాబ్లెట్‌లను పొందుపరిచి అమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేక్ వల్ల పిల్లలకు పక్షవాతం వస్తుంది అంతూ వస్తున్న క్లెయిం ఇలా ఉంది " మార్కెట్లోకి కొత్త కేక్ వచ్చింది. పిల్లలకు పక్షవాతం కలిగించే లూపో కంపెనీ యొక్క టాబ్లెట్ ఉంది, దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులకు ఫార్వార్డ్ చేయండి ఇది హిందూ ప్రాంతంలో ప్రత్యేకంగా విక్రయించబడుతుంది.. మీ పిల్లలు జాగ్రత్త"

ఈ వీడియో గత కొన్ని రోజులుగా వాట్సాప్‌తో పాటు సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా షేర్ అవుతోంది.

Full View


Full View


ఈ క్లెయిమ్ 2019 మరియు 2020 సంవత్సరాలలో కూడా వైరల్ అయింది. అప్పుడు క్లెయిం ఇదే ఉండింది కానీ తయారీదారు చైనీస్ కంపెనీ అంటూ ప్రచారం చేసారు.

Full View

నిజ నిర్ధారణ:

వీడియో లో చూపుతున్న కేకులు పక్షవాతానికి కారణమవుతున్నయనే వాదన అబద్దం. మొదటగా, ఈ కేకులను భారతదేశంలో విక్రయించడం లేదు, ఆన్‌లైన్‌లో కూడా ఇవి మన దేశం లో దొరకవు. వీడియో లుప్పో కొబ్బరి క్రీమ్ కేక్ ను చూపిస్తుంది, ఇది టర్కీ లోని సోలెన్ కంపెనీ వారు తయారు చేస్తున్నారు. ఈ కేకులు మార్కెట్‌లో కొత్తవి కావు, ఎందుకంటే అవి భారతదేశంలో అమ్మబడవు.

వైరల్ వీడియో స్క్రీన్‌గ్రాబ్ ను జాగ్రత్తగా గమనించిగా కేక్ పైభాగంలో ఉన్న చిన్న వృత్తాకార రంధ్రం కనిపిస్తుంది, ఇది మనల్ని తప్పుదారి పట్టించడానికి చేసి ఉండవచ్చని అనుమానం కలుగుతుంది.


సోలెన్ కంపెనీ గురించి వివరాలు ఉన్న అబౌట్ పేజీలో, లుప్పో బార్‌లు భారతదేశంలో విక్రయించబడడం లేదని మనం చూడవచ్చు.

https://en.solen.com.tr/en-US/corporate/about-us

ఆన్‌లైన్‌లో లుప్పో బార్‌లను విక్రయించే ఇతర వెబ్‌సైట్‌లు ఇక్కడ చూడొచ్చు, కన్నీ ఈ బార్‌లను విక్రయించే భారతీయ వెబ్‌సైట్లు ఏవీ లభించలేదు.

https://www.carrefouruae.com/mafuae/en/root-maf-category/food-navigation-category/food-cupboard/biscuits-crackers-cakes/cakes-cupcake-muffins/cake-muffin/luppo-ckbt-chocolate-184g/p/1352980

స్నోప్స్, బూమ్‌లైవ్ వంటి అనేక నిజ నిర్ధారణ చేసే సంస్థల ద్వారా 2020 సంవత్సరంలో ఈ క్లెయిం అవాస్తవమని తేలింది. టర్కిష్ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ 'టెయిట్' కూడా ఈ క్లెయిం ను తిరస్కరించింది. టెయిట్ ప్రయోగశాల నివేదికలను చేజిక్కించుకుంది, ఆ రిపోర్టులు కేక్ బార్‌లు పరీక్షలలో పాస్ అయినట్టు స్పష్టంగా చూపించింది.

టెయిట్ ఈ కేకుల తయారీ విధానాన్ని కూడా వివరించింది. ఇది ఆటోమేటెడ్ ప్రక్రియ అంటూ, తయారీ సమయంలో జోడించిన ఏవైనా మాత్రలు లేదా ఇతర పదార్థాలు బేకింగ్ ప్రక్రియలో కరిగించిపోతాయనీ, మిశ్రమంలో కలిసిపోతాయనీ తేల్చి చెప్పింది. ఉత్పత్తిని తయారు చేసిన తర్వాత మాత్రలు జోడించబడి ఉండవచ్చు.

https://teyit.org/solen-cikolataya-ait-luppo-markali-keklerin-icinden-hap-ciktigi-iddiasi

సోలెన్ అందించిన సమాచారం ఆధారంగా, ఈ కేక్‌ల ఉత్పత్తిలో ఉపయోగించే ఫిల్టర్‌లు 700 మైక్రాన్‌ల (0.7 మిల్లీమీటర్లు) కంటే పెద్ద కణాన్ని అడ్డుకుంటాయని అని స్నోప్స్ నివేదించాయి. అందువల్ల టాబ్లెట్‌లను ప్యాక్ చేయడానికి ముందు కేక్‌లో ఉంచడం చాలా అసంభవం.

లుప్పో కొబ్బరి క్రీమ్ బార్‌తో సహా సోలెన్ ఉత్పత్తులు స్నోప్స్‌కు తయారు చేయబడిన ప్లాంట్‌ల భద్రతా ధృవీకరణ పత్రాలను సోలెన్ అందించింది. ఆ తనిఖీలను స్విస్‌ కంపెనీ ఎస్‌జీఎస్‌ నిర్వహించింది.

https://www.snopes.com/fact-check/turkish-snack-bar-paralysis-tablet/

అందువల్ల, లుప్పో కేక్‌లు మార్కెట్లో కొత్తవి, వాటిలో పిల్లలలో పక్షవాతం పెంపొందించే మాత్రలు కలిపారు అనే వాదన అబద్దం

Claim :  Cakes with pills added to them can cause paralysis in Children
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News