ఫ్యాక్ట్ చెక్: గుజరాత్‌లోని బిర్సా ముండా గిరిజన విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్‌ SC/ST/OBC అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదనే వాదన నిజం కాదు

భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు (SCలు), షెడ్యూల్డ్ తెగలు (STలు), ఇతర వెనుకబడిన తరగతులు (OBCలు) వాళ్లకు 15%, 7.5%, 27%

Update: 2025-01-20 12:33 GMT

Birsa Munda University

భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు (SCలు), షెడ్యూల్డ్ తెగలు (STలు), ఇతర వెనుకబడిన తరగతులు (OBCలు) వాళ్లకు 15%, 7.5%, 27% చొప్పున ఆల్ ఇండియా బేసిస్ బై ఓపెన్ కాంపిటీషన్ లో ప్రత్యక్ష నియామకాల విషయంలో రిజర్వేషన్లు అందిస్తారుభారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ అట్టడుగు వర్గాలను కలుపుకొనిపోవడాన్ని, ప్రోత్సహించడానికి, సమాన అవకాశాలను అందించడానికి రూపొందించారు. పాతకాలం నాటి కుల వ్యవస్థ కారణంగా సామాజిక, ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కొన్న సంఘాల బాగు కోసం రిజర్వేషన్లను తీసుకుని వచ్చారు. రిజర్వేషన్ల లక్ష్యం చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న వర్గాలను ఉద్ధరించడం, వారికి విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యంలో సమాన అవకాశాలు ఉండేలా చేయడమే. ప్రభుత్వ ఉద్యోగాలు, సంస్థలలో రిజర్వ్‌డ్ స్థానాలను అందించడం ద్వారా, ఆర్థికంగా వెనుకబడిన సమూహాలు ఆర్థిక స్థిరత్వాన్ని పొందేందుకు రిజర్వేషన్ సహాయపడుతుంది. శతాబ్దాలుగా SC, ST, OBC వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక బహిష్కరణ, వివక్షను ఎదుర్కోడానికి రిజర్వేషన్లు తీసుకొచ్చారు.

సోషల్ మీడియాలో, ముఖ్యంగా Xలో, బిర్సా ముండా యూనివర్శిటీ షేర్ చేసిన రిక్రూట్‌మెంట్ నోటీసును షేర్ చేస్తూ, ఒక పోస్ట్ కూడా SC/ST/OBCకి కేటాయించబడలేదనే వాదనతో ప్రచారంలో ఉంది.  ‘गुजरात की बिरसा मुंडा ट्राइबल यूनिवर्सिटी में मैनेजमेंट के लिए वेकेंसी निकाली गई। यहां एक भी पद SC/ST/OBC के लोगों को नहीं दिया गया है। क्यों? क्योंकि यह वर्ग व्यवस्था चलाने के लिए फिट नहीं है। कहां से आया यह विचार? मनुस्मृति के अध्याय 10 का श्लोक 129 पढ़ो। "एकं एव तु शूद्रस्य प्रभुः कर्म समादिशत्। एतस्यैव हि सेवा अर्थं जन्म शूद्रस्य कीर्तितम्।" अर्थात् शूद्र का एक ही मुख्य कर्तव्य है, और वह है अन्य तीन वर्णों की सेवा करना। यहां से।‘ అంటూ హిందీలో పోస్టును వైరల్ చేస్తున్నారు. “బిర్సా ముండా గిరిజన విశ్వవిద్యాలయం, గుజరాత్ మేనేజ్మెంట్ కోసం ఖాళీని ప్రకటించింది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదు. ఎందుకు? ఎందుకంటే క్లాస్ సిస్టమ్‌ని అమలు చేయడం సరికాదు. ఈ ఆలోచన ఎక్కడ నుండి వచ్చింది? మనుస్మృతి 10వ అధ్యాయంలోని 129వ శ్లోకాన్ని చదవండి. "కానీ భగవంతుడు శూద్రుడికి ఒకే ఒక పని చేయమని ఆజ్ఞాపించాడు. శూద్రుని పుట్టుక గురించి ప్రస్తావించారు. శూద్రుడికి ఒకే ఒక ప్రధాన కర్తవ్యం, అది మిగిలిన మూడు కులాలకు సేవ చేయడం. " అంటూ అందులో తెలిపారు.



క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
కేవలం ఒకే ఒక్క ఉద్యోగం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అందులో భాగంగా మాత్రమే రిజర్వేషన్ ను అమలు చేయడం కుదరదని తెలిపారు. ఈ ఉద్యోగం కోసం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ స్థానాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి, ఇందుకు SC/ST/OBcకి చెందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ నోటీసులో అన్ని మేనేజ్‌మెంట్ స్థానాలకు పోస్టుల సంఖ్య '1' మాత్రమే అని చూపిస్తుంది.
సెప్టెంబరు 2023లో ప్రకటించిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ప్రభుత్వం కేడర్‌లో ఒకే పోస్టును భర్తీ చేస్తున్నట్లయితే రిజర్వేషన్ వర్తించదు. అయితే, రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన వ్యక్తి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, డిపార్ట్‌మెంటల్ ఫీడర్ రూట్ పదోన్నతి ద్వారా ఒకే పోస్టుకు ఎంపిక కావడానికి అర్హత కలిగి ఉంటే, అతన్ని సిగ్నెల్ పోస్ట్‌లో నియమించడం తప్పు కాదని స్పష్టం చేసింది.
భారత సుప్రీంకోర్టు ప్రకారం, ఒకే కేడర్ పోస్ట్‌లో ఒకే ఖాళీ ఉన్న సందర్భాల్లో, రిజర్వేషన్ వర్తించదు. ఒక కేడర్‌లో ఒకే ఖాళీ ఏర్పడితే, అది సాధారణ కేటగిరీ స్థానంగా పరిగణిస్తారు. దాన్ని రిజర్వ్‌డ్ కేటగిరీ ద్వారా భర్తీ చేయరు. బిర్సా ముండా విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్ పోస్టుల ఖాళీల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నప్పుడు రిజర్వేషన్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదనే వాదన తప్పుదారి పట్టిస్తూ ఉంది. సింగిల్‌ కేడర్‌ ఖాళీల నోటిఫికేషన్ సమయంలో రిజర్వేషన్‌ నిబంధనలను పాటించరు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలోనే ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ స్థానాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి, ఈ ఉద్యోగానికి SC/ST/OBcకి చెందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Claim :  గుజరాత్‌లోని బిర్సా ముండా గిరిజన విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలను ప్రకటించింది, వీటిలో ఏదీ SC/ST/OBC అభ్యర్థులకు ఇవ్వలేదు.
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News