ఫ్యాక్ట్ చెక్: మహాకుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించాక ఏపీ డిప్యూటీ సీఎం ఆసుపత్రి పాలయ్యారనే వాదనలో నిజం లేదు

2025 ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా సెలబ్రిటీలతో పాటు భారీ సంఖ్యలో భక్తులను ఆకర్షించింది. ఇప్పటికే 62 కోట్ల మంది

Update: 2025-02-24 13:51 GMT

Pawan Kalyan

2025 ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా సెలబ్రిటీలతో పాటు భారీ సంఖ్యలో భక్తులను ఆకర్షించింది. ఇప్పటికే 62 కోట్ల మంది యాత్రికులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అంబానీ, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు మహా కుంభమేళాను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఫిబ్రవరి 18, 2025న తన భార్య, కొడుకుతో కలిసి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.

ప్రయాగ్‌రాజ్‌లోని సంగం నీటిలో పవిత్ర స్నానం చేసిన కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం వచ్చిందన్న వాదనతో హాస్పిటల్ బెడ్‌లో పడుకుని ఉండగా వైద్యులు పరీక్షిస్తున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “నాలుగు రోజుల క్రితం, పవన్ కళ్యాణ్ మహాకుంభాన్ని సందర్శించి, సంగంలో స్నానం చేశారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఇది నీటి నాణ్యతతో సంబంధం కలిగి ఉంటుందా? అలా అయితే, వాస్తవాలను దాచకూడదు & ప్రజల భద్రత దృష్ట్యా వాటిని బహిర్గతం చేయాలి “ అనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

క్లెయిం ఆర్కైవ్ లింకును ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు, ఆసుపత్రిలో చేరలేదు. మేము ‘పవన్ కళ్యాణ్ + హాస్పిటల్’ అనే కీవర్డ్‌లను ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, అపోలో హాస్పిటల్‌ ని పవన్ కళ్యాణ్ సందర్శించినట్లుగా పలు కథనాలు లభించాయి.

మనీ కంట్రోల్ లో ప్రచురితమైన కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి స్కాన్‌లతో సహా అనేక పరీక్షలను నిర్వహించారు. ప్రాథమిక ఫలితాలను సమీక్షించగా, వైద్య నిపుణులు రాబోయే వారాల్లో అదనపు పరీక్షలు చేయించుకోవాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.

నివేదికల ప్రకారం
, పవన్ కళ్యాణ్ ఆసుపత్రి సందర్శన రొటీన్ చెకప్‌లో భాగం కాదు, పవన్ కళ్యాణ్ దీర్ఘకాలంగా వెన్నునొప్పితో బాధపడుతూ ఉన్నారు. వైద్యులు పలు సూచనలు చేశారు. పరీక్షలు చేయించుకోవాలని కూడా సూచించారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది.
ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తన అధికారిక విధులను పునఃప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని అభిమానులకు జనసేన పార్టీ తెలియజేసింది.
"అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న శ్రీ @PawanKalyan గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకొంటారు. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు శ్రీ పవన్ కల్యాణ్ గారు హాజరవుతారు." అంటూ వివరించింది జనసేన పార్టీ.
టైమ్స్ నౌ న్యూస్‌లో ప్రచురించిన కథనం ప్రకారం, వైద్యులు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు, అదనపు పరీక్షలను సూచించారు. అయితే, ఈ పరీక్షలు ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి ప్రారంభంలో నిర్వహించనున్నారు. పవన్ పర్యటన రొటీన్, రెగ్యులర్ చెకప్‌లో భాగం కాదు. పవన్ కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు, ఈ మధ్య కాలంలో వెన్ను నొప్పి తీవ్రమైంది. పవన్ కళ్యాణ్ ఆసుపత్రిని సందర్శించిన ఫోటోలు వైరల్‌గా మారడంతో అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఇది ఆందోళన కలిగించే సమస్య కాదని వివరణ వచ్చింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి గత కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్నందున ఈ పరీక్షలు నిర్వహించినట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభంలో స్నానం చేసిన తర్వాత ఆసుపత్రి పాలయ్యారనే వాదన అవాస్తవం. గత కొన్ని రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్న ఆయన అపోలోలో పరీక్షలు చేయించుకున్నారు.
Claim :  మహా కుంభమేళాలో సంగమ నీటిలో పుణ్యస్నానం చేసిన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ ఉప CM పవన్ కళ్యాణ్ ఆసుపత్రి పాలయ్యారు
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News