ఫ్యాక్ట్ చెక్: భారత వైమానిక స్థావరం ధ్వంసమైందంటూ పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఎడిటెడ్ ఆజ్‌తక్ వీడియో
సరిహద్దు వెంబడి నాలుగు రోజుల పాటు జరిగిన డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత, తక్షణమే అన్ని సైనిక చర్యలను నిలిపివేయాలని భారతదేశ
By - Satya Priya BNUpdate: 2025-05-12 10:29 GMT
సరిహద్దు వెంబడి నాలుగు రోజుల పాటు జరిగిన డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత, తక్షణమే అన్ని సైనిక చర్యలను నిలిపివేయాలని భారతదేశం, పాకిస్తాన్ మే 10, 2025న అంగీకరించాయి. భారతదేశం, పాకిస్తాన్ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి చర్చలు మే 12, 2025 తర్వాత జరగనున్నాయి. ఈ కాల్పుల విరమణ తర్వాత కూడా, పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని కొనసాగిస్తోంది, అధికారిక ఛానెల్‌లు, సోషల్ మీడియా రెండింటినీ ఉపయోగించి భారతదేశంలో అశాంతిని రెచ్చగొట్టడానికి, పలు సంఘటనలకు సంబంధించి తప్పుడు నివేదికలను వ్యాప్తి చేస్తోంది. భారతీయ పౌరులలో భయాందోళనలకు, అంతర్జాతీయ సమాజంలో గందరగోళానికి ఇలాంటి పోస్టులు కారణమవుతున్నాయి. గుజరాత్, ఉరి, నగ్రోటా, రాజౌరిలోని భారత స్థావరాల ధ్వంసం గురించి పాకిస్తాన్‌లోని పలు ఖాతాలు ప్రచారం చేస్తున్నాయి. అదేవిధంగా, అఖ్నూర్, భటిండా వైమానిక స్థావరాలను నాశనం చేసినట్లు PTV అనే వార్తా ఛానెల్ తెలిపింది. ఈ వాదనలన్నింటినీ భారత ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తోసిపుచ్చాయి.
కొన్ని పాకిస్తానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ తప్పుడు, తప్పుదారి పట్టించే వాదనలు ప్రసారం చేయడానికి భారత మీడియా సంస్థల ఎడిట్ చేసిన వార్తా నివేదికలను పంచుకుంటున్నాయి. పాకిస్తాన్ దాడుల సమయంలో భారత వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయని, భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోతున్నాయని భారతీయ టీవీ ఛానల్ 'ఆజ్ తక్' వార్తా నివేదికకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. “India Media Cry about His own Government # Operation Marsoos# IndiaPakWar # IndiaPakistanWar” అంటూ ఆజ్ తక్ యాంకర్ మాట్లాడుతున్న వీడియోను వైరల్ చేస్తున్నారు.
‘کل تک پورے پاکستان پہ قبضہ کرنے کی خبریں چلانے والا میڈیا آج اپنی فوج پہ برس پڑی అనే క్యాప్షన్ తో మరికొందరు పోస్టులు పెట్టారు. అనువదించినప్పుడు, “నిన్నటి వరకు మొత్తం పాకిస్తాన్‌ను ఆక్రమించినట్లు వార్తలు ప్రసారం చేసిన మీడియా, నేడు భారత సైన్యంపై ప్రశ్నల వర్షం కురిపించింది.”
పాకిస్తాన్ వైమానిక దాడుల వల్ల దేశంలోని వైమానిక స్థావరాలు ధ్వంసమవుతున్నట్లు భారత మీడియా చూపిస్తున్నట్లు ఈ వీడియోను పాకిస్తాన్ సైనిక ప్రతినిధులు కూడా షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెక్:
భారత వైమానిక స్థావరం ధ్వంసమైందని, భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని భారత మీడియా సంస్థ ఆజ్‌తక్ నివేదించిందనే వాదన నిజం కాదు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి పాకిస్తాన్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అసలు వార్తా నివేదిక వీడియోను ఎడిట్ చేసి షేర్ చేశారు.
ఆజ్ తక్ ద్వారా అసలైన వార్తా నివేదిక కోసం వెతికినప్పుడు శ్రీ సేవా కేంద్రం అనే యూట్యూబ్ వినియోగదారుడు “Pakistan lying in front of International media “ అనే శీర్షికతో ప్రచురించిన వీడియో మాకు లభించింది. ఈ వీడియోలో పాకిస్తాన్ సైనిక ప్రతినిధి వైరల్ వీడియోను షేర్ చేశారు. ఇది ఆజ్ తక్ ప్రచురించిన వార్తా నివేదికకు సంబంధించిన ఎడిటెడ్ వెర్షన్. ఈ వీడియో 0.19 నిమిషాల నుండి అసలు నివేదికను చూడవచ్చు.
అసలు వీడియోలో, పాకిస్తాన్ లక్ష్యాలపై భారత సైన్యం చేసిన దాడులను యాంకర్ చెప్పడం, భారత దాడుల నుండి తన పౌరులను రక్షించలేని పాకిస్తాన్ ప్రభుత్వం గురించి మాట్లాడటం మనం వినవచ్చు.
మే 11 న జరిగిన సైనిక సమావేశంలో పాకిస్తాన్ ఇటీవల చెప్పిన అబద్ధాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్-చెక్ యూనిట్
అబద్దపుది అని తేల్చింది న్యూస్ 24 లో వచ్చిన ఒక కథనం కూడా మాకు లభించింది. పాకిస్తాన్ DG ISPR, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తన మీడియా సమావేశంలో, భారతీయ వైమానిక స్థావరం ధ్వంసమైందని చెప్పడానికి ఆజ్ తక్ న్యూస్ ఛానల్ కు సంబంధించిన పూర్తి వీడియో క్లిప్‌లోని ఒక చిన్న భాగాన్ని ఉపయోగించారు. ఆ క్లిప్‌ను సాక్ష్యంగా చూపిస్తూ "ఇప్పుడు నేను మీకు మరో క్లిప్‌ను చూపిస్తాను" అని ఆయన చెప్పడం వినిపించింది. ఈ వీడియో ఆజ్ తక్ నుండి యాంకర్, విలేకరులను చూపించే వైరల్ వీడియో.
పాకిస్తాన్ DG ISPR చూపించిన వీడియోను పాక్ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నంలో తయారు చేసిన నకిలీ ఫుటేజ్‌గా పేర్కొన్నారు. పాకిస్తాన్ అబద్ధాలను ఖండిస్తూ, PIB నిజమైన ఫుటేజ్‌ను పంచుకుంది, దీనిలో యాంకర్ భారత దళాలు పాకిస్తాన్ వైమానిక స్థావరాన్ని నాశనం చేయడం గురించి మాట్లాడుతున్నారు.
వైరల్ వీడియో నకిలీదని పేర్కొంటూ PIB ఫ్యాక్ట్ చెక్ ట్వీట్‌ను కూడా మేము కనుగొన్నాము. PIB ఫ్యాక్ట్ చెక్ తన ట్వీట్‌లో, ‘పాకిస్తాన్ DG ISPR మీడియా సమావేశంలో ఆజ్ తక్ న్యూస్ ఛానల్ పూర్తి వీడియో క్లిప్‌లోని చిన్న భాగాన్ని ఉపయోగించి భారత వైమానిక స్థావరం ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఇది పాకిస్తాన్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి చేసిన ప్రయత్నం, నకిలీ ఫుటేజ్‌లను సాక్ష్యంగా చూపించారు. పూర్తి వీడియోలోని కథనం ప్రకారం, భారత దళాలు పాకిస్తాన్ వైమానిక స్థావరాన్ని నాశనం చేయడం గురించి న్యూస్ ఛానల్ లో చూపించారు’ అని నివేదించారు.
కాబట్టి, భారత వైమానిక స్థావరం ధ్వంసమైందని, భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని భారత మీడియా సంస్థ ఆజ్‌తక్ నివేదించిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఎడిట్ చేశారు.
Claim : భారత వైమానిక స్థావరం ధ్వంసమైందని, భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని మీడియా సంస్థ ఆజ్‌తక్ నివేదించినట్లు వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By : Social media users
Fact Check : Unknown