ఫ్యాక్ట్ చెక్: నటులు అమీర్ ఖాన్, రణవీర్ సింగ్ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వలేదు, వీడియోలు ఎడిట్ చేశారు.

భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తూ ఉంది. ఏప్రిల్ 19, 2024న మొదటి దశ మొదలైంది. దేశంలో ఎన్నికలు సుదీర్ఘంగా సాగనున్నాయి. ఇక రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారం కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను కూడా ఉపయోగిస్తున్నారు.

Update: 2024-04-20 12:07 GMT

Congress

భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తూ ఉంది. ఏప్రిల్ 19, 2024న మొదటి దశ మొదలైంది. దేశంలో ఎన్నికలు సుదీర్ఘంగా సాగనున్నాయి. ఇక రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారం కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను కూడా ఉపయోగిస్తున్నారు.

కొన్ని పార్టీలు మరణించిన నాయకుల ఏఐ వీడియోలను కూడా ఉపయోగిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో, దివంగత నేతలు జయలలిత, కరుణానిధిలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
2016లో మరణించిన జయలలిత
రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా AI ద్వారా రూపొందించిన ఆడియో సందేశం వైరల్ అయింది.

2018లో మరణించిన కరుణానిధికి సంబంధించిన ఒక వీడియో కూడా AI ద్వారా రూపొందించిన వీడియోను ఉపయోగించి సృష్టించారు. అందులో ఆయన తన కుమారుడు MK స్టాలిన్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రిని ప్రశంసించారు.
2023లో తెలంగాణ ఎన్నికల సందర్భంగా, భారత రాష్ట్ర సమితి అభిమానులు, ఆ పార్టీ అధినాయకుడు కె.చంద్ర శేఖర్ రావుకు సంబంధించి వివిధ భంగిమల్లో AI ద్వారా రూపొందించిన చిత్రాలను విడుదల చేశారు.

వీడియో -1

అయితే, 2014లో జరిగిన ఓ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని భారత్‌లోకి తీసుకువస్తామని ప్రజలకు చెప్పారు. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షల రూపాయల నల్లధనాన్ని డిపాజిట్ చేస్తానని ప్రధాని మోదీ చెప్పారని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు గుర్తు చేశారు. దీనిని గుర్తు చేస్తూ ఇప్పుడు అమీర్ ఖాన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ వీడియోలో, భారతదేశంలోని ప్రతి పౌరుడు లక్షాధికారి అని ఆయన చెప్పడం వినవచ్చు. "ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 15 లక్షలు ఉండాలి. కానీ ఖాతాలలో అలాంటి డబ్బు ఇంకా రాలేదు.. అందుకే, నకిలీ హామీల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలను ఆయన కోరడం ఈ వీడియో సాగుతుంది.
“भारत का हर नागरिक लखपति है क्योंकि सबके पास काम से कम 15 लाख तो होने ही चाहिए .. क्या कहा आपके अकाउंट में 15 लाख नहीं है.. तो आपके 15 लाख गए कहां ??? तो ऐसे जुमलेबाजों से रहे सावधान नहीं तो होगा तुम्हारा नुकसान” అంటూ హిందీలో పోస్టులు పెట్టారు.



వీడియో - 2 

మరో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కూడా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రచురించిన మరో వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఈ వీడియోలో ఆయన ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారన్నట్లుగా ప్రచారం చేశారు.

“భారత పౌరులు ఆనందంగా ఉండడం మోదీజీకి ఇష్టం ఉండదు. భారతదేశంలో న్యాయం అనేది లేకుండా పోయింది. మనం ఈ దేశంలో న్యాయం, అభివృద్ధి గురించి మాట్లాడకూడదు" అని చెప్పడం వినొచ్చు. రణవీర్ సింగ్ మాట్లాడుతున్నప్పుడు ఆయన నుదుటిపై తిలకం ఉండడం మనం చూడవచ్చు.


ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. అమీర్ ఖాన్, రణవీర్ సింగ్‌లకు సంబంధించిన వేరే వీడియోలను తీసుకుని బీజేపీని విమర్శించేలా AI-ద్వారా సృష్టించిన ఆడియోను ఉపయోగిస్తూ ఉన్నారు. మేము రెండు వీడియోలను చూసినప్పుడు, వీడియోలోని కొన్ని భాగాలలో సరైన లిప్ సింక్ కూడా లేదు. చెబుతోంది ఒకటైతే.. ఆడియో వస్తోంది మరొకటి అని మనం గుర్తించవచ్చు.


వీడియో -1:

అమీర్ ఖాన్ కు సంబంధించిన వైరల్ వీడియోలో.. అమీర్ ఖాన్ నటించిన టీవీ షో ‘సత్యమేవ జయతే’ టైటిల్ మ్యూజిక్‌కి సరిపోయే సంగీతం మనకు వినపడుతుంది. ఈ షో స్టార్ టీవీలో ప్రసారమైంది. మేము వీడియో నుండి సంగ్రహించిన స్క్రీన్‌షాట్ ను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాం. ఆగస్టు 30, 2016న సత్యమేవ జయతే YouTube ఛానెల్‌లో ప్రచురించిన అసలు వీడియోను మేము కనుగొన్నాము.

ఒరిజినల్ వీడియోలో.. వైరల్ వీడియోలో ఉన్న అదే దుస్తులను ధరించాడు. భారతదేశంలోని ప్రతి పౌరుడి వద్ద కోటి రూపాయలు ఉండాలని చెప్పాడు. ప్రోమోలో: “మిత్రులారా, భారతదేశం పేద దేశం అని మీరు అనుకుంటే మీరు పూర్తిగా తప్పు. ఎందుకంటే ఇక్కడి ప్రతి పౌరుడు కోటీశ్వరులే. ప్రతి ఒక్కరి దగ్గర కనీసం కోటి రూపాయలు ఉండాలి. మీ దగ్గర ఈ మొత్తం లేదా? ఇంతకీ మీ రూ. కోటి ఎక్కడికి పోయింది? ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుసుకోండి." అని చెప్పడం వినొచ్చు.

Full View

వైరల్ వీడియోపై అమీర్ ఖాన్ బృందం స్పందించింది. అమీర్ ఖాన్ కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని.. ఏ రాజకీయ పార్టీతో కూడా అనుబంధం లేదని తేల్చి చెప్పారు. నటుడి కార్యాలయం కూడా స్పందించింది. “అమీర్ ఖాన్ తన 35 ఏళ్ల కెరీర్‌లో ఏ రాజకీయ పార్టీకీ ఎన్నడూ మద్దతు తెలియజేయలేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. గత ఎన్నికలలో ఎన్నికల కమిషన్‌కు ప్రచారాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆయన తన ప్రయత్నాలు చేశారు." అని ప్రకటన వచ్చింది.


వీడియో 2:

రణ్‌వీర్ సింగ్ కూడా భారత జాతీయ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తూ, ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న వీడియో కూడా 'ఓట్ ఫర్ న్యాయ్, ఓట్ ఫర్ కాంగ్రెస్' అనే క్యాప్షన్‌తో వైరల్ అవుతోంది.

మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను సెర్చ్ చేయగా.. అసలు వీడియో ANI యూట్యూబ్ ఛానెల్‌లో కనిపించింది. “బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రధాని మోదీ చేపట్టిన ‘వికాస్ భీ, విరాసత్ భీ’ విజన్‌ను ప్రశంసించారు” అనే శీర్షికతో వీడియోను ప్రచురించారని మేము కనుగొన్నాము. ఈ వీడియోలో, ప్రధాని మోదీని ప్రశంసించడం చూడవచ్చు.

Full View

వీడియోలో కొన్ని సందర్భాల్లో ఆడియో లిప్ సింక్ లేదని మనం చూడవచ్చు. ఏప్రిల్ 14, 2024న ట్విట్టర్ ఖాతాలో ఇలాంటి వీడియోలు ప్రచురించినట్లు కూడా మేము కనుగొన్నాము.
రణ్ వీర్ సింగ్ ఇటీవల వారణాసి పర్యటనకు వెళ్లారు. డిజైనర్ మనీష్ మల్హోత్రా తరపున నటి కృతి సనన్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేస్తూ నమో ఘాట్‌లో ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు, ఇద్దరు తారలు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలను ఎడిట్ చేశారు.

అమీర్ ఖాన్, రణ్ వీర్ సింగ్ వీడియోలు తప్పుడు వాదనలతో వైరల్ అవుతున్నాయి. ఒరిజినల్ వీడియోలకు ఏఐ ద్వారా వాయిస్ ను సృష్టించారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim :  బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, రణవీర్ సింగ్ కాంగ్రెస్‌ కు మద్దతు తెలుపుతూ వీడియోలను విడుదల చేశారు
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News