ఫ్యాక్ట్ చెక్: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకీ, బీజేపీ పార్టీ కి సంబంధం లేదు, ఇది ఏఐ చిత్రం

పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో భారతీయ ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అయ్యారు. సోషల్ మీడియా

Update: 2025-05-21 11:31 GMT

Jyothi Malhotra

పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో భారతీయ ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అయ్యారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ISI ఉపయోగించుకుంటూ ఉందని తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ అనే ట్రావెల్ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. ఆమెకు 3.2 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో బాగా ఫాలోవర్లు ఉన్నారు. 

జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె గడుపుతున్న విలాసవంతమైన జీవితం, తరచూ సాగించిన పాకిస్థాన్ పర్యటనలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. ఆమె ఆదాయ వనరులకు, ఖరీదైన జీవనశైలికి పొంతన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విమాన ప్రయాణాల్లో సైతం ఫస్ట్ క్లాస్‌లోనే ప్రయాణించినట్లు సమాచారం. ఖరీదైన హోటళ్లలో బస చేయడం, ప్రముఖ రెస్టారెంట్లలోనే భోజనం చేయడం వంటివి ఆమె జీవనశైలిలో భాగంగా మారాయి. జ్యోతి పాకిస్థాన్ పర్యటన ఖర్చులన్నీ స్పాన్సర్లే భరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పాక్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఆమె చైనాకు కూడా వెళ్లినట్లు తేలింది. అక్కడ కూడా విలాసవంతమైన కార్లలో తిరగడం, ఖరీదైన నగల దుకాణాలను సందర్శించడం వంటివి చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆమెతో పాటు, 12 మందిని భారత పోలీసులు గూఢచర్యం చేస్తున్నారని, పాకిస్తాన్‌ కు సున్నితమైన సైనిక సమాచారాన్ని అందిస్తున్నారనే అనుమానంతో అరెస్టు చేశారు.

ఇంతలో, జ్యోతి మల్హోత్రా కాషాయ టోపీ ధరించగా దానిపై, బీజేపీ పార్టీ చిహ్నం కమలం ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిత్రంపై ‘ఆజ్ తక్’ లోగో ఉంది. “RSS व BJP की देश के साथ ग़द्दारी करने की फ़ितरत आज़ादी के आंदोलन से ही है. ये ज्योति मल्होत्रा जी हैं जिनकी गिरफ़्तारी करनी पड़ी सरकार को.” అంటూ పోస్టును వైరల్ చేస్తున్నారు. "ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు దేశ ద్రోహం చేసే అలవాటు స్వాతంత్ర్య ఉద్యమం నుండే ఉంది. ఇక్కడ ఉన్నది జ్యోతి మల్హోత్రా, ప్రభుత్వం వీరిని అరెస్టు చేయాల్సి వచ్చింది" అని ఆ పోస్టుల ద్వారా తెలిపారు.


వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
సర్క్యులేషన్‌లో ఉన్న చిత్రం నిజమైనదని, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారతీయ జనతా పార్టీ సభ్యురాలు అనే వాదన తప్పు. ఈ చిత్రం AI ద్వారా రూపొందించారు.
వైరల్ చిత్రాన్ని కనుగొనడానికి మేము ఆజ్ తక్ వెబ్‌సైట్, ఆజ్ తక్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను వెతికాము. ఆ చిత్రం ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్‌తో పాటు అందుకు సంబంధించిన వెబ్‌సైట్‌లో కూడా ఎప్పుడూ షేర్ చేయలేదని కనుగొన్నాము.
ఆజ్ తక్ స్వయంగా ప్రచురించిన ఫ్యాక్ట్ చెక్ కూడా మాకు లభించింది. జ్యోతి మల్హోత్రా చిత్రం AI ద్వారా సృష్టించారని తెలిపింది. వైరల్ చిత్రంలో ఉన్న ఫాంట్ కూడా ఆజ్ తక్ పోస్ట్‌కార్డ్‌లలో ఉపయోగించిన ఫాంట్ కంటే భిన్నంగా ఉంటుంది.
జాగ్రత్తగా గమనించినప్పుడు, వైరల్ చిత్రంలో కొన్ని తేడాలు మాకు కనిపించాయి. జ్యోతి టోపీపై ఉన్న కమలం గుర్తు, అసలైన బీజేపీ టోపీలో ఉండే కమలామ్ గుర్తు కి భిన్నంగా ఉందని తెలుస్తోంది. వాటి పరిమాణం, ఆకారం సాధారణంగా ఉండే బీజేపీ చిహ్నం నుండి భిన్నంగా ఉన్నాయి. రెండింటి మధ్య పోలికను ఇక్కడ చూడొచ్చు.

మేము isitAI, WasitAI వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డిటెక్షన్ టూల్స్ ను ఉపయోగించి వైరల్ చిత్రాన్ని తనిఖీ చేసాము. వైరల్ చిత్రం AI ఉపయోగించి సృష్టించారని మేము కనుగొన్నాము. వైరల్ చిత్రానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు ఇక్కడ ఉన్నాయి.



కాబట్టి, భారతీయ జనతా పార్టీతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధం ఉందని, కాషాయ టోపీ ధరించి కనిపించిందన్న ప్రచారం నిజం కాదు. వైరల్ చిత్రం AI ద్వారా సృష్టించారని. ఆమెకు బీజేపీతో అనుబంధాన్ని తెలియజేస్తుందనే వాదన కూడా నిజం కాదు.
Claim :  జ్యోతి మల్హోత్రా బీజేపీ టోపీ ధరించి నేషనల్ మీడియాలో కనిపించింది, ఆమెకు బీజేపీతో సంబంధం ఉందని రుజువు చేస్తుంది.
Claimed By :  Instagram Users
Fact Check :  Unknown
Tags:    

Similar News