Tirumala : తిరుమలకు ఎప్పుడు వస్తే సులువు దర్శనం అవుతుంది తెలుసా?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

Update: 2026-01-27 03:21 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. అయితే గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న భక్తుల రద్దీ అంత లేకపోయినా భక్తులు భారీగానే తిరుమలకు తరలి వచ్చారు. ఇటీవల వరసగా సంక్రాంతి సెలవులతో పాటు వరసగా వచ్చిన మూడు రోజుల సెలవులతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడిపోయింది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట కిలోమీటర్ల వరకూ క్యూ లైన్ విస్తరించి ఉండేవి. కానీ నేడు కొంత రద్దీ తగ్గిందని, సెలవుల అనంతరం తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో కొంత భక్తుల రద్దీ తక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

గత కొద్ది రోజులుగా...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఏ రోజు కూడా తక్కువగా లేదు. సోమవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ కొనసాగుతుంది. ముందుగా ప్లాన్ చేసుకున్న మేరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తుల సంఖ్యకు తగినట్లుగా వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. స్వామి వారికి మొక్కులు చెల్లించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది.
హుండీ ఆదాయం మాత్రం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల నుంచి మూడు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,791 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,141 మంది తలనీలాలలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.










Tags:    

Similar News