రెండు ముఠాల నుండి 10 లక్షల పైచిలుకు హాష్ ఆయిల్ పట్టివేత

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదకద్రవ్యాలను రూపుమాపేందుకు పోలీస్ శాఖ తీవ్రంగా కృషి చేస్తూ ఈ నేపథ్యంలోని ప్రత్యేక ఎస్ ఓ టి బృందాన్ని ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా మాదకద్రవ్యాలను హైదరాబాదుకు తరలిస్తున్న ముఠాలపై నిఘా పెడుతున్నారు.

Update: 2023-07-22 09:21 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదకద్రవ్యాలను రూపుమాపేందుకు పోలీస్ శాఖ తీవ్రంగా కృషి చేస్తూ ఈ నేపథ్యంలోని ప్రత్యేక ఎస్ ఓ టి బృందాన్ని ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా మాదకద్రవ్యాలను హైదరాబాదుకు తరలిస్తున్న ముఠాలపై నిఘా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలాపూర్ ఎస్ఓటి బృందం, మాదాపూర్ ఎస్ఓటి బృందం సనత్ నగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి హష్ ఆయిల్ ను హైదరాబాద్కు తరలిస్తున్న రెండు ముఠాలను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి భారీ ఎత్తున హర్ష ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.. ఎస్ఓటి బృందం నిన్న ఒక ముఠాను మరియు ఈరోజు ఉదయం మరో ముఠాను అరెస్టు చేశారు... మేడ్చల్ కు చెందిన బుద్రజ్ యూటేష్ వర్మ(27), సూరారం కి చెందిన మామిడి వెంకట హరికృష్ణ (28), జీడిమెట్ల కు చెందిన సయ్యద్ ఇమ్రాన్ (23) ఈ ముగ్గురు స్నేహితులు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. అయితే వీరికి వచ్చే సంపాదన వారి జల్సా లకు సరిపోవడం లేదు. దీంతో సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వైజాగ్ కి చెందిన కొండబాబుతో పరిచయం ఏర్పడింది... అయితే హర్ష ఆయిల్ తీసుకువచ్చి హైదరాబాదులో అవసరమైన వినియోగదారులకు అమ్మితే అధిక లాభాలు వస్తాయని కొండబాబు చెప్పడంతో నిందితులు ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ నుండి తక్కువ ధరకు హష్ ఆయిల్ కొనుగోలు చేసుకుని హైదరాబాద్కు తరలిస్తున్నారు. అయితే బాలనగర్ మాదాపూర్ ఎస్ఓటి పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగి 22వ తేదీ ఈరోజు ఉదయం 7:00 గంటలకు నిజాంపేట్ క్రాస్ రోడ్ బాచుపల్లి వద్ద కారులో వస్తున్న ముఠాను పట్టుకున్నారు. ముటేష్ వర్మ, వెంకట హరికృష్ణ ను పట్టుకొని వారి వద్ద నుండి 5 ml తో ఉన్న 230 చిన్న బాటిల్స్ ని, మూడు సెల్ ఫోన్లు, ఒక షిఫ్ట్ కారు మొత్తం కలిపి 10,10,000 విలువ గల వాటిని స్వాధీనం చేసుకున్నారు..

అలాగే మరో కేసులో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన నరమ్నడు ప్రవీణ్ కుమార్ (32), అనే వ్యక్తి ప్రస్తుతం రాజీవ్ గాంధీ నగర్ బోరుబండాలో నివసిస్తున్నాడు. ఇతను కన్స్యూమర్ మరియు పెడ్లర్... ఇతనిపై గతంలోనే ఎన్డిపిఎస్ కేసు నమోదైంది. అతనికి వచ్చే జీతంతో అసంతృప్తిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే వైజాగ్ చెందిన గాంధీ తో పరిచయం ఏర్పడి హర్ష ఆయిల్ విక్రయించి అధిక మొత్తంలో లాభాలు గడించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యం లోనే ప్రవీణ్ కుమార్ వైజాగ్ నుండి హాష్ ఆయిల్ తీసుకొని హైదరాబాద్కు తరలిస్తున్న సమయంలో ఎస్ఓటి బృందానికి పక్కా సమాచారం రావడంతో నిన్న 21వ తేదీన రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ప్రవీణ్ కుమార్ ను పట్టుకున్నారు. అతని వద్ద నుండి ఐదు ఎమ్ ఎల్ తో ఉన్న 70 చిన్న చిన్న బాటిల్స్, 4000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ మొత్తం 1,75,000 వాటిని స్వాధీనం చేసుకున్నారు.
బాలాపూర్ మరియు మాదాపూర్ ఎస్ఓటి బృందం సనత్ నగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి రెండు ముఠాల్లోని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి11,85,000 విలువగల హష్ ఆయిల్, కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు...
వైజాగ్ లో లక్ష రూపాయలకు హర్ష ఆయిల్ కొనుగోలు చేసి బాలానగర్ లో నాలుగు లక్షలు రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ ముఠా వైజాగ్ కి చెందిన కొండబాబు, గాంధీ ల నుండి హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లు కేటుగాళ్లు పోలీసులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ నుండి హాష్ ఆయిల్ కొనుగోలు చేసుకుని హైదరాబాద్కు తీసుకువచ్చి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ విద్యార్థులను టార్గెట్గా చేసుకొని అమ్మకాలు జరుపుతున్నారు. యువత గుట్టుచప్పుడు కాకుండా పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా హాష్ ఆయిల్ ను సిగరెట్ పై పూసుకొని పీల్చుతున్నారు.... కేవలం విద్యార్థులను మాత్రమే టార్గెట్గా చేసుకొని ఈ ముఠా వైజాగ్ నుండి తక్కువ ధరకు హాష్ ఆయిల్ ని కొనుగోలు చేసుకుని ఇక్కడ అవసరమైన విద్యార్థులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఎస్ఓటి బృందం అరెస్టు చేసిన వారిని మరియు స్వాధీనం చేసుకున్న వాటిని తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు వారిని అప్పగించారు. పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు...


Tags:    

Similar News