Hyderabad : హైదరాబాద్ లో రియల్టర్ దారుణ హత్య

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది.

Update: 2025-12-08 04:50 GMT

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది. కాప్రా సాకేత్ కాలనీ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు దారుణ హత్య కు గురయ్యారు. దుండగులు గన్ తో కాల్పులు జరిపి కత్తులతో దాడి చేసినట్లు గా పోలీసులు తెలిపారు. సాకేత్ కాలనీ కి చెందిన వెంకట రత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారి గా పోలీసులు గుర్తించారు.

పాత కక్షలే ఈ హత్యకు...
పాత కక్షలే ఈ హత్యకు కారణం అయ్యి ఉండవోచని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలుసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలు ఉంటే వాటి ద్వారా నిందితుల కదలికలను పసిగట్టవచ్చేమోనని భావిస్తున్నారు.


Tags:    

Similar News