Gold Price Today : గుడ్ న్యూస్ బంగారం కొనాలంటే పండగకు ముందే కొనేసేయండిక
ఈరోజు దేశంలో స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు మరింత ప్రియమవుతున్నాయన్న హెచ్చరికలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయాలంటే మామూలు విషయం కాదు. ఆషామాషీ కాదు. పేద, మధ్యతరగతి ప్రజలకు బంగారం భారంగా మారనుంది. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు చేరువలో ఉండగా, కిలో వెండి ధరలు మూడు లక్షలకు దగ్గరగా ఉన్నాయి. ఇలా ధరలు పెరుగుతుండటంతో బంగారం అంటేనే మోజు చచ్చిపోతుంది. బంగారాన్ని ఒకప్పుడు సెంటిమెంట్ గా భావించేవారు. అలాగే సంస్కృతి సంప్రదాయాలకు బంగారం, వెండి వస్తువులను నెలవుగా భావించేవారు. కానీ అదే బంగారం ఇప్పుడు ధరలు పెరగడంతో సెంటిమెంట్ ను కూడా పక్కన పెట్టేశారు.
కొనుగోలు చేయడాన్ని...
బంగారం, వెండి అంటే ఒకప్పుడు ఎగబడి కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ధరలను చూసి భయపడిపోతున్నారు. బంగారం స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. వన్ గ్రామ్ గోల్డ్ తో పాటు ప్లాటినంతో పాటు ఇతర గిల్ట్ నగలతో సరిపెట్టుకుంటున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కూడా మహిళలు బంగారు వస్తువులు ధరించడం కంటే గిల్టు నగలను కొనుక్కోని ఫొటోలు దిగే పరిస్థితి వచ్చింది. మరికొన్ని రోజులు బంగారం పరుగు ఇలాగే ఉంటే అమ్మకాలు మరింతగా పడిపోయే అవకాశాలున్నాయి. బంగారం, వెండి అంటే పెద్దగా ఎవరూ ఇష్టపడటం లేదు. కేవలం సంపన్నులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అందుకే డిమాండ్ లేకపోయినా ధరలు తగ్గడం లేదు.
నేటి ధరలు...
మదుపరులు కూడా బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేందుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇంత భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనమయితే నష్టాలు చవి చూస్తామని భయపడిపోతున్నారు. ఈరోజు దేశంలో స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,28,740 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,40,450 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,74,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు పెరిగే అవకాశముంది.